Friday, April 12, 2024

Story

 'నీవేనా నను తలచినది'.. తన నుంచి ఫొను వచ్చిందేమోనని ఆశగా చూసాడు చంద్రం.  ఉహు కాదు.. ఏదో sales  call. 

'నీవేనా నను పిలిచినది'  తన నుంచి ఫొను వచ్చిందేమోనని ఆశగా చూసింది మల్లి.   ఉహు కాదు.. ఏదో sales  call.

అతను ఇక్కడ హైదరాబాదులో.. ఆమె అక్కడ కాకినాడలో.  పెళ్లయి రెండు సంవత్సరాలైంది ఇద్దరికి.  విపరీత అన్యోన్తత. ఏదో చిన్న గొడవొచ్చింది.  చిలికి చిలికి పెద్ద తుఫానై కూర్చుంది.    సరె నే వెల్తా అంది మల్లి.  భలే మంచి నిర్ణయం పొమ్మన్నాడు చంద్రం.    మామగారికి ఏదో ఆఫీసు పని మీద out of station వెళుతున్నా.. అమ్మాయిని పంపిస్తున్నాని చెప్పాడు.. బస్సెక్కిచ్చాడు మల్లిని.

వెళ్లి మూడు రోజులైంది.  హైదరాబాదు - కాకినాడల మధ్య విపరీతమైన హృదయాకర్షణ శక్తి తిరుగుతోంది.. కాని connect అవట్లేదు. 

                                 ***

చంద్రం  వాళ్లిద్దరికీ ఇష్డమైన restaurant లో ఎప్పుడూ ఇష్టంగా తెప్పించుకునే పులావు తెప్పించుకున్నాడు.  తనతో తింటూ ఉంటే వచ్చే రుచి రావట్లేదు.  ఏదో కడుపునింపాడు.. మనసు వెలితిగానే ఉంది..  Officeలో ఎవరో Netflixలో కొత్త సినిమా వచ్చిందన్నారు.‌  అలాగైనా గడిపేద్దాం.. Thrillగా ఒక్కడినే చూస్తా అనుకుని ఏదో ఊహించాడు...     ఈ మధ్యే కొన్న కొత్త పెద్ద TV.. చూస్తున్నాడు.. ఉహు.. తనతొటే చూడాలి.  తనుండాలి.    ఫోను చేస్తేనో..  ఏఁ నేనుందుకు చేయాలి.. తనదే తప్పు.. ముమ్మాటికీ తనదే... తను తప్పు తెలుసుకోవాలంతె..లాజికల్ మైండ్ కొండెక్కి కూర్చుంది.  మనసేమో లాగేస్తోంది.. అలా తన నంబరు dial చేసెయ్యమంటోంది.    అనుకున్నాడు.. నరకయాతన రా బాబు.
                                   ***
మల్లి వాళ్లింట్లో మల్లి రాక పండగలా ఉంది.  ఒక్కతే కూతురు మరి.   తనకి ఇష్టమైనవి చేసింది అమ్మ,ఇంకా ఏవో తెప్పించింది వాళ్ల నాన్నతో.    భోం చేస్తున్నారు.  వాళ్ల అమ్మానాన్న ప్రతి ముద్దకీ మధ్య అళ్లుడు గారూ వచ్చుంటే బావుండేది.. ఆయనని కనుక్కున్నావా ఏం తిన్నారో.. ఎప్పుడొస్తున్నారు‌.   తన భర్త గురించి అడుగుతుంటే బావుంది..అవును ఓ కొడుకుని తెచ్చుకున్నారు ఇంటికి.  ఆయన కూడా అలాగే ఉన్నారు.
మల్లి చంద్రంతో ఉంటే ఈ వంటలు యమగా లాగించేసేది.. కాని ఇప్పుడు మింగుడు పడట్లేదు.  అమ్మానాన్నలు గమనిస్తున్నారు.‌  వాళ్లకి తెలుసు మల్లి ఇక్కడున్నా మనసు చంద్రం దగ్గరే ఉందని.   

                                ***

చంద్రం officeలో clientతో మాట్లాడుతున్నాడు.  Client దాదాపు బూతులు తిడుతున్నాడు.  అసలు తన తప్పు లేదు.  అయినా సామరస్యంగా చెబుతున్నాడు చంద్రం.  తప్పులేకపోయినా క్షమాపణలు చెప్పాడు.  వాళ్లని ప్రసన్నం చేసుకోడానికి శతవిధాల ప్రయత్నించాడు.   వాళ్లు తన Bossకి ఫిర్యాదు చేసారు.. Boss కూడా ఇచ్చుకున్నాడు. మళ్లీ ఇచ్చుకున్నాడు.  Boss చెప్పాడు...నీ తప్పు ఉందో లేదో నాకు అనవసరం.. Client నుంచి ఎట్టి పరిస్తితిలో నాకు escalations/complaints రాకూడదు అంతె.. మళ్లీ dose ఇచ్చాడు.    

