Friday, February 4, 2022

పుష్ప...ది సెన్సేషన్ !!

పుష్ప...ది సెన్సేషన్ !!
*

సుకుమార్ అద్భుతమైన డైరెక్షన్..
అల్లుఅర్జున్ మోస్ట్‌రియలిస్టిక్ యాక్షన్..
డియస్పి హాంటింగ్ మెలోడియస్ మ్యూజిక్..

అన్నీ కలిసిన అమాల్గమ్ అద్భుతం.."పుష్ప"

తెలుగు రాష్ట్రాలనే కాదు..
యావద్భారతాన్ని నేడు ఒక ఊపు ఊపేస్తోంది!
తెలుగు సినిమా సత్తా బాహుబలి తర్వాత
మొత్తం ప్రపంచానికి చాటిచెప్పింది!
తెలుగులో రియలిస్టిక్ సినిమాలు రావడంలేదనే విమర్శకుల నోళ్లు మూయించింది!
.
.
.
.
ఔను నిజమే....

కానీ సమాజాన్ని ఈసినిమా
ఏరకంగా ప్రభావితం చెయ్యబోతోంది?
పతనమయ్యే నైతికవిలువల్ని ఇది
పెనంపైనుంచి పొయ్యిలోకి ఎలా తొయ్యబోతోంది?

ఇదే కాదు...సంఘవిద్రోహ శక్తులను
యువతకు రోల్‌మాడల్స్‌లా చేసే ఇలాంటివెన్నో
ఈమధ్యకాలంలో ఘనవిజయాన్ని అందుకొన్నాయి..😓

పుష్ప....స్మగ్లర్
బిజినెస్ మెన్.....మాఫియాడాన్
కేజీయఫ్.....అండర్ వరల్డ్ బాస్
ఈడియట్, పోకిరి.....పోరంబోకులు
అతడు, ఊసరవెల్లి.....ప్రొఫెషనల్ కిల్లర్స్

వీళ్లా మన హీరోలు..?
వీళ్లా మన రోల్ మాడల్స్..??

సినిమా అంతా హీరో క్యారెక్టర్‌తో
పనికిమాలిన పనులన్నీ చేయించి
చివరి ఒక్కరీలులో సందేశాలు
అండర్‌కవర్‌ కాప్ బిల్డప్పులూ ఇస్తే
చూసే టీనేజీ కుర్రకారుపై
ఏది ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది?

ఆరోతరగతి చదివే కుర్రాడుకూడా
ఆన్లైన్ ప్లేస్‌మెంట్స్,క్యారీహోమ్ ప్యాకేజీల
గురించి మాట్లాడే ఈరోజుల్లో
ఇలాంటి సంఘవిద్రోహశక్తుల సంపాదన
ఈజీమనీ, గ్లామరైజ్‌డ్ క్రైమ్
పిల్లల మనసుని కలుషితం చెయ్యదా?

అలాగని నేనేదో రామాయణ భాగవతాలను సినిమాలుగా తీయమని చెప్పడంలేదు!

మీరు తీసే సినిమాల ప్రభావంతో
మీకొడుకో..మీతమ్ముడో ఒక డ్రగ్ అడిక్ట్‌గానో ఒక క్రిమినల్‌గా మారి జైలు ఊచలు లెక్కించాల్సివస్తేనో లేదా ప్రాణాలు పోగొట్టుకొంటేనో మీకు ఎలావుంటుందో..ఆబాధ మిమ్మల్ని జీవితాంతం ఎలా వెంటాడుతుందో ఆలోచించమంటున్నాను!

మంచి సినిమాలను మన ప్రేక్షకులు
ఆదరించరు..అనే ఎస్కేపిస్టు దర్శక నిర్మాతలను
ఒక్కసారి ఈమధ్యనే విజయాలను సాధించిన..
నారప్ప..లవ్ స్టోరి..వకీల్‌సాబ్..శ్యామ్ సింగ్ రాయ్..ఉప్పెన సినిమాలను
గుర్తు చేసుకోమంటాను!

స్మగ్లర్‌ని హైలెట్ చేసిన పుష్ప దెబ్బకు వరల్డ్ కప్ సాధించి దేశాన్ని సగర్వంగా నిలబెట్టిన కపిల్‌డెవిల్స్ సినిమా "83"
అడ్రస్ లేకుండా పోయింది!
అసలు ఈమధ్యకాలంలో వచ్చిన మోస్ట్ ఇనస్పైరింగ్ ఆటోబయోగ్రఫీలు..శకుంతలాదేవి,సైనా
రామానుజన్ సినిమాలు మీలో ఎందరు చూశారు!
చిన్న సినిమాలైనా సమాజానికి ఎంతో కొంత మంచిన పంచిన...
కొండపొలం,సినిమా బండి
స్కైలాబ్,మిడిల్‌క్లాస్ మెలొడీస్ లాంటి
ఫీల్‌గుడ్ మువీస్ ఓటిటి ప్లాట్‌ఫాంలో
వున్నాయని మీరు గమనించారా?

బవిరిగడ్డమున్న ప్రతి వీధిరౌడీ
నేడు తనో హీరోననుకొంటున్నాడు!
అమ్మానాన్నలు ఏవైనా మంచిమాటలు చెబితే
పిల్లలు " వినేదేల్యా" అని గడ్డంక్రింద చెయ్యి తిప్పుతున్నారు!
"మచ్చా ఆపిల్ల నిన్నుచూసేందుకు ఎయ్యిరూపాయలు ఇమ్మంది" అని చెంచాలు పోరంబోకులను ఇంకా రెచ్చకొడుతున్నారు!
అందమైన ఆడపిల్ల కనిపిస్తే చాలు
తను నాసొంత ప్రాపర్టీ అని వీధిరౌడీలు
హీరోల్లా ఫీలైపోతున్నారు!
ఆల్రెడీ ఇన్‌సెక్యూరిటీతో బ్రతికే
అమాయక ఆడపిల్లలు వీధిలోకి
రావాలంటేనే బయపడుతున్నారు!
స్మగ్లింగ్ చేసయినా సరే..కోట్లు సంపాదించాలని
యువత ఈ స్మగ్లర్లను డాన్‌లను చూసి
ఇన్‌స్పైరై నాశనమైపోతున్నారు!

నో డౌట్..
ప్రపంచం త్వరలో నాశనమైపోతుంది!
నో డౌట్..
నైతిక విలువలు ఇంకా దిగజారిపోతాయి!

కానీ...
ప్లీజ్..ప్లీజ్...
అరాచకమైన మీ కళాఖండాలతో
ఆ నాశనాన్ని కాస్త ముందుగా తేకండి!
అద్భుతమైన మీ టేకింగ్ స్క్రీన్‌ప్లేలతో
విషాన్ని అమృతమని తాగించకండి!

జాతి గర్వపడే నటులు దర్శకులు మీరు..
సామాజిక బాధ్యత మరవకండి!

విలన్ల దౌర్జన్యాలకు గ్లామర్ హంగులద్ది
హీరోలుగా యువతకు !

వాటితో వచ్చే డబ్బూ, success అనైతికం.
ఏవగించుకోవాల్సినవి అవి.

మంచి సినిమాతీస్తే ఆదరించే ప్రేక్షకులు
మిగిలేవున్నారని మీరు తెలుసుకోండి!

మీరుపెట్టే మంట మీఇంటికి అంటుకొనేంతవరకూ
దయచేసి నిద్ర నటించకండి..🙏🏻

ఇకనైనా మీరు మేలుకోండి..🙏🏻🙏🏻
ఇకనైనా మీరు మేలుకోండి..🙏🏻🙏🏻🙏🏻

మీరూ నాతో ఏకీభవిస్తే
ఈపోస్టింగును మీ ఫ్రెండ్స్ బంధువులతో
మీ గ్రూపుల్లో పంచుకోండి....

................డాక్టర్ గోపీకృష్ణ
మదనపల్లె..🙏🏻😓

సేకరణ

No comments:

Post a Comment