Tuesday, February 8, 2022

దివ్య సందేశం

 దివ్య సందేశం


** || జంతూనాం నరజన్మ దుర్లభం || ఈ భూమిపై చరిస్తున్న వివిధ రకములైన జీవరాశులలో మానవ జన్మ అత్యంతం అరుదైనది. శరీరం కంటె భిన్నంగా ఉన్నాడని విశ్వసింపబడే జీవుడు మరణం తరువాత కూడ మరల జన్మించుటకై కొనసాగుతూనే ఉంటాడు. పూర్వ జన్మ పుణ్యముంటే - భగవానుని అనుగ్రహం వుంటేనే మానవ జన్మ కలిగినది. **మానవ జీవితమునకు లక్ష్యము భగవంతుడే గాని భోగములు కావు, కావున భగవంతునే చేరే జీవితము యొక్క లక్ష్యముగా జేసికొని ఎల్లప్పుడు నీవు సత్కర్మలలో నిమగ్నుడవగుము మరియు తనకు గల కర్మాధికారమును సదుపయోగ మోనర్సువాడే బుద్ధిమంతుడు. అందువలన నీవు పాపములను దుష్కర్మలను అన్ని విధముల త్యజింపుము. పుణ్యకర్మలను సత్కర్మలను సేవించినచో

నీ జీవితము సఫలమగును. 

** మానవ జీవనము యొక్క అంతిమ పరీక్ష మృత్యువు. ఎవరి జీవనము పరిశుద్ధముగా నుండునో వారి మృత్యువు కూడ చక్కనగును. నియమము యొక్క విలువను గ్రహించిన వారికి సమయము

సదుపయోగము జరుగును. 

** అనేక జన్మల భోగవాసనలు మనస్సులో నివాసము చేయును. వానిని తొందరగ త్యాగము చేయలేము. కాని జపధ్యానముల ద్వారా జ్ఞాన పూర్వకముగా శ్రద్ధతో ప్రయత్నముచేసి బాగుగా చేయబడును.


No comments:

Post a Comment