Monday, February 7, 2022

మంచి మాటలు

ఆత్మీయ బంధు మిత్రులకు సోమవారపు శుభోదయం శుభాకాంక్షలు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
చూడు మిత్రమా!!
మనం సంపాదించం మొదలు పెట్టినాక చిన్న చిన్న కోరికలన్నీ గాలికి ఎగిరిపోతాయి,, అదే మన తల్లిదండ్రులు సంపాదించి పెట్టె అప్పుడు మాత్రం గాలి మోటార్ కొనాలి అనే అంతటి ఆశలు ఉంటాయి, నిజామా కదా, ఫ్రెండ్స్,,

🔱శుభోదయం🙏

సోమవారం --: 07-02-2022 :--
ఈరోజు AVB మంచి మాటలు
ఈరోజు మీ అందరికి మంచి జరగాలని అందులో మీరు మీ కుటుంబ సభ్యులు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నా మనిషికి ఉండవలసింది మంచితనం జీవితానికి కావల్సినది తోడు ప్రేమించడానికి కావాల్సినది మంచి మనసు బంధానికి కావల్సినది నమ్మకం మనకు నలుగురిలో ఉండవల్సింది మంచిపేరు మనకు వ్యక్తిత్వం అనేది వేలుగుతున్న దీపంలా ఉండాలి ఎందుకంటే దీపం పురిగుడిసెలో ఐనా ఇంధ్రభవనంలో ఐనా ఒకేలా వెలుగునిస్తుంది .

మన గొప్పను మనం చెప్పుకుంటే అది గొప్పకాదు మన గురించి ఇతరులు చెప్పుకుంటే దాన్ని గొప్ప అంటారు మన కంటే పెద్ద పెద్ద గొప్పోల్లే ఏమి ఏరగనట్లు మౌనం వహిస్తుంటే వారిని చూసి ఎంతో నేర్చు కోవాలనిపిస్తుంది మనం సరిగ్గా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయమంటూ ఏదీ లేదు అయితే మనకు కావాల్సిందలా మంచిగా ఆలోచించి ముందడుగు వేయడమే .

గత జన్మలో మనకు మన కర్మలకు సంబంధం ఉన్నవాళ్ళే మనకు ఈ జన్మలో పరిచయం అవుతారు అందుకే ఎన్నో కోట్లమంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్దిమంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు పని అయిపోగానే వెళ్ళిపోతారు
ప్రతి పరిచయం వెనుక మన మనసుకు, మేధస్సుకు కూడా అంతుచిక్కని అంతరార్ధం ఉంటుంది.!!

సేకరణ ✒️*మీ....AVB సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment