What is Anger Management? Simple Guide in Telugu - Telugu Yahoo
https://youtu.be/d5552gC2k6c?si=N3XaD8bfQg40Ywjj
కోపం మనిషికి సహజంగా ఉండే ఒక రక్షణ వ్యవస్థ మనకు నష్టం జరిగిందని అవమానం జరిగిందని లేదా మనం నమ్మిన న్యాయం ఉల్లంఘించబడిందని మనకు అనిపించినప్పుడు మాత్రమే అది యాక్టివేట్ అవుతుంది. ఇది కేవలం ఒక భావోద్వేగం మాత్రమే కాదు ఇది మనలోని ప్రాథమిక బతుకుదెరువు మోడ్లో ఒక భాగం. వేల ఏళ్ల క్రితం మృగాలు శత్రువులు మనల్ని దాడి చేసినప్పుడు ఈ కోపమే శరీరాన్ని వెంటనే రెడీ చేసేది. లైక్ హార్ట్ బీట్ పెరగడం మజిల్ స్ట్రాంగ్ అవ్వటం రక్తంలో అడ్రనలిన్ పెరగడం ఇవన్నీ మనల్ని పోరాడడానికి లేదా తప్పించుకోవడానికి సిద్ధం చేసేవి. ఈ రియాక్షన్ ఇప్పటికీ మనలోనే ఉంది. కానీ సమస్య ఏంటంటే ఈ వ్యవస్థ పాతకాలంలో నిజమైన ప్రమాదానికి రియాక్ట్ అయ్యేది. బట్ ఇప్పుడు ఇవలో ఎవరైనా దూరినా సోషల్ మీడియాలో ఎవరో మన గురించి చెడుగా రాసినా బాస్ మీ మీద ఒత్తిడి పెట్టినా మన శరీరం వెంటనే యుద్ధానికి సిద్ధమనే మోడ్లోకి వెళ్తుంది. అంటే ఫిజికల్ డేంజర్ లేకపోయినా మానసికంగా అది అలాగే ఫీల్ అవుతుంది. కోపం మనకు రెండు రకాల మార్గాలు ఇస్తుంది. ఒకటి ఆ శక్తిని వాడి సమస్యని సరిచేయడం రెండోది ఆ శక్తిని వదిలేసి మాటల్లో లేదా చర్యలో విసరడం రెండో మార్గం తీసుకుంటే చాలాసార్లు సమస్య పెరుగుతుంది. ఎందుకంటే కోపం ఉన్నప్పుడు మన బ్రెయిన్ లోని లాజిక్ సెంటర్ కొంతసేపు సైలెంట్ అవుతుంది. ఎమోషన్ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. అందుకే కోపంలో తీసుకున్న నిర్ణయాలు తర్వాత పక్షతాపం కలిగిస్తాయి. మరొక రియల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆఫీస్ లో మీ ప్రాజెక్ట్ క్రెడిట్స్ మరొకరికి ఇచ్చారనుకో వెంటనే మీలో కోపం వస్తుంది. మీరు అక్కడే అందరి ముందు అరిస్తే ఆ క్షణం మీరు సంతృప్తి పొందవచ్చు. బట్ తర్వాత మీ ఇమేజ్ డ్ామేజ్ అవుతుంది. అదే ఆ కోపాన్ని లోపల ఉంచి కూల్ గా డాక్యుమెంట్స్ ప్రూఫ్లు చూపించి మీ విలువను నిరూపిస్తే అది ఫలితం ఇస్తుంది. అదే కోపాన్ని ఒక స్ట్రాటజీగా మార్చిన ఎగ్జాంపుల్ ఇది. సో మేటర్ ఏంటంటే కోపాన్ని పూర్తిగా అని చేయొద్దు ఎందుకంటే అది ఒక సిగ్నల్ లాంటిది ఏదో తప్పు జరిగిందని ఏదో మార్చాలని చెబుతుంది. కానీ ఆ సిగ్నల్ ఎలా వాడుతున్నామ అనేదే గేమ్. బుద్ధుడు అన్నట్టు అది వేడి బొగ్గు లాంటిది దాన్ని గోల్ కోసం ఉపయోగిస్తే దీపం అవుతుంది. అదే ఎమోషన్ గా విసిరేస్తే నిప్పులా కారులుస్తుంది. సో కోపం ఒక మిర్రర్ అది నీ బలహీనతలని చూపిస్తుంది. ఆ బలహీనతలని దాచేస్తే అవి మళ్ళీ మళ్ళీ బయటికి వస్తాయి. కానీ వాటిని అర్థం చేసుకొని బలంగా మార్చుకుంటే ఆ కోపమే నీకు ఫ్యూల్ అవుతుంది. ఎవరో నీ వల్ల కుదరదు అంటే కోపాన్ని ప్రూవ్ చేయడంలో వేసి గెలిచే వాళ్ళు చాలా తక్కువ కానీ వాళ్లే జీవితంలో చాలా దూరం వెళ్తారు.
No comments:
Post a Comment