Sunday, January 30, 2022

కోరికలు తీరడం లేదని, కష్టాలు వదలడం లేదని దేవుని నిందించడం తగదు.

🌼🔅కోరికలు తీరడం లేదని🔅🌼
⚜️కష్టాలు వదలడం లేదని⚜️
📍దేవుని నిందించడం తగదు.📍
🔹🔸🔹🔸🌸🌸🔸🔹🔸🔹

🍁🌾 ఎందుకంటే ఒక పిల్లవాడు తళతళమని మెరిసే ఒక పదునైన కత్తిని ఆట వస్తువుగా భావించి అది కావాలని తల్లితో పదేపదే మారాం చేస్తాడు.

🍁🌾 పిల్లవాడు అడుగుతున్నాడు కదా అని కత్తిని తల్లి ఇచ్చేస్తుందా? మీరైతే మాత్రం ఇస్తారా!!!

🍁🌾 అవసరమైతే పిల్లవాడిని దండిస్తుంది, కాని కత్తిని అందించదు.

🍁🌾 ఎందుకంటే కత్తి వలన కలిగే ప్రమాదం పిల్లవాడికి తెలియదు.‌

🍁🌾 అదేదో ఆటవస్తువనే భ్రమలో ఉంటాడు.

🍁🌾 కానీ తల్లికి దానివలన కలిగే ప్రమాదం తెలుసు కనుక తన పిల్లవాడు ఆ కత్తితో తనకు తానుగా ఎక్కడ గాయపరచుకుంటాడో అని ఆ తల్లి దానిని దూరంగా దాచేస్తుంది.

🍁🌾 మరి ఈ జన్మకు కేవలం ఈ దేహానికి మాత్రమే తల్లిగా ఉండే మానవ స్త్రీయే తన బిడ్డల పట్ల ఇంత జాగ్రత్తగా ఉంటే జన్మ జన్మల నుండి మనతో ఉంటూ మన ఆత్మకు తల్లీ తండ్రీ తానుగా ఉండి మనలను సదా కాచుకు కూర్చుంటున్న ఆ భగవంతుడు ఆయన పిల్లలమైన మనపై ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి?

🍁🌾 మనం కోరుకునే వస్తువు వలన కలిగే దుష్పరిణామాలు మనకు తెలియవు కానీ భగవంతునికి సదా ఎరుకయే.

🍁🌾 భగవంతుడు మనం ఆడిగిన ప్రతిదీ ఇవ్వకపోవడానికి కారణం ఇదియే.

🍁🌾 భగవంతుని ఆర్థించండి పరవాలేదు‌. యివ్వ లేదని నిందించకండి.

🍁🌾 ఆయన మనకు కావాల్సిన ప్రతిదీ ఇవ్వక పోవచ్చు కానీ మనకు అవసరమైన ప్రతిదీ ఇచ్చి తీరుతాడు. సందేహాలకు చోటివ్వక విశ్వాసం పెంచుకోవాలి.

🍁🌾 భగవుంతునిపై విశ్వాసం ఉంచండి.

🍁🌾 సన్మార్గములో జీవితం కొనసాగించండి.

🍁🌾 గౌరవం అనేది గుణాన్ని చూసి ఇవ్వాలి. ధనాన్ని, అందాన్ని చూసి కాదు.

🍁🌾 చెప్పులు ఎంత ఖరీదైనవి అయినా గుడి బయట వదిలేస్తాం.

🍁🌾 కొబ్బరికాయ ఖరీదైనది కాకపోయినా దేవుడి పాదాలకు సమర్పిస్తాం.

🍁🌾 మనిషి వ్యక్తిత్వం కూడా అంతే.

🍁🌾 మన జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకోడానికి కావాల్సిన ఒకేఒక ఆయుధం మంచి ఆలోచన.

🍁🌾 ఆలోచనలు మంచివైతే మన పయనం మంచి వైపు.

🍁🌾 ఆలోచనలు చెడువైతే మన దారి చెడువైపు. అంటే, ఆలోచనల సమాహారమే మన జీవితాన్ని నడిపే ఆయుధం.

🍁🌾 మన ఆలోచనలు మారితే, మనకున్న అలవాట్లు మారుతాయి.

🍁🌾 మన అలవాట్లు మారితే, మన జీవితం మారుతుంది.

🍁🌾 మన జీవితంలో జరిగే మంచి, చెడు ఏదైనా మన ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుంది.
🙏🙏🌹🔸🌷🌷🔸🌹🙏🙏

సేకరణ

No comments:

Post a Comment