Thursday, February 10, 2022

భక్తులు అనేవారు - నిరంతరస్మరణ ఎందుకు చేయాలి?

🕉️ భక్తులు అనేవారు - నిరంతరస్మరణ ఎందుకు చేయాలి?🕉️

✍️ మురళీ మోహన్

👉 'అంత్యకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వారు నిస్సందేహంగా నన్నే చేరుకుంటారు, వారికి మరు జన్మ అంటూ ఏదీ ఉండదు.' అని కృష్ణపరమాత్మ సెలవిచ్చేరు.

మనం ఒక పరీక్ష పాసు కావాలన్నా, కొంత కాలం పాటు అభ్యాసము, సాధన అవసరము.
సంవత్సరం అంతా కష్టపడి చదివితే పరీక్షల సమయంలో అన్నీ చక్కగా గుర్తుకు వస్తాయి. తేలికగా ఉత్తీర్ణులం కాగలము. అంతే కానీ అప్పటికప్పుడు చదివితే ఉత్తీర్ణులం కాలేము కదా!.

కొంత అభ్యాసం లేకుండా ఏపనీ చేయలేము కదా. అలాగే అంత్యకాలంలో భగవంతుడు గుర్తుకు రావాలంటే జీవిత కాలం అంతా కూడా భగవంతుని స్మరించడం ముఖ్యం.

జీవితం అంతా దుష్ట ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, కామ సంబంధమైన ఆలోచనలతో గడిపితే అంత్య కాలంలో కూడా అవే గుర్తుకు వస్తాయి కానీ పరమాత్మ గుర్తుకు రాడు.

కాబట్టి అంత్యకాలంలో కూడా పరమాత్మ స్మరణకు రావాలంటే, నిరంతరము భగవంతుని ఆలోచన, చింతన, స్మరణ, ధ్యానము ముఖ్యము. వీటి పట్ల నిర్లక్ష్యము, సోమరితనం ఎట్టి పరిస్థితిలలోనూ రానీయకుండా చూసుకోవాలి. ..


🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉

సేకరణ

No comments:

Post a Comment