అధిక స్క్రీన్ సమయం నిశ్శబ్ద విపత్తు | More Screen Time is Silent Disaster | Sachin Tendulkar
https://youtu.be/Vx4e7CFwkCE?si=ComBmOZ-nd_PyBUY
కాలం మారింది పరిస్థితులు మారాయి పెద్దలు మారారు పిల్లలు మారారు. జీవనశైలి పూర్తిగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్లు వేగవంతమైన ఇంటర్నెట్ తో స్క్రీన్ సమయం విపరీతంగా పెరిగిపోయి తలెత్తుకొని తిరిగేవాళ్ళు చూసేవాళ్ళు అరుదైపోతున్నారు. అసాధారణ అలవాట్లు అసహజ జీవనశైలితో అనారోగ్యాల సంగతి సరేసరి. చిన్న వయసులోనే బీపి మధుమేహాల దశలు దాటి గుండెపోటు దాకా వచ్చేసాం. క్రికెట్ ఆడుతూ ఒకరు బ్యాడ్మింటన్ కోర్టులో మరొకరు జిమ్ లో ఇంకొకరు మూడు పదల వయసు కంటే ముందే హటాతుగా తనువును చాలించేస్తున్నారు. ఇక మన పని అయిపోయినట్లేనా స్మార్ట్ ఫోన్లకు బందేలం అయిపోయినట్లేనా స్క్రీన్ వ్యసనం నుంచే బయటకు రాలేమా ఆరోగ్యాన్ని కాపాడుకోలేమా ఆనందంగా జీవించలేమా అంటే కచ్చితంగా బయట పడొచ్చు అంటున్నారు భారతరత్న పురస్కార గ్రహిత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒకప్పుడు ఇంకెంతసేపు ఆటలంటూ పిల్లల్ని అమ్మలు లాక్కొచ్చేవాళ్ళు. ఇప్పుడు బయట ఆడుకోమని తోసేస్తున్న చిన్నారులు గడప దాటని పరిస్థితి. గతంలో 10వ తరగతి పాస అయితే సైకిల్ కొనివ్వాలంటూ పిల్లలు అడిగేవాళ్ళు. ఇప్పుడు ఒకటో తరగతి నుంచే టాబ్లు కావాలంటూ మారం చేస్తున్నారు. అప్పట్లో మార్కులు తక్కువ వస్తే పిల్లల్ని మందరించేవాళ్ళు ప్రస్తుతం కాస్త కోపంగా చూసిన వాళ్ళు ఎక్కడ నొచ్చుకుంటారో నని భయపడే పరిస్థితికి వచ్చేసాం. ప్రస్తుత జీవనశైలికి కొన్ని మార్పులు చేసుకుంటే ఆనందం ఆరోగ్యం సాధ్యమేనని క్రికెట్ దిగ్గజం సచిన్ చెబుతున్నారు. గంటల కొద్ది కూర్చోవడాన్ని తగ్గించుకోవడం, అధిక స్క్రీన్ సమయాన్ని నియంత్రించుకోవడం, ఆటలాడడం, వ్యాయామం చేయడం నడక ఆధునిక ఔషధాలు అంటున్నారు సచిన్. ఈ విషయంలో రావలసిన మార్కులపై ఈనాడుక ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు మాస్టర్ బ్లాస్టర్. ఆరోగ్యంగా చురుగ్గా ఉండడం ద్వారానే మనం గొప్ప ఆనందాన్ని పొందగలమని ఎందుకు ప్రత్యమనాయాలు లేవని సచిన్ అన్నారు. మరీ ముఖ్యంగా మేదస్సు, కృషి, కష్టాన్ని నమ్ముకొని సాగే వైవిధ్యభరితమైన భారత్ లాంటి దేశంలో పొలాల్లో కష్టపడే రైతులకైనా మైదానంలో సాధన చేసే క్రీడాకారులకైనా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకైనా ఆరోగ్యమే పునాది అన్నారు. దానికి మించిన భాగ్యం మరొకటి లేదన్నారు. మంచి ఆరోగ్యానికి ఆనందానికి క్రీడలు శారీరక కసరత్తు అద్భుత సాధనంగా పనిచేస్తాయని తెలిపారు. భారత్ క్రీడలను ఇష్టపడే దేశం నుంచి క్రీడలను ఆడే దేశంగా అవతరించాల్సిన ఆవశ్యకతపై కొన్నేళ్లుగా తరచూ చెబుతున్నాను అన్నారు. ప్రస్తుతం క్రీడా సంస్కృతిని పెంపొందించుకోవడం క్రీడలను ఆడే దేశంగా మారడం అత్యంత కీలకమని చెప్పారు. చిన్న పెద్ద తేడా లేకుండా స్క్రీన్ వ్యసనం పెరుగుతున్న నేపథ్యంలో ఇదో కీలక అవసరమని తెలిపారు. మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు ఫిట్ గా ఉండడానికి కావలసిన సమయం ప్రేరణ అనుకూలమైన వాతావరణం ఇప్పుడు లేవని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అన్నారు. సాంకేతిక అసాధారణ అపార ప్రయోజనాలను