Sunday, January 30, 2022

మనం పుణ్యకార్యాలు ఎందుకు చేయాలి??

🌹మనం పుణ్యకార్యాలు ఎందుకు చేయాలి??

ఒక వ్యక్తి జీవించి ఉన్నంత వరకు బంధాలు బాధలు ఉంటాయి...
ఎలా అంటే ఒక దీపం వెలిగేటప్పుడు దానికి చమురు (నెయ్యి లేదా నూనె) కావాలి,
ఎక్కువ గాలి ఉండకూడదు, అలా అని అస్సలు గాలి లేకుండా కూడా ఉండకూడదు.. ప్రతిదీ దానికి ప్రాణ సంకటమే ...
అదే ఇక సారి దీపం ఆరిపోతే ఇక దానికి గాలితో కానీ చమురుతో కానీ దేనితో పని లేదు..
అక్కడితో దాని కధ ముగిసింది అని అర్థం ...

అలాగే ఒక వ్యకి జీవించి ఉన్నంత వరకు ప్రతిదీ కావాలి , ప్రతీది అవసరమే ...
ఒక సారి జీవం పోగానే ఈ ప్రాపంచిక విషయాలు బంధాలు అవసరం లేదు,

వారు చేసిన పుణ్యం తప్ప ఏది కూడా ఉండదు,
ఎవరు వెంట కూడా వెళ్ళలేరు,
అక్కడితో ఆ వ్యక్తి కధ ముగిసినట్టే,...

దీనిని పట్టి మనకు అర్థం ఏమవుతుందంటే ... ఈరోజు మనం పెంచుకున్న బంధాలు, ప్రేమలు, కోపాలు , తాపాలు, అన్ని అశాశ్వతమైనవే, కేవలం మనము చేసిన సేవనే మన వెంట వస్తుంది అని అర్థమవుతుంది, కాబట్టి నిత్యం మనం , పుణ్యకార్యాలు చేయాలి అని పురాణ వచనం🙏

మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాంతే కొలమానం !!

అవగాహనే మనసుకు మంచి మందు. అవగాహన అంటే మనసుకు విషయం సంపూర్ణంగా, సమగ్రంగా, సమూలంగా అర్ధంకావడం. మనకు బాల్యం నుండి మనసును పోల్చుకోవడం, పోటీపడటం అలవాటుగా మారింది. అదే అలవాటుతో దేవుడు, సాధన, ముక్తి వంటి ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మనసు పోల్చుకోవడం, పోటీ పడటం చేస్తోంది. నిజానికి మన జీవనం సాఫీగా సాగటానికి ఎవరితోనూ పోటీ పడక్కర్లేదు. మనతో మనం సక్రమంగా ఉంటే సరిపోతుంది. మన గుణాలను దాటటానికి, ప్రవృతిని మార్చుకోవడానికి అనుదినం మనతో మనమే పోటీపడాలి. మనలో వచ్చే మార్పే శాంతికి సోపానం. మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాంతే కొలమానం. దీన్ని ఎవరినీ అడిగి తెలుసుకోవాల్సిన పనిలేదు. మనం నిత్యజీవితంలో ఎంత శాంతిగా ఉంటున్నాం, ఎన్ని విషయాల్లో శాంతిగా ఉంటున్నామనేది ఎవరిది వారికే తెలిసే విషయం !
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
---------------------------------------

నచికేతుడు
>÷<>÷<>÷<>÷<
🦜

మనిషికి విద్య అవసరం.
నేర్చుకొన్న విద్య నిర్వీర్యమవకుండా వుండాలంటే, ఆ విద్యలను ఇతరులకు నేర్పాలి.
అప్పుడే ఆ విద్యలకు శాశ్వతత్త్వం
కలుగుతుంది.
విద్యార్జన అనంతం. జ్ఞానసముపార్జన మహాసాగరం. ఎంత లోతుకు తరచి చూస్తే అంత విజ్ఞానం కలుగుతుంది.

