Tuesday, February 15, 2022

ఆణి ముత్యాలు

నాలుగు గోడల మధ్య సంసారమైనా
నలుగురు మధ్యన జరిగే సంభాషణలైనా
అవగాహనతో అర్ధంచేసుకొని
మర్యాదలు ఇచ్చిపుచ్చుకొని
అపార్ధాలు చెరిపివేసుకొని
ఆనందాలు పంచుకుంటే
ఆలుమగల అన్యోన్య దాంపత్యానికి
ఇదే నిదర్శనం కాదా మరి
పెళ్లి


అందం దేహానికి ఒక ఆభరణం మాత్రమే
మాటతీరు నీకు మరో ఆయుధం
ఆలోచనాశక్తి నిన్ను మరో మెట్టుకు
తీసుకెళ్లే సాధనం
ఆచరణ నిన్ను ఉన్నతస్థితిలో
కూర్చోబెట్టే పాశుపతాస్త్రం


వినడంలో ఉన్న శ్రద్ధ
శోధించడంలో ఉన్న పట్టుదల
విశాధీకరించడంలో ఉన్న నైపుణ్యం
సంధిచడంలో ఉన్న తాత్పర్యం
ప్రేమించడంలో ఉన్న గాఢత్వం
బంధించబడడంలో ఉన్న ఆంతర్యం
అన్ని కలగలిపిన పాఠమే జీవితమంటే


విలువలు తెలియని వాళ్ళ ముందు
నీ కన్నీటిని చూపించకు
నీ బాధే నీకు పరిష్కారాన్ని
చూపిస్తుంది
నీ గుండెకోతే నీకు కొండంత
ధైర్యాన్ని ఇస్తుంది


నీ సంతోషాన్ని చెబితే
నీకు కావాల్సిన వాళ్ళు
ఆనందపడతారు,
నిన్ను చూసి అసూయపడేవాళ్ళు
ఆనందపడినట్లు నటిస్తారు


అలుపెరగని ప్రయాణంలో
ఎన్నో సమస్యలు
ఒకటి పరిష్కరిస్తే
మరెన్నో దారిలో
నీ ముందుకు వస్తాయి

సేకరణ

No comments:

Post a Comment