Friday, January 1, 2021

"ఆలోచనలు మరియు సంఘటనల రచనం" "భావోద్రేకాలు" - "అనుభవాలు"

🟢 పితామహ పత్రీజీ 05-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢

🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 05-09-2020🔸

Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.

"ఆలోచనలు మరియు సంఘటనల రచనం"
"భావోద్రేకాలు" - "అనుభవాలు"

" ఆలోచనలు సమత్వము పొందేంతవరకు అవి సజీవంగా ఉంటాయి. అవి చాలా శక్తివంతమైన జీవులు. కాని మనిషికి తెలిసిన జీవుల వలె కాదు."

"ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహాలను ఆలోచనలు ప్రేరేపిస్తాయి, ఒత్తిడికి గురి చేస్తాయి, ఎవరైతే ఈ ఆలోచన యొక్క బాహ్యీకరణను అనుమతిస్తారో ఆ వ్యక్తి లేదా వ్యక్తుల సమూహాలు ఆ సంఘటన చేత భౌతికంగా ప్రభావితం చెందుతారు."

" ఈ ఆలోచన యొక్క ఆకర్షణకు మరియు ఒత్తిడికి గురయ్యి ఎవరైతే ఆలోచన చేశారో వారిని ఆలోచన యొక్క బాహ్యీకరణకు అనుమతించారో వారిని అది ప్రభావితం చేస్తుంది. ఎవరైతే ఈ ఆలోచనలను కొనసాగించరో లేదా దాని యొక్క ప్రభావాన్ని అనుమతించరో వారు దాని ప్రభావానికి లోను కారు లేదా చర్యలకు పాల్పడరు."

" ఆలోచనలు మనిషి లేదా సంఘాల యొక్క మానసిక ఆవరణలో ఉంటాయి. అవి వారి హృదయాలలో స్థానం పొందుతాయి లేదా నిరాకరించబడతాయి. ఆలోచనను లోపలికి అనుమతించినపుడు అది కార్యాచరణను ప్రతిపాదిస్తుంది మరియు సమయం, ప్రదేశం, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ ఆలోచన ఒకరి మెదడు నుంచి విడుదల అవుతుంది. దాని యొక్క ప్రణాళిక బాహ్యంగా ప్రకటితమవుతుంది, మరియు ఎవరైతే ఒక వ్యక్తి లేదా ఒక సంఘం ఒక చర్యకు పాల్పడతారో తిరిగి అది ఆ వ్యక్తి లేదా ఆ సంఘం యొక్క జీవితంలో ఒక సంఘటనగా చోటు చేసుకుంటుంది. ఈ సంఘటన ద్వారా వారి ఆలోచన బాహ్యీకరణను చెందింది."

" సంఘటనలు భావోద్రేకాలను కలుగజేస్తాయి, అంటే, శరీర- నేను (DOER - IN - THE - BODY) మరియు సైకిక్ (శారీరక + మానసిక) ఆవరణలో మార్పులు కలుగజేస్తుంది."

" ఈ అనుభవాలు, అనుభవాన్ని పొందుతున్న వారి వర్తమాన లేదా గత ఆలోచన యొక్క బాహ్యీకరణల వలన కలుగుతాయి."

"ఒక స్వల్ప సంఘటన విపరీతమైన భావోద్రేకానికి కారణం కావచ్చు. ఆ భావోద్రేకమే అక్కడ విషయం."

"ఒక విషయం లేదా సంఘటన యొక్క ప్రాముఖ్యత దాని యొక్క భావ సంచలనానికి సంబంధించినది, అది ఎటువంటి సైకిక్ (శారీరక + మానసిక) ఫలితాలకు దారితీస్తుంది అనేది దాని ప్రాముఖ్యతను వెల్లడి చేస్తుంది."

" భావోద్రేకాలు అంటే చేసిన కార్యాలకు మూల్యం చెల్లించటం లేదా అసంపూర్తిగా వదిలివేసిన కార్యాలకు ఫలితం పొందటం ఈ విధంగా, మానసిక ఫలితాల ద్వారా నేర్చుకోవటం అనేది జరుగుతుంది."

"మానవులు గనుక అనుభవం నుంచి నేర్చుకుంటే, సైకిక్ (శారీరక + మానసిక) ఫలితాల ద్వారా నేర్చుకోగలిగితే, అవే అనుభవాలు పునరావృతం కావు."

💖 ఎస్ పత్రి 💖

తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)

లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004

👍 VicTorY oF Light 🎇

💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment