Saturday, January 29, 2022

మానవ నైజాన్ని మార్చుకుందామా !!

🌹మానవ నైజాన్ని మార్చుకుందామా !!🌹

🌾🍃మనిషికి తొందరపాటు ఎక్కువ. అనుకున్నది వెంటనే చేసేయాలనుకుంటాడు.

🌾🍃 మనిషికి భయం ఎక్కువ. ఆపద కలగగానే డీలా పడిపోతాడు

🌾🍃మనిషికి ఆవేశం ఎక్కువ. ఇతరులపై కోపం కలగగానే అక్కసు వెళ్లగక్కుతాడు.

🌾🍃మనిషికి నిరాశ ఎక్కువ. బాధ కలగగానే కుమిలిపోతాడు.

🌾🍃మనిషికి దురాశ ఎక్కువ గుడికి వెళ్ళి ఒక్క సెకనుసెకను దణ్ణం పెడతాడు. తరతరాలు కూర్చుని తింటే తరగని సంపదని కోరతాడు.

🌾🍃మనిషికి సహనం తక్కవ ఒక్క రోజు ధ్యానం చేస్తాడు నేను బుద్ధుడను కావాలి అంటాడు.

🌾🍃ఒక్కరోజు ధ్యానం చేస్తాడు నాకు ఆరోగ్యం కావాలి అంటాడు.

🌾🍃ఆరోగ్యం రాకపోతే ఫోటోలు మారుస్తాడు గుళ్ళు మారుస్తాడు. మతాలు మారుస్తాడు. దేవుళ్ళను మారుస్తాడు.

🌾🍃దేనికీ కుాడా సహనం ఉండదు మానవునకు.

🌾🍃మనకు ఏదైతే కావాలో దానికోసం సాధన ఎంతైనా అవసరం.

🌾🍃అయితే.. సాధనతో పాటు కాస్తంత ‘సహనం’తో నిరీక్షిస్తే అంతిమంగా ‘విజయం’ సాధించవచ్చు.

🌾🍃సహనం ఒక నిగ్రహశక్తి, ఒక మానసిక పరిపక్వత గల స్థితి.

🌾🍃సహనమనేది నీగమ్యానికి నిన్ను చేర్చే మార్గం

🌾🍃ముఖ్యంగా కష్టసమయాల్లో ఏదైనా ఉద్వేగాన్ని దాటవేయాలన్నా, వాయిదా వేయాలన్నా సహనం తప్పనిసరి.

🌾🍃ఎదుటి మనిషి నుంచి మనకు దేని కారణంగా ఒత్తిడి కలుగుతుందో, అందులోకి మనం కలసిపోవడం.

🌾🍃అంటే ఎదుటివారిలోని ఏ గుణం మనకు కోపాన్ని తెప్పించి, సహనాన్ని పోగొడుతుందో దానిని మనలోకి ఆవహింపచేసుకోవడమే సహనం.

🌾🍃మరి దీని కోసం ధ్యాన సాధన అవరం.

🌾🍃మరి మనమందరమూ సహనంతో ధ్యాన సాధనచేద్దాం. మన గమ్యాన్ని మనం చేరుదాం

🌾🍃ఆనందంగా ఉన్నప్పుడు ఆలోచించి మాట్లాడుతాం, ఆ మాటల్లో అబద్దాలు, అర్ధ సత్యాలు, సత్యాలు ఉంటాయి
కానీ...
ఆవేదనలో... ఆవేశంలో... ఉన్నప్పుడు...
అన్నీ నిజాలు మాట్లాడుతాం...
అసత్యాలకు... అర్ధ సత్యాలకు...
తావుండదు.!!

🍃🌺ఆనందం కోసమే జీవితం... దాన్ని వదలొద్దండి... ఆనందంగా గడిపిన ప్రతిక్షణం అమృతమే అన్న సత్యాన్ని గుర్తించండి...
🙏🙏🌹🌹🔆🔆🌹🌹🙏🙏

సేకరణ

No comments:

Post a Comment