Saturday, January 29, 2022

మంచి మాట..లు

ఆత్మీయ బంధు మిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు.. 💐🤝🌹 కాణిపాకం విఘ్నేశ్వరుడు తిరుత్తణి సుబ్రమణ్య స్వామి హరిహరసుతుడు శబరి గిరి అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
బుధవారం --: 12-01-2022 :--
ఈ రోజు AVB మంచి మాట..లు
ఆ కాలంలో ఎవ్వరి దగ్గర గడియారం లేదు కానీ అందరి దగ్గర సమయం ఉండేది ఈ కాలంలో అందరి దగ్గర గడియారం ఉంది అయినా ఎవ్వరి దగ్గరా సమయం లేదు , అనుకోకుండా పరిచయం అయిన వాళ్ళతోనే విడదీయలేని బంధం ఏర్పడుతుంది ఆ బంధం ఎలా ఉంటుంది అంటే కలిసి ఉండడానికి వీలు కాదు విడిపోవడానికి మనసు రాదు .

ఈ ప్రపంచం లో మనిషి బ్రతకడానికి ఊపిరి మాత్రమే కాదు ఓ మంచి మనసున్న మిత్రుడు తోడు కూడా కావాలి , అసూయ ద్వేషం అనే రెండు గుణాలు మనిషికి మానసిక రోగాలు శాంతం , సంతోషం , సహనం అనే మూడు గుణాలు మాత్రమే మనషుల ఎదుగుదలకు ఉపయోగపడతాయి మనిషి అన్న వాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు కానీ మనసున్న వాడు కష్టాల్లో ఉన్న వారికి దగ్గరలో ఉండాలనుకుంటాడు .

సంవత్సరం మారితే మన రాతలు ఏమి మారవు నీవు చేసే ప్రయత్నాలను ఆపితే నీవు అనుకున్న పనులేవీ సాగవు , నీవు ప్రయానించే గమ్యం దూరమైనా నీ పయనాన్ని ఆపోద్దు నీవు నడిచే మార్గము కష్టమైనా నీ ప్రయత్నాన్ని ఆపోద్దు .అప్పుడే అన్ని పనులు సాకారమౌతాయి
ఆత్మీయులందరికి జాతీయ యువజన దినోత్సవ (స్వామి వివేకానంద జన్మదినం )శుభాకాంక్షలు
సేకరణ ✒️*మీ.. ఆత్మీయుడు AVB సుబ్బారావు🤝💐🌹

సేకరణ

No comments:

Post a Comment