Xxxi. X2. 1-6. 040123-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*ప్రలోభాలు-ప్రయోజనాలు!*
➖➖➖✍️
*ఆకాశంలో ఒక ‘గ్రద్ద’ ఆహారం కోసం చూస్తుండగా...*
*ఒక ‘నక్క’ ఎర్రలతో నిండిన బండి లాగుతూ వెళ్తోందట... పై నుండి దీన్ని చూసిన గ్రద్ద రయ్యిమని ఆ నక్క ముందు వాలి “ఆ ఎర్రలు కావా”లని నక్కను అడిగిందట.*
*అప్పుడు ఆ నక్క “తప్పకుండా ఇస్తాను, కానీ కొంత వెల అవుతుంది!” అన్నదట.*
*దానికి ఆ గ్రద్ద “ఏమివ్వాలి? ఎంత ఇవ్వాలి?” అని అడిగితే… “నీ రెండు ఈకలు ఇస్తే నేను ఒక ఎర్రను ఇస్తాను” అని నక్క అన్నదట.*
*గ్రద్ద తన రెండు ఈకలు పీకి ఇచ్చిందట. నక్క వాటిని తీసుకుని ఒక ఎర్రను తీసి ఇచ్చిందట.*
*దాన్ని తింటూ ‘ఆహ ఎంత రుచిగా ఉంది మళ్ళీ ఇంకొకటి తిందాం!’ అని మళ్ళీ నక్క దగ్గరకు వచ్చిందట. అలా రుచి మరిగి మళ్ళీ మళ్ళీ తన ఈకలనిచ్చి ఎర్రలను కొంటూ వచ్చిందట ఆ గ్రద్ద.*
*చివరికి ఆ గ్రద్ద ఒంటిమీద ఈకలన్నీ అయిపోయాయి. అప్పుడు ఒక్కసారిగా నక్క పెద్దగా నవ్విందట. గ్రద్ద తేరుకొని నిజం తెలుసుకొనే లోగా తన ఈకలన్ని ఊడి పైకి ఎగరలేక పోయింది. నక్క అమాంతం గ్రద్ద పైబడి చీల్చి తినేసింది.*
*విచక్షణ కోల్పోయి శక్తినంతా అమ్ముకుని, ఎగిరే శక్తిని కోల్పోయి, చివరకు ప్రాణాలు విడిచింది ఆ గ్రద్ద.*
*సరిగ్గా మన జీవితంలో కూడా మనల్ని ఆకర్షించి, ప్రలోభ పెట్టి మనకు తాత్కాలిక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే విషయాలే మన పాలిట విషప్రాయాలై మన జీవితాలను విషాదంలో ముంచేస్తాయి. ఆకర్షణల ప్రలోభాల కారణంగా మన దృష్టి మరల్చ బడుతుంది. మనిషి యొక్క లక్ష్యాన్ని, ఏకాగ్రతను, భగ్నం చేసే పరిస్థితులు, ప్రలోభాలు అడుగడుగునా ఎదురవుతూనే ఉంటాయి.*
*ఒక వ్యక్తి తన ముందున్న లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో ఆకర్షణల, ప్రలోబాలకి లొంగి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment