🌺🙏🏻ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🏻🌺
🌿భగవంతుడు ప్రత్యేకించి ఏ ఒక్కరికో కష్టాలను కానీ సుఖాలను కానీ ఇవ్వడం జరుగదు.
🌿ఎవరి కష్టసుఖములకు వారు చేసుకున్న కర్మలే కారణం.
🌿భగవంతుడు మనకు దేహాన్ని, జ్ఞానమును ఇచ్చినది సత్కర్మలతోనూ, సదాలోచనలతోనూ జన్మను సార్థకం గావించుకొమ్మని, ఆత్మానందంను అనుభవించమని. అయితే వాటిని మనం ఏ విధముగా ఉపయోగించుకుంటామన్నది అనేది మన ఇష్టమునకు వదిలేసాడు.
🌿మనం చేసుకున్న దానికి ఆయనను నిందించడం తప్పు. వద్దంటే ఆయన మన త్రోవకు అడ్డుపడడు. కానీ ఆయనను ఆశ్రయించే వారికి సరైన మార్గం సూచిస్తాడు.
🌿ఆయన మన కర్మఫలంనకు అడ్డు చెప్పడు. కానీ ఆయనను నమ్మి బ్రతికేవారి కర్మల ఫలితాన్ని తగ్గిస్తాడు. ఆయన మనకు శక్తి సామర్ధ్యాలను ఇచ్చాడు కనుక మనకు మనమే పోషణ చేసుకోవాలి. కానీ అన్నీ తానే అని నమ్మినవారి పోషణ బాధ్యత ఆయనే చూసుకుంటాడు.
🌿ఏదీ ఆయన స్వయంగా చేయడు.
🌿కానీ చెయించుకునేవారికి ఏ విధముగా చేసాడనేది అనుభవంలోకి వస్తుంది.
🌿మన మార్గంలో మనమే నడుస్తామో లేక మార్గదర్శి మార్గంలో నడుస్తామో మనమే నిర్ణయించుకోవాలి.
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment