Friday, September 26, 2025

Addiction అంటే ఏంటి? | వ్యసనం Explained in Telugu - Telugu Yahoo


Addiction అంటే ఏంటి? | వ్యసనం Explained in Telugu - Telugu Yahoo

https://youtu.be/u4OcNngmupU?si=xH-RX6pRKS2ORW1N


మనిషి ఏదో ఒక పని వస్తువు లేదా అలవాటుపై పూర్తిగా ఆధారపడిపోవడం అది లేకపోతే తన జీవితం నడవదనే ఫీలింగ్ కలిగితే దాన్నే వ్యసనం అంటాం. చాలామంది మద్యం, సిగరెట్, డ్రగ్స్ లాంటివి విన్న వెంటనే వ్యసనం అని అనుకుంటారు. కానీ అసలు వ్యసనం మొబైల్, సోషల్ మీడియా, గేమ్స్, ప్రేమ, పని ఏదైనా కావచ్చు. మనిషికి వ్యసనం ఎందుకు వస్తుందంటే మెదడలో ఆనందాన్ని ఇచ్చే డోపమైన్ అనే కెమికల్ వల్ల ఒక పని చేసేటప్పుడు టెంపరరీగా హ్యాపీనెస్ అనిపిస్తే మనసు మళ్ళీ మళ్ళీ అదే పని చేయాలని కోరుకుంటుంది. అంతేకాకుండా మనసులో ఖాళీగా అనిపించినప్పుడు సమస్యల నుంచి తప్పించుకోవాలనిపించినప్పుడు కూడా వ్యసనం పట్టేస్తుంది. ఒకసారి వ్యసనం ఆపేస్తే మొదట్లో చాలా కష్టంగా అనిపిస్తుంది. శరీరానికి మనసుకు అసహనం కలుగుతుంది. కానీ కొద్ది కాలం తర్వాత ఆ కాలిని కొత్త మంచి అలవాట్లు నింపేస్తాయి. నిజానికి మనిషి పూర్తిగా వ్యసనం లేకుండా ఉండడం చాలా అరుదు. కానీ తేడా ఏమిటంటే చెడు వ్యసనం మనల్ని కిందికి లాగుతుంది అదే మంచి వ్యసనం అయితే మనల్ని పైకి తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మద్యం తాగే అలవాటు ఉంటే అది శరీరాన్ని తోడుగా కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అదే వ్యాయామం చేస్తే ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఆనందం మొత్తం పెరుగుతాయి. సో నా పాయింట్ ఏంటంటే వ్యసనం అనేది మనసు తన నిజమైన రూపాన్ని చూడకుండా బయట ఏదో ఒక దాని మీద ఆధారపడి పోవటం కానీ ఆ ఆధారం వదిలేస్తే నేను నిజంగా ఎవరు అనే ప్రశ్నకు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. విషయం ఏంటంటే వ్యసనం తప్పదు కానీ మనం ఏ వ్యసనం ఎంచుకుంటున్నాం అనేదే మన జీవితాన్ని చెడగొడుతుందా లేదా అనేదే మనకి నిర్ణయిస్తుంది.

No comments:

Post a Comment