అలవాట్లు మనిషిని దేవుడిగానైనా,దుర్మార్గుడు గానైనా మారుస్తాయి. మన అలవాట్లే మన జీవన విధాతలు..
అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండాలని భావిస్తే,అవి ఎదురుతిరుగుతాయి..వాటికి అనుగుణంగా మనం మారితే మనకు అనుకూలంగా అవి మారతాయి..
పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా
మనం మనలాగే ఉండడమే
అసలైన ధైర్యం..
నవ్వు అనే తాళం చెవిని పోగొట్టుకుంటే
సంతోషం అనే తలుపు ఎప్పటికీ తెరుచుకోదు..
బంగారంలో ప్రతి రేణువు విలువైనట్లే కాలంలో ప్రతి క్షణమూ విలువైనదే.!!
️వేలెత్తి చూపించేవాడెవ్వడూ ఒక్కపూట ముద్ద కూడా పెట్టడు అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు అది కష్టమైనా..సుఖమైనా..బాధ అయినా..సంతోషమైనా నీ జీవితం నీది...
.
*రెండు గొప్ప శత్రువులు*
మనిషికి ఇద్దరు శత్రువులు వున్నారు. ఒకటి ' *అహంకారం'* మరి యొకటి ' *మమకారం'.*
అహంకారం ' *నేను, నేను* ' అంటే మమకారం ' *నాది, నాది'* అంటూ ఉంటుంది.
ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువును స్వీకరించినప్పుడు ' *ఇది నాది* ' అని మమకారం వల్ల వస్తుంది. అదేవిదంగా ఏదైనా పని చేసినప్పుడు ' *ఇది నేను చేసినాను* ' అనే భావన అహంకారం వలన కలుగుతుంది.ఆదిత్యయోగీ..
దీనికి చక్కని తార్కాణం ఈసంఘటన.
జగద్గురువుల వారు ఒకసారి ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్నప్పుడు వారు ఒక క్షేత్రాన్ని సందర్శించినారు. ఆ ప్రదేశం ఎంతో పుణ్య క్షేత్రం అయినప్పటికీ చాలా మంది యాత్రికులను అది ఆకర్షించుటలేదు. ఎందుకంటే ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా లేవు అక్కడ. ఒక అధికారి దీనిని సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టి ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత యాత్రికులు పెద్ద సంఖ్యలో ఆ క్షేత్రాన్ని సందర్శించడం ప్రారంభించినారు. జగద్గురువుల వారు అచ్చటికి వెళ్ళినప్పుడు ఆ అధికారి అక్కడి విషయాలు చూపిస్తూ ఇది అంతా తన కృషివలననే అని ప్రగర్భాలు పలికినాడు. అదివింటూ జగద్గురువుల వారు మవునంగా ఉండిపోయారు. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చినప్పుడు జగద్గురువులు ఆగిపోయినారు. గోపురాన్ని చూసి ఆ వ్యక్తిని అడిగినారు. *జగద్గురువులు* "మీరు ఈ గోపురాన్ని చూస్తున్నారా"..? *అధికారి* అవును చూస్తున్నాను.
*జగద్గురువులు* : దీని ఎత్తు ఎంత..?
*అధికారి* : చాలా ఎక్కువ.
*జగద్గురువులు* :దానితో పోలిస్తే మనం ఎక్కడ వున్నాము..?
*అధికారి* :చాలా తక్కువ స్థాయిలో
*జగద్గురువులు* :ఇలాంటి గోపురాలు ఎందుకు నిర్మించారో మీకు తెలుసా. ఇది మన అహంకారాన్ని వదిలించుకోవటానికి. మనం ఎంతటి అజ్ఞానమైన హీనస్థితి లో ఉన్నామో తెలియపరచేలా చేస్తుంది. ఈ అద్భుతమైన విశ్వ సృష్టికర్త అయిన విశ్వనాధుని గురుంచి ఆలోచించినప్పుడు వారి అద్భుతమైన పనులతో పోలిస్తే వారి ముందు మనం సాధించినది ఏమంత ముఖ్యమైనది కాదని తెలుసు కుంటాము. అందువల్ల "నేను దీన్ని చేసాను" వంటి ఆలోచనలు కలిగివుండటం చాలా అర్ధ రహితం...
.
Very first second... మనం ఒక దాన్ని చూసిన వెంటనే ఓ రెడీమేడ్ అభిప్రాయం తన్నుకు వస్తోందంటే ఖచ్చితంగా ఆ రెడీమేడ్ అభిప్రాయం ఏ రొటీన్ థాట్ ప్రాసెస్ నుండో ఖచ్చితంగా ప్రభావితం చెయ్యబడి ఉంటుంది.
మనం ఒక మూసలో పెంచబడ్డాం.. ఆలోచించడం మొదలెట్టాం.. ఒక మూసలో ప్రశ్నించడమూ, సమాధానం చెప్పడమూ, బాధ్యత వహించడమూ.. పనిచేయడమూ... జీవితంతో ముడిపడి ఉన్న ప్రతీదీ ఓ మూసలో ఇరుక్కుపోయింది.. దీన్ని "రొటీన్" అని ముద్దుగా పిలిచేసుకుంటున్నాం కానీ ఆ పదమూ చాలా రొటీనే అయిపోయింది.. రొటీనంటే ఏంటో కూడా పెద్దగా సెన్స్‌కి వంటబట్టట్లేదు... గమ్ముని విని ఓ నవ్వు నవ్వి ఊరుకోవడం తప్పించి!!
