వృద్ధులెందుకు?
❓❓❓❓❓❓❓
టీ కప్పు హాండిల్ విరిగింది. దానిని ఏ బడ్స్ దాయటానికో, పిన్నీసులు పెట్టుకోవడానికో ఉపయోగిస్తున్నాము!
దుప్పటి చిరిగిపోయింది. దానిని నాలుగుమడతలు వేసి కాళ్ళు తుడుచుకునే పట్టా క్రింద వాడుతున్నాం!
కుండ చిల్లిపడింది! దానిని పూలకుండీక్రింద వాడుతున్నాం!
మరి సంపాదించే శక్తి ఉడిగిపోయిందంటూ వృద్ధులను వృద్ధాశ్రమాలలో ఎందుకు పెడుతున్నాం?
కండరాల శక్తి వలననే ఉపయోగమా?
వారి అనుభవాన్ని, జ్ఞానాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం?
పైగా, వృద్ధాశ్రమాలలో పండ్లు పంచిపెట్టడం చేసి వారి మీద సానుభూతి చూపి, ఏదో దైవకార్యం చేసినట్లు ఫోజులిస్తున్నాం!
మన దేశంలో వృద్ధులపట్ల ఒక ఉదాసీన భావం బాగా ప్రబలిపోయింది!
అమెరికా అధ్యక్షపదవికి పోటీ పడిన ఇద్దరు అభ్యర్థుల వయస్సు చూస్తే 79 ఒకాయనకు, 75 ఒకాయనకు!
వారు ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించగలిగే కీలకపదవికి పోటీదారులు!
నోబెల్ ప్రైజు గెలుచుకున్న వారి వయస్సు ఒకసారి అందరిదీ పరిశీలించండి. అందరూ వృద్ధులే దాదాపుగా!
మనకు అర్ధం కావడంలేదు మనదేశంలో ఏం పోగొట్టుకుంటున్నామో!
ఒక వృద్ధులైన డాక్టర్ వద్దకు వెళ్ళు ఏం లాభమో తెలుస్తుంది.
ఒక వృద్ధులు అనుభవజ్ఞుడైన లాయర్ వద్దకు వెళ్ళు. ఎంతో విజ్ఞతతో కూడిన సలహా లభిస్తుంది.
ఒక వృద్ధులైన కళాకారుడిని అడిగిచూడు మెలకువలు తెలుస్తాయి!
అసలు ఏ రంగంలో వృద్ధులు ఆ రంగంలో ఒక నిధి!
వారిని సేవించండి జ్ఞానం లభిస్తుంది!!
వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటే, వారు ఎంతో ఉత్సాహంగా ఉపయోగపడతారు. పైగా వారి ఆరోగ్యమూ మెరుగుపడుతుంది!
అసలు వారే దేశ సంపద! వారి అనుభవం, విజ్ఞత; దేశానికి, సమాజానికి, కుటుంబాలకు ఉపయోగపడవద్దా?!
🌹 ఆలోచించoడి, వృద్ధుల ఎడల ఆదరణ తీరు మారాలి* 🌹
Source - Whatsapp Message

No comments:
Post a Comment