తెచ్చిపెట్టింది కానీ సుదీర్ఘకాలం కూర్చుని చేసే పనిని అలవాటు చేసింది. అవసరంగా మార్చేసింది. టీవీలు లేదా కంప్యూటర్ల ముందు పని చేయడం మొబైల్ ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఉండడం ఎక్కువ గంటలు కూర్చోవడానికి కారణం అవుతున్నాయని తెలిపారు. అధిక స్క్రీన్ సమయం ఇప్పుడు నిశశబ్ద విపత్తుగా యువతరానికి అతి పెద్ద ముప్పుగా మారిందన్నారు. ముఖ్యంగా పిల్లలు యువత దీనికి బానిసలుగా తయారవుతున్నారని ఈ పరిణామం బయట వెచ్చించే సమయాన్ని తగ్గించడమే కాకుండా నిద్ర ఏకాగ్రత సహా ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఫలితంగా చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు ఊబకాయం బీపి మధుమేహం బారిన పడుతున్నారని గుండెపోటు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. పిల్లలకు మనం ఇచ్చే గొప్ప బహుమతి ఖచ్చితమైన ఆట సమయంని సచిన్ సూచించారు. పిల్లల్ని తప్పనిసరిగా మైదానాల బాట పట్టించాలని మార్పు ప్రయత్నం మన ఇంటి నుంచే మొదలవ్వాలని అన్నారు. ఇంటి బయట లేదా మైదానాల్లో పిల్లలు పరిగెత్తడం కింద పడిపోవడం పైకి లేవడం మళ్ళీ ప్రయత్నించడం అందించే ఆనందం అనుభూతి అమూల్యమైనవని భవిష్యత్తులో భర్తీ చేయలేనివని అన్నారు. ఆరోగ్యకరమైన భారత్ ప్రయాణం చిన్న అడుగులతో ప్రారంభంవుతుందని దృఢంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. తక్కువ దూరానికి బైక్ కార్లో వెళ్లే బదులు నడవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నడకను వ్యసనంగా మార్చుకోవాలన్నారు. అధిక స్క్రీన్ సమయాన్ని అవసరం లేకపోయినా మొబైల్ ను చూడడాన్ని చాలా చాలా తగ్గించాలని 24 గంటలు మొబైల్ ను పక్కన పెట్టుకోవడం మానేయాలని ఏదో ఒక క్రీడను ఎంచుకొని ఆడాలని వ్యాయామం కోసం తప్పనిసరిగా రోజుకు కనీసం అరగంట కేటాయించాలని సూచనలు చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం అలవర్చుకోవడం కష్టమా అన్న ప్రశ్నకు అస్సలు కాదని సచిన్ సమాధానం ఇచ్చారు. సాధారణ అలవాట్లు మనల్ని ముందుకు తీసుకెళ్తాయి అన్నారు. పోషకాలు అధికంగా ఉండే ఆహారం తినడం కంటినిండా నిద్రపోవడం రోజు ఏదైనా ఒక క్రీడ ఆడడం లేదా వ్యాయామం దైనందిన జీవితంలో తప్పనిసరి కావాలని చెప్పారు. ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యానికి బాధ్యత వహించాలని అప్పుడే ఆరోగ్యకరమైన భారత్ను సృష్టించడంతో పాటు రాబోయే తరాలకు ప్రేరణ అందించగలమని స్ఫూర్తిగా నిలవగలమని అన్నారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల్లో రాణించాలన్న ఉత్సాహం ఆకాంక్ష చాలా కనిపిస్తున్నాయని అక్కడ క్రీడా సౌకర్యాల అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. విద్య ఆరోగ్యం క్రీడల్ని అభివృద్ధి సాధనాలుగా చూడాలని చెప్పారు. అందరం ఐకమత్యంతో ఉండడానికి ఆరోగ్యకరమైన సమాజం అవసరమని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు గౌరవం మర్యాద భావోద్వేగాలను అర్థం చేసుకునే లక్షణాలను నేర్పించాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజల భవిష్యత్తును పునర్నిర్మించడానికి శక్తిమంతమైన సంస్థలు చొరవ చూపాలని కోరారు. ఆరోగ్య అవగాహన కలిగిన గ్రామాలు సమాజంతోనే మరింత బలమైన సంఘటిత భారత సాధ్యమని స్పష్టం చేశారు. ఓం
No comments:
Post a Comment