Thursday, September 22, 2022

త్యాగం అమృతాన్ని ఇస్తుంది!

 Xx3. X.  1-5.   220922-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

 త్యాగం అమృతాన్ని ఇస్తుంది!
              ➖➖➖✍️

ఉన్నదానిలో కొంతైనా వదలకపోతే శాంతిలేదంటారు.

 "తేనత్యక్తేన భుంజీథా !"                     అని ఈశావాస్య ఉపనిషత్ తెలిపింది.. ఈ విషయాన్ని విచారిస్తే రాత్రి పొట్టలో నింపుకొని దాచుకున్న  పదార్థాలను ప్రొద్దున్నే వదిలే ప్రక్రియ ఏర్పాటుచేసి త్యాగమును అలవరచుకోవండి, వదలండి అని అన్యాపదేశంగా హితవు చెప్పుచున్నాడు. సృష్టికర్తయగు భగవంతుడు.

భౌతిక శరీరంలో  దాచుకొన్న దానిని వదలకపోతే ఎంత నష్టమో ఇంట్లో దాచుకొన్నది కూడా కొంతలో కొంతైనా వదలాలి, త్యాగము చేయాలి. అప్పుడు ఇహపరములలో మనకు శాంతి సుఖాలు లభిస్తాయి.

 "లోభము" కూడా నరకద్వారమునకు దారితీస్తుందంటారు గీతాచార్యులవారు.     కావున మోక్షద్వారములో ప్రవేశించుటకు కావలసిన సన్నాహాలు ఎందుకు చేసుకొనకూడదు.

లగేజి…

ఈ లోకానికి వచ్చునప్పుడు ఏ లగేజితో రాలేదు. తిరుగు ప్రయాణానికి లగేజి బరువు మోతతో అష్టకష్టాలు పడవలసి వస్తున్నది. ఇది వారు వారు కష్టపడి తగిలించుకొన్న లగేజి అని ఎంతమంది. ఊహిస్తారు? భావిస్తారు? రైలు, బస్సు ఎక్కుటకు పోర్టర్ (కూలీని)ను పిలిచి లగేజి మోత అతని నెత్తిన పడేసి దర్జాగా చేతులూపుకొని పోవుటకు ప్రయత్నిస్తారు. మరి భగవంతుని సన్నిధికి ప్రయాణమునకు లగేజి మోత విషయమై ఎవరాలోచిస్తారో వారు ముందుచూపు గలవారు. ముందు జాగ్రత్త కలవారు.

ఒక రైతు చద్దిమూట నెత్తిన పెట్టుకొని పోవుచున్నాడు. ఆ మోత బాధగానే వుంది. మరోవైపు పొట్టలో ఆకలిబాధ, ఈ రెండు బాధలకు విరుగుడు ఆలోచించి నెత్తిన మోత గల చద్దిని దింపి పొట్టలో వేశాడు. నెత్తిన మోత, బాధపోయింది. పొట్టలో ఆకలిబాధ పోయింది. 

అదే విధంగా మన లగేజి పెంచుకొని మోత బరువుతో బాధపడుటకంటే దానిని ఇతరులకు ఉపయోగిస్తే ఇరువురికి తృప్తికలిగిస్తుంది. 

ఈ విధంగా ఇతరులకు దానమిచ్చింది పరలోకములో ఫిక్స్ డ్ డిపాజిట్ రూపమున వడ్డీతో సహా మన అవసరాలకు ఉపయోగపడగలదు. 

 కావున మనమంతా శక్తికొలది (యూనివర్శల్ బ్యాంక్ లో) విశ్వప్రభుత్వ ఖాతాలో ఫిక్స్ డ్ డిపాజిట్ చేద్దాం- పరలోకములో డ్రా చేసుకొని శాంతిగా జీవిద్దాం..!

హరి నామ స్మరణ చేయండి... వైకుంఠ ధామానికి ప్రయాణం సులభతరం చేసుకోండి!✍️

హరే కృష్ణ  హరే కృష్ణ
కృష్ణ కృష్ణ  హరే హరే।
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే॥
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment