Wednesday, April 22, 2020

భౌతిక మనస్సు , ఉప చేతనాత్మక మనస్సు అంటే ఏమిటి?

🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌹🌹🌹🌹🌹
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు,

తేదీ ... 16 - 04 - 2020,
వారం ... బృహస్పతి వాసరే 【 గురువారం 】


నేటి మాట

భౌతిక మనస్సు , ఉప చేతనాత్మక మనస్సు అంటే ఏమిటి?

ప్రాపంచిక జ్ఞానం తో భౌతిక మనస్సు (చేతన మనసు) ఏర్పడుతుంది.

ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసు కుంటారో, దాన్ని ఆచరిస్తారో ఉప చేతనాత్మక మనస్సు (సబ్కాన్షియస్ మైండ్) ఎదుగుతుంది.

భౌతిక మనస్సు తర్కం తో ఆలోచిస్తుంది. ఏ పనైనా లాభం ఉంటే చెయ్య మంటుంది.

సబ్కాన్షియస్ మైండ్ వద్దని హెచ్చరిస్తుంది. ఫలాపేక్ష లేకుండా కర్మ చేయ మంటుంది.

అలా ఆ రెండింటికి ఎప్పుడూ యుద్ధం జరుగు తుంటుంది.

భూ లోకం లో ఏ మనిషి ఇది చెప్పినట్టు వినడు, సగటు మనిషి కి సబ్కాన్షియస్ మైండ్ 1% to 2% మాత్రమే తెరుచు కుని ఉంటుంది.

భౌతిక మనస్సు మనల్ని చెడు మార్గం లో దిగ జారే లా చేయడానికి ప్రయత్నిస్తుంది.

కాబట్టి దానిని గెలవ నీయ కుండా సబ్కాన్షియస్ మైండ్ చెప్పిన మాటలు విని నడుచుకోవాలి.

అప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుంది.

మనం చేసే ప్రతి కర్మ అది మంచి దైనా, చేడు దైనా, సబ్కాన్షియస్ మైండ్ ఆకాశిక్ రికార్డ్స్ లో మనం నిద్రావస్థ లో వున్నప్పుడు, ఆ రోజు చేసిన పనులన్నీ రికార్డ్ చేస్తుంది.

ఒక వ్యక్తి తాను నడుచు కున్న ప్రవర్తన ను బట్టి అతను ఏ ఆవరణకు అర్హుడో ఆ ఆవరణకు చేరేలా చేస్తుంది.

ఆత్మ లోకం లో ఏడు ఆవరణలు ఉంటాయి.

ఒక వ్యక్తి తాను చేసిన సత్కర్మలు అనగా నిస్వార్థం గా, ఫలాపేక్ష లేకుండా కర్మ ను ఆచరించే విధానాన్ని బట్టి ఆ ఆత్మ ఉన్నత ఆవరణకు చేరుతుంది.

4వ ఆవరణ నుండి ఉన్నత ఆవరణ గా పేర్కొన బడింది.

ఎప్పుడు ధర్మ బద్ధమైన జీవితం గడిపితేనే మన భవిష్యత్ బాగుంటుంది.

మనిషి జన్మించే టప్పుడే అతని ఆత్మ , అతని ఉప చేతనాత్మక మనస్సు , రెండు శరీరం లోకి ప్రవేశిస్తాయి.

🌹శుభమస్తు🌹

🙏సర్వే జనా సుఖినోభవంతు🙏

No comments:

Post a Comment