Saturday, February 5, 2022

మంచి మాట..లు

ఆత్మీయ బంధు మిత్రులు శనివారపు శుభోదయ శుభాకాంక్షలు లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు, వల్లి దేవసేన సమేత తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, శ్రీ రామభక్త వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
శని వారం --: 05-02-2022 :--
ఈ రోజు AVB మంచి మాట..లు
నవ్వినా కన్నీళ్లు వస్తాయి బాధపడినా కన్నీళ్లు వస్తాయి కానీ నవ్వించిన వారు నాలుగు రోజులు గుర్తుంటారు బాధపెట్టిన వారు జీవితాంతం గుర్తుంటారు శరీరం పూర్తి ఆరోగ్యంగా మనసు నిండా ఆనందం ఈ రెండూ ఉన్నవాళ్లే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు మనకు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడది తప్పకుండా వస్తుంది ఏది ఎప్పుడు వదిలి పోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే నీవు ఉన్నంత వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకుని జీవించడమే ,

నీ జివిత పుస్తకాన్ని అతి కొద్ది మంది దగ్గర మాత్రమే తెరవాలి ఎందుకంటే చాలా మందికి కేవలం పుస్తకం తిరిగెయ్యడం లోనే మక్కువ అతి కొద్ది మంది మాత్రమే అందులో ప్రతి పేజీని క్షుణ్ణంగా చదివి నిన్ను అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తారు .



మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెబుతుంది నీకు బుద్ది ఎంతుందో మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో మన వినయం చెబుతుంది నేర్పిన విద్య ఎలాంటిదో .

*సేకరణ ✒️మీ ...AVB సుబ్బారావు 🌹💐🤝

సేకరణ

No comments:

Post a Comment