ఇంటి లోని పిల్లలను ఐదు సంవత్సరాలదాకా మహారాజుల్లా
పెంచాలి.
తరువాత15 సంవత్సరాలదాకా , పనివారిలాగ చూడాలి. అన్ని పనులూ స్వంతంగా చేసుకునే నైపుణ్యం నేర్పాలి.
16 సంవత్సరాల నుండి ఆ యువకుడిని ఒక మంచి స్నేహితునిగా చూడాలని మన
శాస్త్రములు వివరిస్తున్నాయి.
పాఠశాలకు వెళ్ళడానికి ముందుగానే ఆపిల్లవాని బుధ్ధి వికాసానికి తండ్రి తోడ్పడుతున్నాడు.
తరువాత 15 సంవత్సరాల
దాకా పాఠశాలకు వెళ్ళి
విద్యని ఆర్జించాలి.
ఆ తరువాత ఆ పిల్లలు తమకు కావలసిన
విద్యలన్నీ నేర్చుకుంటారు.
అప్పటినుండి వారు తండ్రికి మిత్రులవుతారు.

పాఠశాలకు వెళ్ళే వయసు పెద్దలు చెప్పినట్లుగా విని ఆచరించవలసిన కాలం. ఆ సమయంలో వారిని
పనివారిగా చూడాలని శాస్త్రం చెప్తోంది.
ఈ పది సంవత్సరాలలో
వారు నేర్చుకొన్న విద్యే
వారికి భుక్తిని , సంఘంలో
విలువను పెంచుతుంది.

దానికి ఉదాహరణ గా నచికేతుని కధ తెలుసుకుందాము.

నచికేతుడు గురుకులవాసం
చేసి , సకల విద్యలనభ్యసించి గొప్ప పాండిత్యం సంపాదించి
ఇంటికి తిరిగి వచ్చాడు.
నచికేతుడు ఇంటికి వచ్చిన
సమయంలో అతని తండ్రి
వాజశ్రవసు మహర్షి
ఒక యాగం తలపెట్టి ,
యాగ ద్రవ్యాలను సమకూర్చుకోసాగాడు .
నచికేతుడు అన్నీ విద్యలు అభ్యసించి వచ్చినందున ,తన తండ్రిని ఒక ప్రశ్న అడిగాడు.
"మీరు యాగం చేస్తున్నారు కదా ..
గోదానం చేయాలంటే ఒక దూడను ఈనిన తరువాత మరల చూలుతో వున్న
గోవును మాత్రమే దానమివ్వాలి . అంతేకాని మనకు పనికిరాని
వట్టి పోయిన గోవుని దానమివ్వరాదు " అంటూ మొదలు పెట్టి, తనకు తెలిసిన విషయ పరిజ్ఞానం అంతా తండ్రి ముందు ప్రదర్శించాడు.
తిరిగి మాట్లాడడం మొదలు పెట్టి, " నిజానికి యీ యాగ సమయంలో మీరు ఇక్కడ వున్నవన్నీ దానంగా యిచ్చి వేయాలి , ఏది సొంతానికి
వుంచుకో కూడదు. అటువంటప్పుడు, నన్ను
ఎవరికి దానమిస్తారు ?
అని అతి తెలివితేటలతో అడిగాడు.

యాగం ఏర్పాట్లలో నిమగ్నమైన
అతని తండ్రి
నచికేతుని ప్రశ్నలకి సమాధానాలు విడమరచి చెప్పలేక , ఒకే మాటలో " నిన్ను ఆ యమునికి దానం యిచ్చెస్తాను",
అని అన్నాడు.
నిజానికి ఆయనికి ఆ మాటనడంలో ఎటువంటి ఉద్దేశ్యమూ లేదు. కొడుకు మాటలకు విసుగుచెంది
ఆ మాట అనేశాడు.
కోపంలో వచ్చిన మాట అని తెలిసినా, తండ్రి మాట నెరవేర్చడానికి , యముడు
వున్న చోటు వెతుకుతూ వెళ్ళాడు నచికేతుడు.
నచీకేతుడు అక్కడికి వెళ్ళేటప్పడికి యముడు అక్కడ లేడు. అక్కడే
ఆహారం లేకుండా మూడు రోజులు గడిపాడు నచికేతుడు. నాలుగవరోజున
వచ్చిన యమునికి తను వచ్చిన విషయం తెలిపాడు
నచికేతుడు.

"మూడు రోజులుగా ఆహారం
లేకుండా అతిధిగా వుంచి, వుపచరించక పోవడం
నాదే తప్పు. దానికి పరిహారంగా ,నీకు వరాలిస్తాను కోరుకోమని " అని మాట
🙏🙏🙏🙏🙏

సేకరణ

No comments:

Post a Comment