Thursday, January 27, 2022

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

😡కోపం వచ్చినపుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వు, కానీ నోటి నుండి మాట రానియ్యొద్దు!

కన్నీటితో కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటి వారికి బాధ కలుగుతుంది.

గొడవ జరిగితే కాని బయటపడవు ఎవరి మనసులో ఎముందో,!

చూడటానికి అందరు నవ్వుతూ పలకరించేవాళ్ళే, అవసరం ఒకరిది అయితే, అవకాశం ఇంకొకరిది.

కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయట పడుతుంది. అంతే కాదు మనసులోఉన్న నిజమైన భావాలు బయట పడతాయి.

అతి స్నేహం, అతి ప్రేమ మరియు అతి చనువు హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటె, అదే స్థాయిలో బాధని కూడా భరించాల్సి ఉంటుంది.

ఉషోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment