Saturday, January 29, 2022

నేటి మంచిమాట. సమస్య

నేటి మంచిమాట. సమస్య

ఫ్రెండ్స్ ప్రతి ఒకరు జీవితంలో ఏదో సమస్య
ఆ సమస్యతో వచ్చే టెక్షన్ లేదా బాధ దుఃఖం
ఇలా రాకరకాలుగా ఉంటారు. ఇలా ఇచ్చు మిచ్చు
ప్రతి నిమిషం లేదా ప్రతి గంట లేదా ప్రతి క్షణం.

అసలు సమస్య ఎలా వస్తుంది
అదేమీ పాకుతూ నడుచుకుంటా పరిగెత్తుకుంటూ రాదు.మరి ఎలా వస్తుంది అంటున్నారా
ఎలా వస్తుంది అంటే
మన ఆలోచన నుండి పుట్టుకొస్తుంది.
దానికి అమ్మ నాన్న మనమే.

ఇదివరకటి రోజుల్లో చాలా తక్కువ మంది సమస్యలతో బాధపడుతూ ఉండేవారు .
చాలా వరకు అందరు మంచి మైండ్ సెట్ తో ఆనందంగా ఉండేవారు.

ఇప్పుడు ఇంట్లో సోఫా సెట్టు టీవీ సెట్టు డిన్నర్ సెట్ మేకప్ సెట్ ఉంచుకుటున్నాం.కానీ అసలు ఉంచుకోవాల్సిన మంచి మైండ్ సెట్
ఉంచుకోక పిచ్చి పిచ్చి ఆలోచనలతో
సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం

ప్రతి క్షణం సమస్య తో బాధపడేవారు ఇప్పుడున్న వాతావరణం అనారోగ్య సమస్యలతో. వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక డిప్రెషన్ లో వెళ్లి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

మనం అంతా అయిపోయాక tv ముందు లేదా పేపర్ ముందేసుకుని లేదా ఎదురింటి వాళ్ళు పక్కింట్లో ఎదుట నుంచొని అయ్యో అవునా తనెంత స్ట్రాంగ్ మైండ్ ఉన్న మనిషి ఆమె అలా ఆత్మహత్య చేసుకుందా పాపం,అయ్యో అతను చాలా
పెద్ద ఆఫీసర్ అతనెందుకు సూసైడ్ నోట్ రాసారు,
అయ్యో పాపం ఆ అమ్మాయి అందరితో నవ్వుతు ఉంటుందే తను ఆత్మహత్య చేసుకుందా
ఇలా ఆత్మహత్య చేసుకున్నాక మాట్లాడుతున్నాం కానీ అంతకు ముందు డిప్రెషన్ లో ఉన్నప్పుడు పట్టించుకున్నామా పాపం.

అయినా డిప్రెషన్ ఎందుకు వస్తుంది
మనకు ఎవరో వచ్చి మనల్ని గైడ్ చేయాలా ?
వాళ్ళు వచ్చి ఆదరిస్తే మన మనసు తేలికపడుతుందా ?
వాళ్ళ ఓదార్పు మనలో ఆశ నింపుతుందా ?
అంటే దాన్ని డిప్రెషన్ అనే కంటే ఒక రకమైన డిపెండెన్సీ అనాలి
అది ఎప్పుడూ మనల్ని చులకనగా చేస్తుంది.

జీవితంలో ప్రతిదీ చాలా చిన్న విషయం అది గెలుపైనా ఓటమైనా
అన్ని తాత్కాలికమే మనతో సహా
బాధైనా సంతోషమైనా
మనం ఇక్కడే ఉండిపోవాలన్న ఆ దేవుడు ఉండనివ్వడు
ఈమాత్రానికి డిప్రెషన్ అయ్యి సూసైడ్ చేసుకోవాలా

ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడని బాధపడుతూ కూర్చోకుండా దగ్గర ఉన్న వ్యక్తిని ప్రేమించలేరా ?
ఓడిపోయామని ఇక ఎప్పటికి గెలవలేమని ఒకేచోట ఉండిపోవడం కంటే ఆ ఓటమి కి కారణాలు వెతకలేమా వాటిని సరిచేసుకోలేమా.

