*🙏మీరు మీ పుట్టినరోజుని అర్ధరాత్రి 12 గంట లకు జరుపుకుంటున్నారా ???🙏*
*https://chat.whatsapp.com/EpEL0cdzmc0JacPdIcRJe3*
*అయితే తస్మాత్ జాగ్రత్త!*
*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*
*ఈ మధ్యకాలం లో సమాజం లో ఓ "వింత పోకడ" మనం గమనిస్తున్నాము. అదే మిటంటే అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినరోజు వేడుకలు, కానీ ఇది ఎంత తప్పో మీకు తెలుసా ?*
*సనాతన హైందవ గ్రంధాల ప్రకారము ఇది తప్పు!*
*అవును ఈ విధంగాఅర్ధరాత్రి వేడుక ఎంత తప్పో మీకు తెలియజేసే ప్రయత్నము చేస్తాను*
*ఈ మధ్య కాలములో నేటి సమాజములో ఎవరిదైనా పుట్టినరోజు కానీ, పెళ్లిరోజు కానీ మరే ఇతర వేడుకైన గాని రాత్రి 12 గంటలకు జరుపుకోవడం ప్యాషన్ గా మారిపోయింది. జనాలు కూడా ఈ విధంగా రాత్రి వేడుకలో కేకులు కోస్తూ సంబరాలు జరుపు కోవడంలో ఆనందాన్ని వెతుకుతున్నారు.*
*కానీ సనాతన హైందవ గ్రంధాలూ రాత్రి 12 గంటల సమయమును "నిషిద్ధ " కాలంగా అభివర్ణించాయి.*
*అవును మధ్య రాత్రి 12 గంటల నుంచి జాము 3 గంటల వరకు హైందవ శాస్త్ర ప్రకారము "నిషిద్ధ గడియలు".*
*అనగా అర్ధ రాత్రి 12 గంటలు సమయములో జరిగే సంబరాలు మనము నిషిద్ధ కాలములో జరుపుకొంటున్నాము. కానీ హైందవ గ్రంథల ప్రకారము ఈ నిషిద్ధ సమయములో మానవ నేత్రాలకు కనబడిని ఎన్నో దుష్ట శక్తులు, దెయ్యాలు, రక్త పిశాచాలు సంచరిస్తుంటాయి . ఈ నిషిద్ధ సమయములో వాటి శక్తులు కూడా పెరుగుతాయి.*
*మనము జీవించే ఈ భూమండలంలో అలంటి శక్తులు చాలానే ఉన్నాయి. అవి మన కంటికి కనబడవు, కానీ వాటి వలన మానవ జీవితాలకు ఎన్నో భయానక మరియు చెడు ఫలితములు గోచరిస్తాయి. వీటి చెడు ప్రభావములచే మానవ జీవితం అపసవ్య మార్గములో పయనించును.*
*ఈ నిషిద్ధ కాలములో జరుపు కొనే వేడుకల వలన ఈ దుష్టశక్తులు మన ఆయువుని హరిస్తాయి. అంతేగాక వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారి, దురదృష్టం ఇంటి తలుపు తడుతుంది. సనాతన ధర్మ గ్రంథాలలో కేవలం ఒక సంవత్సరంలో 4 పండుగలు అవి దీపావళి, నవరాత్రులు, జన్మాష్టమి మరియు శివరాత్రి రోజులలో మాత్రమే ఈ నిషిద్ధ కాలము పుణ్య ఫలితాలను ఇస్తుంది, అది ఎందు చేతనంటే ఈ సమయాలలో నిషిద్ధ కాలము, మహా నిషిద్ధ కాలంగా గోచరించబడుతుంది .*
*పైన తెలిపిన నాలుగు పండుగలు మినహా అన్ని రోజులు నిషిద్ధ కాలములే .*
*హైందవ గ్రంధాల ప్రకారము సూర్యోదయము తోనే రోజు మొదలవుతుంది. అంతే గాక ఎందరో ఋషులు మరియు మునులు / సన్యాసులు ప్రకారం సూర్యోదయం పుణ్యకాలం.*
*ఈ సమయములో వాతావరణం చాల శుద్ధిగా, ప్రతికూలతలు లేనిదియై ఉండును . హైందవ సంప్రదాయం ప్రకారం సూర్యోదయం తర్వాత మాత్రమే పుట్టినరోజు వేడుక జరుపుకోవాలి. ఎందుకంటే మధ్య రాత్రి లో "రజో" మరియు "తమో" గుణాలు వాతావర్ణములో మెండుగా ఉండి, ఆ సమయంలో తెలియజేయు అభినందనలు శుభ ఫలములు ఇవ్వకపోగా వ్యతిరేక ఫలితములు ఇచ్చును. ఏదిఏమైనా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రేండు మూడురోజుల ముందు తయారు చేసిన కేకులు కోయడం మన సంప్రదాయం కాదు.*
*మన హిందూ ధర్మం ఏంటో శాస్త్రీయతతో కూడుకున్నది.*
*కావున హిందూ ధర్మాలలో పొందుపరిచిన మార్గాలనే మనము ఎంచుకొందాం/ఆచరణలో పెడదాం.*
*ఈ వ్యాసాన్ని/ సారాన్ని ప్రతి హైందవునితో పంచుకోగలరు.*
*https://www.facebook.com/groups/638078683192004*
No comments:
Post a Comment