Sunday, January 30, 2022

వైరాగ్యం

 *🕉️వైరాగ్యం...🕉️*


*https://chat.whatsapp.com/BZHH4OZ0OGhDgSs7k9N1Xu*


*ప్రపంచం దృష్టిలో అన్నీ వదులుకోవటం. బాధ్యతల్ని విస్మరించటం. సోంబేరులైపోవటం. ముఖ్యంగా కుటుంబసభ్యుల్ని బాధపెట్టడం. నిజమేనా? నిజమే. అర్థం అదే. కానీ అంతరార్థం వేరు, భావార్థం వేరు, ఆధ్యాత్మికార్థం వేరు. దిగంబరత్వాన్ని అశ్లీలంగా భావించవచ్చు. ఆత్మ భావస్థితిగానూ అంగీకరించవచ్చు అలాగే ఇదీ. వాస్తవ స్థితిని, పరిస్థితిని అవగాహన చేసుకోవాలి. అశ్లీలతను, ఆత్మభావాన్ని ఒకే గాటన కట్టరాదు. వైరాగ్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని ఏకదృష్టితో చూడరాదు. ఉప్పు వేరు, కర్పూరం వేరు. వైరాగ్యం మంచి కర్పూరం. కర్పూరంలా 'నేను' హరించిపోయే పరిణామశీల భావౌన్నత్యం. ఇది అందరికీ అర్థం కాదు. చాలామంది దృష్టిలో వైరాగ్యం అంటే సోమరితనమే. బాహ్యదృష్టికి మాత్రం అంతమటుకే అనిపిస్తుంది. కానీ... అంతేనా? ఎంతమాత్రం కాదు. బాహ్య ఆడంబర స్పృహ లేకుండా నిర్వికారంగా ఉండిపోయే వైరాగ్యవంతుడు ఆంతర్యంలోనూ అంతే నిర్వికారంగా ఉంటాడు. అంతే నిరహంకారంగా ఉంటాడు. ముఖ్యంగా నిత్యానిత్య వస్తు వివేకాన్ని కలిగి ఉంటాడు. అందుకే అనిత్యమైన సంసారం పట్ల ఆ నిర్లిప్తత, నిర్వికారత. అయితే సాధారణ ప్రపంచానికి సందేహం- ప్రాపంచిక జనసందోహానికి అనుమానం. ఏమిటీ వైరాగ్యం! ఏమానందముంది ఇందులో! ప్రాణాలొడ్డి సంపాదించుకున్న ధన కనక వస్తురాశుల్ని పిల్లాపాపలతో అనుభవించకుండా ఏమిటీ అర్థంలేని అవివేక ప్రవర్తన! నిజమే... అలాగే అనిపిస్తుంది. ఔను మరి... ప్రపంచానికి వెన్నుచూపి వైరాగ్యాభిముఖుడై వెళ్లిపోతున్న మనిషి ఏం పొందుతున్నాడు? ఏ కొండ కొసనో, ఏ అరణ్య మధ్యంలోనో, ఏ వల్మీకపు చాటునో నిమీలిత నేత్రుడై కూర్చుండిపోయే మనిషి ఏమాలోచిస్తున్నాడు? ఏ ధనరాశులకోసం, ఏ నిధినిక్షేపాలకోసం తపిస్తున్నాడు? విచిత్రంగా... ఏమీ లేదు! అద్భుతంగా... దేనికోసమూ కాదు! అతడు అతడుగా మిగలని తీవ్ర వైరాగ్య భావనలో, ఆ భావన కూడా అంతరించి నిర్వికార ఏకాకార దివ్యత్వంలో ఉండిపోతున్నాడు. ఒకసారి... ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం. 'నాకేమీ వద్దు. నేనేమీ కాను, నేనేమీ లేను' అనే నిర్వికార అనుభూతి మనసును ఎంత భావరహితం, ఎంత భారరహితం చేసి ఆనందమో, ఆసవమో, రసమో... ఇవేమీ కాని శుద్ధ చైతన్య ఆవాహనమో... అది అనుభవించాలి... కాదు... అనుభూతించాలి. అదీ కాదా? ఏదీ కానిదేదో అదే అప్పటి... ఆ క్షణాన నీవు, నేను, మనం... నిజానికి అవీ మిగలవు!*

*తీవ్ర వైరాగ్యం ఎంత హృద్యమైంది! ప్రళయ ప్రభంజనాలకూ చలించకుండా అత్యంత కోమలమైన పూలరేకుల్లా అర్ధనిమీలితమై ఉన్న కనురెప్పలతో... కాదు... కనురేకులతో అత్యంత తేజోవంతమైన, అయినా అత్యంత ఆహ్లాదకరమైన ఒక వెలుగు హిమపాతం, ఒక వెన్నెల జలపాతం- ఆ తీవ్ర వైరాగ్యవంతుడి అణువణువునా జాలువారుతూనే ఉంటుంది.*


*మనిషి వైరాగ్యంతో తప్ప పరమేశ్వరాభిముఖుడు కాలేడు. ఏం? పరమేశ్వరునికి అభిముఖుడే కావాలా? అసలు అయ్యేతీరాలా? ఔను. తప్పదు. నిజానికి విశ్వాకారుడైన భగవంతుడికి మనిషి సదా అభిముఖుడే అయిఉన్నాడు. ఎందుకంటే- అన్నివైపులా తానే అయి ఉన్న ఆ పరాత్పరుడికి మనిషి అభిముఖుడయ్యే ప్రత్యేక ప్రయత్నమే అవసరం లేదు. మనిషి ఏ ముఖుడైనా సదా భగవన్ముఖుడయ్యే ఉన్నాడు. అయితే అది గొర్రెదాటు వ్యవహారం కాకూడదు. తెలిసి అభిముఖంగా సాగాలి. వివేకంతో వెళ్లాలి. లేకపోతే ఒడ్డున కట్టిన పడవకు తెడ్డు వేసినట్లే ఉన్నచోటునే ఉండిపోతాడు. మనిషి సాగాలి... భగవంతుడి వైపు. నిత్య సత్య స్వరూపుడైన భగవంతుడి వైపు. అందుకు నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలి. అలా ఉన్నవాడే సాగగలడు. అది ఉన్నవాడే వైరాగ్యవంతుడు... అనంతాన్ని ఔపోసన పట్టినవాడు!*

No comments:

Post a Comment