ఒక ఉద్యోగి నచ్చిన ఉద్యోగం దొరకలేదని
అక్కడే ఆగిపోయాడు
దొరికిన ఉద్యోగాన్ని లేదా నచ్చిన పనిని
నచ్చినట్టు మార్చుకోలేడా.

ఒక ఉపాధ్యాయుడు ఎంత కష్టపడ్డా ప్రమోషన్లేవు... చాలా బాధపడిపోతున్నాడు
ఏ కష్టం లేకుండానే మరో ఉద్యోగి ప్రమోషన్ లు కొట్టేస్తున్నాడు...!

బహుశా అతడికి జీతం పెరిగిందేమో అంతే పిల్లలతో అనుబంధం పెరగలేదు...!
అతను ఉద్యోగం నుండి విశ్రాంతి తీసుకున్నాక సత్కారాలతో పంపారు అక్కడితో ఆగిపోయింది...!

కానీ కష్టపడిన ఉపాధ్యాయుడు పిల్లల హృదయాల్లో నిలిచిపోయాడు .100 మంది పిల్లలు తమ విజయానికి కారణం ఈ ఉపాధ్యాయుడే అని చెప్తూ గుర్తుపెట్టుకుని మరి వచ్చి ప్రతి ఏడాది పలకరిస్తూనే ఉన్నారు.ఆయన్ను సత్కరిస్తూనే ఉన్నారు

అయన కోరుకున్న విషయంలో ఓడిపోయాడేమో కానీ అందరిని గెలిపించి అక్కడ అయన గెలిచాడు
అలా మనం గెలవలేమా
గెలుపంటే అర్థం ఇదే కదా

నేనూ అనే ఒక్కడు గెలవడమా మన చుట్టూ ఉన్న అందరిని గెలిపించడమా గొప్ప.

ఒకటి చెప్పనా ఫ్రెండ్స్ జీవితంలో అతి గొప్ప విషయం మనల్ని మనం తెలుసుకోవడం అంతకన్నా గొప్ప విషయం అది తెలుసుకొని సంతృప్తి చెందటం.

ఒకరు వచ్చి మనకు ధైర్యం చెప్పే అంత స్థితిలో మనం లేము అని అనుకోవాలి.
అసలు ఆ చాన్స్ ఎవరికి ఇవ్వకూడదు
ఆలోచనతో తెచ్చుకున్న సమస్యను
ఆ ఆలోచనతోనే పోగొట్టుకోవాలి.

ఎలా అంటారా
ఆ తండ్రి పరమాత్మ పై నమ్మకంతో
నీ అంతరాత్మను అడిగి చూడు
నువ్వేం చేయాలో చెప్తుంది
నీ గుండెను అడిగి చూడు
నీ కర్తవ్యం ఏంటో గుర్తుచేస్తుంది
దాని ప్రకారం నడుచుకుంటే చాలు
సమస్య వచ్చిన దారిని వెళ్ళిపోతుంది .

ఇక్కడ ఇంకొక సమస్య వాళ్లు ఏమనుకుంటారు వీళ్లు ఏమనుకుంటారో అని.ఆ వాళ్లతో వీళ్ళతో పోల్చుకొని.ఏటో ఏటో పిచ్చి పిచ్చి ఆలోచనతో కూడ సమస్య పరిష్కరించుకోలేకపోతున్నారు
చాలా మంది.

ఒకరితో మరొకరు పోల్చుకోవడం చాలా తప్పు
ఒకటి అడుగుతా చెప్పండి .
సింహం కుక్కల విశ్వాసం చూపుతుందా చూపలేదు కదా. అలాగే కుక్క ఎప్పటికైనా అడవికి రాజు కాగలదా కాలేదు కదా.కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారే కదా. ఒకరితో మనల్ని మనం పోల్చుకోవడం ఎంత వరకు కరెక్ట్ చెప్పండి
మనకు మనం గొప్ప.

అంతే కానీ సమస్య వచ్చింది అని,
జీవితం నచ్చలేదని డిప్రెషన్ లోకి వెళ్ళకూడదు
జీవితంలో బాధపడవలసిన విషయం ఏది లేదు ఆ బాధను అర్థం చేసుకుంటే
ప్రతి క్షణం ఆనందమే పరమానందమే *

శుభోదయంతో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment