🗣️ నోటి తొందర 🗣️
ఒకానొక రైతు తన పొలం రోజూ నాశనం అవుతుండటంతో పక్క పొలం రైతు పైన అనుమానం వచ్చింది.🙄
అనుమానం వచ్చిన వెంటనే అలోచించ కుండా, అతను కనపడగానే నోరు పారేసుకుని అనాలోచితంగా నానా మాటలు అనేసాడు..😬
మరుసటి రోజు పొద్దున, ఒక గాడిద పొలంలోకి వచ్చి నాశనం చేస్తుంటే. చూసి దాన్ని తరిమికొట్టి. తన పక్క పొలం రైతు విషయంలో తాను చేసిన పొరపాటును తెలుసుకుని సారీ... అనే రెండు పదాల మాటని చెప్పడానికి వెళ్ళాడు.😯
అందుకు తన తోటి రైతు తనకి ఒక బ్యాగ్ నిండా ఎండిన ఆకులు ఇచ్చి... ఊరి చివర పారేసి రమ్మని చెప్పాడు. ఎందుకు చెప్పాడో అని ఆలోచిస్తూ... చెప్పిన పని చేసి తిరిగి వచ్చాడు.😥
మళ్ళీ తను ఇచ్చిన బ్యాగులో పారేసిన ఆకులను తీసుకు వస్తే, క్షమిస్తా అని చెప్పాడు.😏
ఆనందంతో రైతు... అక్కడకి వెళ్ళి చూస్తే... ఒక్కటంటే ఒక్క ఆకు కూడా లేదు. వట్టి చేతులతో తిరిగి వచ్చి జరిగిన విషయం చెప్పాడు..😖
😡 అందుకు తన తోటి... రైతు నవ్వుతూ... నోటి నుంచి వచ్చే మాట కూడా అంతే.
మట్లాడే ముందు ఆలోచించి మాట్లడితే అందరికి మంచిది... అని చెప్పి వెళ్ళిపోయాడు.🤔
అందుకే... అనాలోచితంగా మాట్లాడే కొన్ని పదాలు మన తోటి వారిని ఎంతగానో బాధిస్తాయి... బంధాలను తెంపేస్తాయి. అది పరాయివారయినా... మన మిత్రులయినా... బందువులయినా..🤕
ఆవేశంలో ఉన్నప్పుడు... ఒకటికి రెండుసార్లు ఆలోచించి... తరువాత మాట్లాడండి... కాలు జారితే వెనుకకు తీసుకోవచ్చు... నోరుజారితే ఆ మాటను వెనుకకు తీసుకోలేము... నాలుకను మించిన ఆయుధం మరొకటి లేదు... అది బంధాలను కలపవచ్చు, చిటికెలో తెంచవచ్చు. నాలుకను అదుపులో పెట్టుకోగలిగిన వారు జీవితాన్నే అదుపులో పెట్టుకోగలరు.💥
👅నాలుక అదుపుతప్పితే సర్వం నాశనమే.💥
💥 సర్వేజనాః సుఖినోభవంతు💥
🙏🙏🌹🌹❤🔥❤🔥🌹🌹🙏🙏
సేకరణ

No comments:
Post a Comment