అన్నీ తెలుసుకోవడమే లోకజ్ఞానంగా మన మెదళ్లల్లో బలంగా నాటేయబడింది.. అలా పెంచేసుకున్న మన జ్ఞానం ఘోరంగా ఫెయిలవుతోంది...
ఒక సంఘటన జరిగితే గతాన్ని టకాటకా ఫొటోగ్రఫిక్ మెమరీలోకి గుర్తుతెచ్చుకుని.. బుర్ర అరల్లో ఉన్న నాలెడ్జ్ పుటల్నీ తిరగేసీ.. మునుపటిలానే స్పందించడం కామన్ అయిపోయింది.. చచ్చినా రావు మనకు కొత్త ఆలోచనలు. అవెప్పుడో చిగుళ్ల కూడా తొడగనంత చచ్చిపోయాయి..
మనం అనలైజ్ చేస్తున్నామనుకునేదంతా కొన్నేళ్లపాటు మనం ఈ భూమ్మీద బ్రతికేసిన జీవితంలో పోగుచేసుకున్న జ్ఞాపకాలూ, అనుభవాల డేటాబేస్ నుండి ఎగ్జామ్స్ అప్పుడు పుస్తకాలు తిప్పేసినట్లు ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లేదే తప్పించి.. అది అనలైజేషనే కాదు...
ఎంత ఎక్కువ మంది మనుషుల్ని చూస్తే అంత జీవితం అర్థమవుతుందట... నిజమే..! నిజమనుకునే నమ్మేస్తున్నాం.. అలా నమ్మేస్తూ ఒక మనిషి మెజర్‌మెంట్లని మరో మనిషికి అంటగట్టేసి.. అవి అతికినట్లు సరిపోకపోయినా.... మనం చెప్పిందే కరెక్టనీ.. అవతలి మనిషి మనస్థత్వాన్ని సైతం మనం రీడిఫైన్ చేస్తున్నాం.
కష్టాలు అనుభవిస్తే మెచ్యూరిటీ వస్తుందట... అనుభవించేసిన కష్టాలు ఉన్న కాస్తో కూస్తో సెన్సిటివిటీని చంపి పాతరేస్తే.. నవ్వుకీ, ఏడుపుకీ తేడా లేని ఎక్స్‌ప్రెషన్‌లెస్ ఫేస్ పెట్టుకుని... రాటుదేలిపోయామనుకుంటున్నాం... అది స్థితప్రజ్ఞత అనేసుకుంటున్నాం.. అసలు స్థితప్రజ్ఞతకు మనం చదువుకున్న డెఫినిషన్‌కి మించి ఆలోచించడం మనకు చేతనై ఉంటే కదా :.
Out of the box thinking అని ఒకటుంటుంది... చాలాసార్లు మేధావులు పెద్ద పెద్ద చర్చల్లో ఎడాపెడా వాడి పారేస్తుంటారు ఈ పదాన్ని..! విభిన్నంగా ఆలోచించడం.. ఓ ఛట్రంలో ఇరుక్కుపోకుండా పరిధి దాటి ఆలోచించడం..ఆదిత్యయోగీ..
వినడానికి ఈ పదం బానే ఉంది.. కానీ..
కన్నూ, చెవూ, ముక్కలూ... సరే విడివిడిగా ఎందుకులే జ్ఞానేంద్రియాలన్నీ అనుకుందాం... అవన్నీ బయటి ప్రపంచం నుండి సేకరించిన ప్రతీ విషయానికీ డేటాబేస్ తిరగేసి రెడీమేడ్‌గా స్పందించడం సుఖంగా భావించే బాపతు జనాలుగా మిగిలిపోయాం కదా.. ఇంకెక్కడ out of the box thinking వస్తుంది?
ప్రతీ దాని గురించి ఆ మూమెంట్‌కి ఏదో ఒకటి ఎంత ఈజీగా అనేసుకోగలిగితే అంత ఈజీగా అనేసుకుని ముందుకు సాగిపోవడం అలవాటైపోయింది.. చివరకు ఇది చదివిన తర్వాతా కొందరు అనేసుకోవచ్చు... ఏదో అర్థం కాని ఛాదస్తమనీ... ఇవన్నీ మనకెందుకనీ... ఇంకా చాలానే..
ఇలా కొన్ని రెడీమేడ్ ఆలోచనలు, అభిప్రాయాలతో మనకు మనం Sheel లాక్స్ గట్టిగా వేసేసుకుని... ఎందుకు ఎదగలేకపోతున్నామో... భిన్నంగా ఆలోచించలేకపోతున్నామో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటాం...
.
అనగనగా ఒక రోజు బాలుడికి ఒక సందేహం వచ్చింది. గురువుని వెళ్ళి అడిగాడు….
“గురువుగారు, యెక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా?”
గురువుగారు చిరునవ్వుతొ ఈ జవాబు చెప్పారు…….
“కప్పకూత రాత్రి-పగలు వినిపిస్తూనే వుంటుంది, అయినా దాన్ని యెవ్వరూ పట్టించుకోరు…….
కాని కోడి ఒక్కే ఒక్క సారి కూస్తే ఊరంతా నిద్ర లేస్తుంది…..
దీని వల్ల అర్ధమయ్యేది యేమిటంటే, యెక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు….
మాట్లాడేది ఒక మాటే అయినా, అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు.”
సందేహం తీరిన కుర్రవాడు సంతోషంగా వెళ్లాడు......*
No comments:
Post a Comment