Saturday, January 29, 2022

మానవుడు - మాధవుడు అగుటకు 21 సూత్రాలు

మానవుడు - మాధవుడు అగుటకు 21 సూత్రాలు

01 - ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం

02 - మాటమీద ధ్యాస ఉండడం

03 - ఇతరుల విషయాలలో దూరి పోకుండా ఉండడం

04 - వర్తమానంలో ఉండడం

05 - ఎదుటి వ్యక్తులను అద్దంలాగ చూడాలి (లోపాలను మనలో సరి చేసుకోవాలి)

06 - మనం ఆధ్యాత్మిక జీవితానికి 50 శాతం ,ప్రాపంచిక జీవితానికి 50 శాతం సమయాన్ని కేటాయించాలి.

07 - మనసు మాట మనం వింటున్నా మా లేక మన మాట మనసు వింటోందా గమనించుకోవాలి

08 - జరిగి పోయిన విషయాన్ని ప్రస్తుత విషయానికి పోల్చకూడదు

09 - ధ్యానం 25 శాతం సజ్జన సాంగత్యం 25 శాతం ఆచరణాత్మక మైన జీవితం 50 శాతం ఉండాలి

10 - ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి ప్రస్తావన రాకూడదు

11 - ఎవరిని జడ్జి చేయకూడదు, కామెంట్ చేయకూడదు.

12 - మన స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు మరియు ఇతరుల స్వేచ్ఛ కు భంగం కలిగించకూడదు

13 - మన మీద మనకు నిరంతరం నిఘా ఉండాలి

14 - మన భావనలను ఎప్పుడూ సరిగా ఉంచుకోవాలి

15 - పెద్దవాళ్ళను గౌరవించడం చిన్నవారి పట్ల గౌరవం కలిగి ఉండడం

16 - ఎదుటివారిని బట్టి మనం మన స్థితిని కోల్పోకూడదు (ఎప్పుడు సహజ స్థితిలో ఉండాలి)

17 - భార్య భర్తలు ఒకరికొకరు ప్రేమ, గౌరవం కలిగి ఉండాలి.

18 - సమాజం పట్ల కరుణ బాధ్యత కలిగి ఉండాలి

19 - దేని పట్ల ఎస్టిమేషన్ (Estimation) గాని ఎక్స్పెక్టేషన్ (Expectation) కానీ ఉండకూడదు

20 - వంద మాటలు మాట్లాడే సందర్భంలో ఒక్కమాటతో సమాధానం చెప్పాలి

21 - మన ప్రాణ శక్తిని కోల్పోకుండా చూసుకోవాలి

సేకరణ

No comments:

Post a Comment