Friday, March 3, 2023

:::::మనస్సుకు తెలియనిది అంటే ఎందుకు భయం?:::::

 *మనస్సుకు తెలియనిది అంటే ఎందుకు భయం?*

   మనస్సు తెలిసిన చోటే వుంటుంది.(మనస్సు గతంతో నిర్మించ బడినది)
  తెలియని చోట మనస్సు తన అస్తిత్వాన్ని కోల్పోతుంది.

 కనుక ఇక్కడ భయం తెలియని తనం గురించి కాదు.
అస్తిత్వ సమస్యే భయం 
     భవిష్యత్తు అంటే తెలియనిది. అందుకే భవిష్యత్తు ని ఊహిస్తూ,ఇలాగే వుంటుంది అని నమ్మి మనస్సు తన అస్తిత్వాన్ని కాపాడు కుంటుంది.

 అందుకే మనం నాకు అన్నీ తెలుసు లేదా నాకు ఏమి కావాలో అది తెలుసు అన్న నమ్మకంతో వుంటాం.

 సాధ్యం అయినంత వరకు తెలియని దానిని పరిచయం కానివ్వం
    ధ్యానికి మనస్సు కన్నా తెలుసు కోవడమే ముఖ్యం. అందుకే   ధ్యాని నిరంతర సత్యాన్వేషి.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment