📻రేడియో కార్యక్రమాలు & రేడియో పంచిన ఆనందం ఇలా ఉండేది...
📻ఉదయం ఆరు గంటలకు
📻ఆకాశవాణి... విజయవాడ కేంద్రం ఇప్పుడు సమయం (గంటలు, నిమిషాలు, సెకండ్లు) చెప్పేవారు.
📻రెడీగా దగ్గర పెట్టుకున్న గడియారంలో టైము సరిచేసేసుకొనేవారు!
📻రేడియోలో ప్రతి హిందూ పండగకి ఉదయం 4 గంటలకే కార్యక్రమాలు మొదలయ్యేవి.
📻4 గంటలనుండి మంగళ స్నానం చేసుకునే సమయంలో మంగళ వాయిద్యాలు (సన్నాయి) ప్రసారం చేసేవారు.
ఆరు గంటలకు పుష్పాంజలి మొదలయ్యేది.
📻ఆదివారం నాడు 'శ్రీ సూర్య నారాయణ... వేద పారాయణ...',
సోమవారం నాడు
📻భూకైలాస్, భక్త కన్నప్ప పాటలు, 'శ్రీ ఆంజనేయా ప్రసన్నాంజనేయా' అన్నపాటో, కలియుగ రావణాసురుడు సినిమాలో 'నమో నమో హనుమంతా' అన్నపాటో... ఇలా ముందుగానే మాకు తెలిసిపోతూ వుండేది ఏంవినబోతున్నామో!
7 గంటలకు! వార్తలు చదువుతున్నది "అద్దంకి మన్నార్ "
📻మధ్యాహ్నం 'ఆకాశవాణి! వార్తలు చదువుతున్నది...' అంటూ కందుకూరి సూర్యనారాయణో, అద్దంకి మన్నారో, పార్వతీ ప్రసాదో... ఎవరో ఒకరు పలకరించేవారు. ఆ తర్వాత... '
📻కార్మికుల కార్యక్రమం'.
చిన్నక్క, ఏకాంబరం కలిసి కార్మికుల కోసం ప్రభుత్వ పథకాలు, వారి హక్కులు, బాధ్యతలు తెలియజేస్తూ మధ్యమధ్యలో అప్పుడప్పుడు చిత్రగీతాలు ప్రసారం చేసేవారు.
📻సరిగ్గా ఒంటిగంటా పదినిమిషాలవ్వగానే పసిడిపంటలు మొదలయ్యేది.
పసిడిపంటలవ్వగానే ప్రాంతీయ వార్తలు చదివేవారు... ప్రయాగ రామకృష్ణ లేక తిరుమలశెట్టి శ్రీరాములు.
📻అవవ్వగానే మనోరంజని! మీరు కోరిన మధురగీతాలు వింటారు! అని మీనాక్షో, ఏవియస్ రామారావో అనగానే ఇంట్లో అందరం సంబరపడిపోయేవాళ్ళం.
📻ఆ అరగంటా ఎటువంటి ప్రకటనలు లేకుండా మంచి మంచి పాటలన్నీ వేసేవారు. అవన్నీ చెవులు రిక్కించి మరీ వినేవాళ్ళం.
📻రెండవ్వగానే ఢిల్లీ నుంచి వార్తలు అని చెప్పేవారు. ఇంకా కొన్ని సెకన్లు ఉంటే... కు... కు... కు... అంటూ ఏదో రకం సౌండ్ పెట్టేవారు. ఇంగ్లీషులో వార్తలు... ఢిల్లీనించి ప్రసారమయ్యేవి.
ఆ ఇంగ్లీషు వింటూ ఏ పదాన్ని ఎలా పలకాలో, స్పష్టమైన ఇంగ్లీషు ఎలా మాట్లాడాలో నేర్చుకునేవాళ్ళం.
📻ఇక ఆదివారాలు
సంక్షిప్త శబ్ద చిత్రం, సాయంత్రం నాటికలు, నాటకాలు ప్రసారం చేసేవారు... వి.బి.కనకదుర్గ, నండూరి సుబ్బారావు, ఎ.వి.యస్. రామారావు, పాండురంగ విఠల్... వీరందరూ ఎక్కువగా వినబడేవారు. వాళ్ళ గొంతు వింటోంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్ళం. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు, ఉచ్చారణలో ఎట్టి పొల్లూలేని ఆ భాష వింటే చాలు...మనకి ఎంత ప్రయత్నించినా వక్రభాష రాదు.
📻ఇక రాత్రిపూట చిత్రలహరి, మధురిమ అంటూ పాటలవీ వేస్తుండేవారు.
📻అన్నీ అయ్యాక రాత్రి ఢిల్లీనుంచి శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెలువడేది. ఉద్దండులైన కళాకారులందరూ వినిపించే ఆ స్వరవిన్యాసాన్ని ఆలకించిన మాజన్మలు ధన్యం.
📻ఇక సిలోన్ ఇక్కడ హిందీ పాటలు బాగా వచ్చేవి. మధ్యాహ్నం కొన్ని తెలుగు పాటలు వచ్చేవి. 📻ఆ సిలోన్ స్టేషన్ సరిగ్గా వచ్చేది కాదు, కానీ, చెవి దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినేవాళ్ళం.
📻రేడియో ఒక ప్రసారసాధనంలానో, పాటలపెట్టెలానో కాకుండా మాకు భాషమీద మంచి పట్టును తెచ్చిపెట్టిన యంత్రంలా మేమందరం ఇప్పటికీ గుర్తుంచుకుంటాం.
📻ఆ కాలంలో... పసితనం నుండి మనమందరం రేడియోతో పెనవేసుకుపోయాం. కాలక్షేపం, వినోదం అంతా రేడియోతోనే!
📻అప్పట్లో... సినిమా, రేడియో తప్ప వేరే వినోదం అనేది ఉండేది కాదు. రేడియోలో పాత, కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం.
📻ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల మ్యూజిక్ ను బట్టి ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో, పాట ఏమిటో చెప్పే వాళ్ళం. S.D. బర్మన్, నౌషాద్, మదన్ మోహన్...శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ , R. D. బర్మన్...ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు.
📻ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.
📻అసలు రేడియో విచిత్రం..
అందులోకి మనుషులు
వెళ్లి మాట్లాడతారా అన్న
ఆశ్చర్యం...అమాయకత్వం..
📻ఆదివారం మధ్యాహ్నం గుమ్మం ముందు కూర్చుని రేడియో లో సంక్షిప్తశబ్ద చిత్రం
(ఒక గంటకి కుదించిన) సినిమాని వింటే ఎంత ఆనందం...
📻📻రారండోయ్... రారండోయ్...'
హైదరబాదు బాలలమూ జైహిందంటూ పిలిచామూ...రఁయ్ రఁయ్ మంటూ రారండోయ్...రేడియో ప్రోగ్రామ్ వినరండోయ్...అని
ఆంధ్ర బాలనంద సంఘం రేడియో కార్యక్రమం ప్రారంభంలో వినిపించే పిలుపు పాట.
ప్రోగ్రామ్ అయిపోయిం తర్వాత...
📻బాలవినోదం విన్నాము... బాలల్లారా ఈపూట... చాలిక కథలు చాలిక మాటలు చాలిక పాటలు... నాటికలు...చెంగున రారండి...చెంగు చెంగున పోదాము* అని ఉండేది.
సేకరణ

No comments:
Post a Comment