నేడు మన కర్తవ్యాన్ని గురించి తెలుసుకుందాం.
దేవుడు ఎక్కడో ఉండడు భగవంతుడి స్థానం మన మనస్సు. దేవుడు కొలువై ఉన్న ఆలయాన్ని ఎంత పవిత్రంగా ఉంచుతామో, మనసనే మందిరాన్ని కూడా అంతే పవిత్రంగా ఉంచాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈర్ష,అసూయ,ద్వేషం, కుళ్లు,కుతంత్రం,వైరం, వీటన్నింటినీ మోసుకొని తిరుగుతూ వ్యాపింప చేస్తున్నాము. ఇప్పుడు చెప్పండి ఇటువంటి దుర్గంధ పూరితమైన వాతావరణంలో దైవం కొలువై ఉండటం అసంభవం కదా! అందుకే నాది నాది అని తపించే వాళ్లకీ ఏదీ మిగలదు. నిజానికి ఏది నీది? అశాశ్వతమైన ఈ జీవితంలోని ప్రతిక్షణం ఏది నీది కాదు! ఈ నిమిషం నీతో ఉన్నవారు మరు నిమిషంలో నీతో ఉండరు. రాబోయే గంటలో మీ జీవితం ఏ మలుపు తిరుగుతుందో నీకు తెలియదు కనిపించే నీ బంధువులు నీ పగ, ప్రతీకారాలు రాగద్వేషాలు అన్నీ అశాశ్వతమే! మరి మనం పుట్టింది ఎందుకు? వీటన్నిటికీ అతీతమైన శాశ్వతమైన దైవాన్ని తెలుసుకునేందుకు మనం పుట్టింది. అమృతమయమైన దైవ ప్రేమను అనుభూతి చెందడానికి. కానీ నేను నాది అనే మాయ పొర మనకు దైవానికి మధ్య అడ్డుతెర .ఆ తెర తొలగించి ఒక్క సారి కనిపించే అందరిలో, అన్నింటిలో దైవం కొలువై ఉన్నాడనే నిజాన్ని దర్శించ గలిగితే ఇక మన జీవితం ధన్యమే.
అలాగే మనజీవన విధానంలో - ధర్మం ఎందుకు ఆచరించాలి?
ఈ దేహం ఒకటి ఉంది కాబట్టి దాని అవసరాలు తీర్చక తప్పదు. భోజనం, నీరు, వస్త్రాలు వంటి ప్రాథమిక అవసరాలు విధిగా సమకూర్చి తీరాల్సిందే.
ఆకలి తీరితే శరీరం శాంతిస్తుంది, కానీ రుచులుకోరే మనసు మాత్రం శాంతించదు. ఆకలి శరీర అవసరమైతే, రుచి మనసుకు కలిగే కోరిక.
ప్రకృతి ధర్మాలైన శరీర అవసరాలను తీర్చటం సముచితమైనా మితము లేని మానసిక కోర్కెలను తీర్చాలనుకోవటం శాంతిని దూరం చేసే విషయం.ఎంతటి జ్ఞానికైనా అన్నం తింటేనే కడుపు నిండుతుంది. కనుక శరీర పోషణ, రక్షణలు మనకు అత్యవసరం.
అశాంతి కారకాలైన కోరికల ఉధృతి తగ్గాలంటే మనసుకి సహనం చాలా అవసరం.
సుఖ సంతోషాల ద్వారా మనం పొందాలని వెంపర్లాడుతున్న శాంతి మనలోనే ఉందన్న సత్యం తెలిస్తే వెతుకులాటలేని పవిత్ర జీవనం ఏర్పడుతుంది.
ఈ పవిత్ర జీవనం కోసమే మన పెద్దలు ధర్మం ఆచరించమన్నారు.
చెవులతో శబ్దాన్ని,👃ముక్కుతో పరిమళాన్ని, 👅నాలుకతో రుచిని 👁️కంటితో రూపాన్ని ,చర్మంతో స్ఫర్శని 🛕దేవుడు ప్రతి మనిషికి ఎలా ఐతే ఇచ్చాడో అలాగే ఏమండీ మనస్సుతో మానవత్వాన్ని చూడమని ఇచ్చాడు."కాబట్టి" అన్నీ ఇచ్చిన అ దేవుడికి...
మనం కృతజ్ఞతతో పక్కవాడు కష్టాలలో ఉంటే ఆదుకోవాలి.
ఇలా ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడే వారి ఇల్లు స్వర్గంలా వుంటుంది, కానీ అసహనంతో, తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వారి ఇల్లు నరకంలా మారుతుంది గొప్ప గొప్ప పనులు మరియు విజయం బలంతో కాదు పట్టుదలతో అనునిత్యం కష్టపడటం వలన సాధ్యమవుతాయి..
మన ఆలోచన..
ఒక విత్తనం అయితే..
ఆ విత్తనం నుంచి వచ్చేదే..
మహావృక్షం..!
ఆ వృక్షం మంచిది అవ్వాలంటే
విత్తనం మంచిదిగా ఉండాలి కదా..మన జీవితం కూడా అంతే..ఆలోచన మంచిదైతే..
జీవితం కూడా ఆనందంగా
ఉంటుంది..!!
సేకరణ. మానస సరోవరం 👏
No comments:
Post a Comment