Thursday, February 17, 2022

బ్రూనో బలిదానం సత్యాన్వేషణ దినోత్సవం

బ్రూనో బలిదానం సత్యాన్వేషణ దినోత్సవం
🌟_

ఫ్రెండ్స్ ఫిబ్రవరి 17 కు ఒక ప్రత్యేకత వుంది మీకు తెలుసా????

ఈ రోజును సత్యాన్వేషణదినోత్సవం గా జరుపుకుంటారు. అసలు ఈ దినోత్సవం జరుపుకోవడానికి కారణం తెలుసుకుందాం..

మనకు టాలెమీ ప్రతిపాథించిన భూకేంద్ర సిద్దాంతము తెలుసు..
కోపర్నిస్ కస్ సూర్యకేంద్ర సిద్దాంతం గురించీ తెలుసు..

కానీ ఇంకోక సిద్దాంతము వుంది.. అదే.. "అనంత విశ్వసిద్ధాంతము" దీనిని ప్రతిపాదించినది "పిలిప్ బ్రూనో " ఈ సిద్దాంతంలోని అంశాలు..

◆ ఈ విశ్వానికి భూమిగానీ, సూర్యుడుగానీ కేంద్రం కాదు. సూర్యుడు ఒక గ్రహకూటమికి మాత్రమే కేంద్రం. ఇలాంటి సూర్యకుటుంబాలు చాలా వున్నాయి..

◆ సూర్యుని పోలివుండే మిగతా నక్షత్రాల చుట్టూ కూడా గ్రహవ్యవస్థ వుండి వుండవచ్చు. ఈ గ్రహాలు నక్షత్రాల చుట్టూ తిరుగుతూవుండి వుండవచ్చు. అంతే గానీ నక్షత్రాలు గ్రహాల చుట్టూ తిరగవు..

◆ విశ్వంలోని గ్రహాలు నక్షత్రాలు నియమిత అంక్షాలపై తమచుట్టూ తాము తిరుగుతుంటాయి. సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతుంటాడు..

◆ విశ్వంలోని గ్రహాలకు, ఉపగ్రహాలకు, నక్షత్రాలకు అన్నింటికీ ఆరంభం, అంతం ఉంటాయి, అవి నిరంతర మార్పుకు లోనవుతుంటాయి.

◆ ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వానికి కేంద్రం దానికి సరిహద్దులుండవు,, ఇది అనంతదూరం వరకు వ్యాపించి వుండవచ్చు..

స్వతహగా మతప్రబోధకుడైన పిలిప్ బ్రూనో భూకేంద్రసిద్దాంతాన్ని థిక్కరిస్తున్నాడని చర్చి అధికారులు కోపోద్రేకాలకు లోనైయినారు,..
అదీగాక భూమి, సూర్యునికీ ఆరంభం, అంతం వుంటాయని చెప్పడం మతవిశ్వాసాలను థిక్కరించడమేనని అతనిపై 1591లో 131 నేరాపణలు చేశారు. అతనికీ గాలివెలుతురు రాని గదిలో ఏడుసంవత్సరాలు అతికఠినమైన శిక్షను వేశారు..

అప్పుడప్పుడు మతాధికారులు అతని దగ్గరకు వచ్చి తన వాదనను ఉపసంహరించుకోమనేవారు..అందుకాయన నేను సత్యమును చెబుతున్నాను,. నేను దానికే సిద్దపడుతానని చెప్పేవాడు. చివరికి 1600 ఫిబ్రవరి 17 ఆయనను ఇనప గొలుసులతో బంధించి, పెడరెక్కలు వెనుకకు విరిచికట్టి, నాలుకను ఇనుపముళ్ళకంచెతో కట్టి నోటిగుడ్డకట్టి రోమ్ నరవీధుల వెంట తిప్పుతూ.. మతవిశ్వాసాలను వ్యతిరేఖించేవారికి ఇలాంటి శిక్షే వుంటుందని నినాదాలుచేస్తూ ఊరేగిస్తూ,, పేద క్ర్రెస్తవసన్యాసుల నివశించే గృహసముదాయల మధ్య వుండే వరశిలకు కట్టేశారు. నాలుకకు వున్న వైరును తీసి చివరిసారిగా తప్పుచేశానని ఒప్పుకో.. క్షమిస్తామని వారన్నారు.. అందుకు బ్రూనో నవ్వుతూ "నా మరణం నాకంటే మిమ్మల్నే ఎక్కువ వ్యథకు కోరిచేస్తున్నట్లుంది.,, ఎందుకంటే నేను చెప్పేది సత్యం కాబట్టి.. క్షమాపణ చెప్పను" అన్నాడు.
వెంటనే ఆముదంతో నింపిన గుడ్డలను అతని చుట్టూ వేసి నిప్పుపెట్టేరు.. కాళ్ళనుండి దహించుకేస్తున్న మంటలను చూస్తూ బిగ్గరగా ఇలా అరిచాడు బ్రూనో..

"సత్యం ఎప్పటికీ శాశ్వితమైనది. విశ్వం గురించి సత్యాన్ని ప్రజలెప్పటికైనా తెలుసుకుంటారు" అంటూ సజీవదహనమైపోయాడు, అతను చనిపోయిన 30 సంవత్సరాలకు ఆయన చెప్పినవి చాలావరకు సత్యాలని గ్రహించి ఆయన దహనమైన ప్రాంతంలో ఒక స్మారకచిహ్నం కట్టారు. ప్రతి ఫిబ్రవరి17 ను సత్యాన్వేషణదినంగా జరుపుకోసాగేరు.

"కదిలేది కదిలించేది..
మారేది మార్పించేది..
మునుముందుకుసాగించేది
పెనునిద్దరవదిలించేదీ..
సంపూర్ణబ్రతుకునిచ్చేది"""అయిన విజ్ఞానశాస్త్రం విశ్వాసాలతో పోరాడుతూనే సత్యం వైపు అడుగులు వేస్తుంది..

విరేశలింగం మాటలలో చెప్పాలంటే "ప్రస్తుతం పాతకొత్తల మధ్య, సాధ్యాఅసాధ్యాలమధ్య పోరాటం జరుగుతుంది. బుద్ధివంతులైనవారు ఏ పక్షంలో చేరుతారో చెప్పనవసరంలేదు. ఈ సంగ్రామం సుదీర్ఘకాలం కొనసాగవచ్చు.. తీవ్రంగా కూడా వుండవచ్చు,. అయితే జ్ఞానం, అజ్ఞానాన్ని, సత్యం అసత్యాన్ని తప్పక జయిస్తాయి"""

పిలిప్ బ్రూనో గారికి నివాళులు""
🙏🙏🌹🌹❤‍🔥❤‍🔥🌹🌹🙏🙏




సేకరణ

No comments:

Post a Comment