💖💖💖
💖💖 *"336* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"ఆకర్షించే వస్తువుల నుండి దూరంగా ఉంటూ కోరికలను అధిగమించవచ్చా ?"*
**************************
*"అది సరికాదు. ప్రపంచంలో ఏ వస్తువూ నీ మనసు గుణాన్ని మార్చకుండా చేసుకోగలగడం మనం చేయాల్సిన నిజమైన ధ్యానసాధన. మనకి తెలిసిన విషయంతో మనసును ఉంచటం జ్ఞాపకం. అలా కాకుండా ఆ విషయంతో మనం కలిసి ఉండాలి అనుకోవటం కోరిక. ఈ ప్రపంచంలో వస్తువుల నుండి దూరంగా ఉండి, నేను కోరికను దాటాననుకోవటం ఏమాత్రం సరికాదు. అన్నీ ఉండి వాటిని వదులుకున్న వాడిని సర్వసంగ పరిత్యాగి అంటారు. ఏమి లేనివాడికి వదులుకోవటానికి ఏదీలేదు. మనం కోరుకున్న వస్తువు దగ్గర లేదు కాబట్టి దాన్ని వదులుకోవడం శ్మశాన వైరాగ్యం. అసలా వస్తువు నుండి నీకు లభించేది ఏదీ లేదని అవగాహనతో వదిలివేయటం నిజమైన పరిత్యాగం !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
🌼💖🌼💖🌼
🌼🕉️🌼
No comments:
Post a Comment