చంద్రానికి అర్ధమైంది..  ఇక్కడ స్పష్టంగా వాళ్ల తప్పున్నా....అంత సామరస్యంగా మాట్లాడాడు.  చివరికి తన పై అధికారి విచక్షణా రహితంగా అందరి ముందూ పేలేసినా మూసుకునే భరించాడు.   ఇవాళ జరిగిన అవమానం అంతా భరించి, అసలు ఏదీ జరగనట్టుగా.. మళ్లీ రేపటి meetingకి సన్నధమవ్వాలి... కాని...తన మల్లితో జరిగిన చిన్న గొడవకే ఆమె మీద ఎందుకు తనంత నోరుపారేసుకున్నాడు‌.. ఆమె తనకి ఏమీ కానట్టుగా చీత్కరించాడు.. తన బాగే కోరుకుని, నిత్యం తననే స్మరిస్తూ..అన్నీ తనై ఉన్న  మల్లిని ఎందుకు అలా నోరుపారెసుకున్నాడు.. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతోనే ఉన్నా. పెళ్లైన తరువాత వాళ్లని మరచి..
నన్నే నమ్మిన మల్లితో ఎందుకు గొడవపడ్డానని బాధపడ్డాడు.  Officeలో అందరి ముందు జరిగిన అవమానం ముందు మల్లితో జరిగిన వాదులాట చాలా ...  చాలా చిన్నదనిపించింది.   

చంద్రంకి Office సంఘటన అస్సలు అవమానం అనిపించలేదు.. కాని మల్లితో తను ప్రవర్తించిన తీరు తప్పనిపించింది.  ఆ రోజు కాస్త సున్నితంగా ప్రవర్తిచ్చి ఉంటే బావుండేది. అవును ముమ్మాటికి తను చేసింది తప్పే అనిపించింది చంద్రంకి.   ఇప్పుడు లాజికల్ మైండు, మనసు రెండూ మల్లినే కోరుకుంటున్నాయి.

                                  ***

మల్లి TV చూస్తోంది.  పరధ్యానంలో పక్కనే ఉన్న అమ్మ ఫోనుని క్రింద పడేసింది.  చిన్న నొకియా ఫోనే..పగిలింది. నాన్న పక్కనే ఉన్నారు.  ఒకింత అసహనానికి లోనయ్యారు..  అమ్మ కూడా అంత అజాగ్రత్తతో ఉంటే ఎలా అనేసింది.    నాన్న అమ్మని కేకలేసారు ఫోను జాగ్రత్తగా పెట్డుకోవాలి కదా అని. సర్లె రేపు చూద్దాంలే ఇంకోటి అని సముదాయించారు కాసేపటి తరువాత.

మల్లికి ఒక్కసారిగా చివుక్కుమంది...తను చంద్రంతో గొడవపడ్డప్పుడు.. ఖరీదైన ఫోనుని విసిరి కొట్టింది.. ఎంత కోపం వచ్చి ఉండాలి చంద్రంకి.   మల్లికి తప్పు చేసాను అనపించింది.      చంద్రం రేయింబవళ్లు కష్డపడుతున్నాడు. మంచి స్తితికి రావాలని తపన పడుతున్నాడు.  పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా తనని ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు.. చంద్రంతో గొడవ పడడం ముమ్మాటికీ తప్పే..  అంత చిన్న విషయానికి చంద్రానికి చికాకు తెప్పించింది.  తనని తాను నిందించుకుంది.. అవును, తనే అనవసరంగా గొడవపడింది.  తను officeపనిలో తలమునకలవుతున్నా విసిగించి గొడవ పడింది. చంద్రం దగ్గరకి వెళ్లిపోవాలి. మనసు పరితపిస్తోంది.

మల్లి పరధ్యానాన్ని గమనిస్తున్నారు అమ్మానాన్న   
'ఏంటమ్మా అంత దిగులుగా ఉన్నావు..అల్లుడు గారు గుర్తొచ్చారా' నాన్న అడిగారు.

'నాన్నా వెంటనే నన్ను ఆయన దగ్గరకి తీసు.'..పూర్తవకుండానే కళ్లోలోంచి నీరు...   ఆయనకి అర్ధమైంది.   బయలుదేరారు  హైదరాబాదుకి.

మల్లికి ఒక్కో క్షణం యుగంలా ఉంది.
       
                                 ***

వీళ్లిద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నప్పుడు...

ఇద్దరూ షాపింగుకి వెళ్లి Taxi లో తిరిగొస్తున్నారు.  Driver ఏదో దిగులుగా ఉన్నట్టు గమనించాడు చంద్రం.. Driver నడుపుతున్నంత సేపు ఎవరితోనో మాట్లాడుతున్నాడు.   మల్లికి అస్సలు నచ్చడం లేదు. ఇల్లు క్షేమంగా చేరారు.   
ఇంట్లోకి అడుగుపెడుతూనే Taxi service నుంచి SMS.  Service ఎలా ఉందని, driver serviceని rate చేయమని.
చంద్రం వెంటనే 5 star rating ఇచ్చాడు.  Driver excellent అని కితాబిచ్చాడు.     మల్లి అడిగింది driver గురించి complain చేయమని. చంద్రం తను అప్పటికే మంచి రేటింగ్ ఇచ్చేసానన్నాడు.   అక్కడ నుంచి మొదలైంది  వాదన.  మల్లి మనం service providerకి చెప్పకపోతె వాళ్లకి ఎలా తెలుస్తుంది, అతను భయపడడు..ఇలా తప్పు చేస్తునే ఉంటాడంటుంది..   చంద్రం లేదు అతను ఏదో సమస్యలో ఉన్నాడు..అందుకే అలా మాట్లాడాడు...పాపం ఎందుకు పోనీలే అంటాడు..    చంద్రానికి office వాళ్లు అప్పటికే బాదుతున్నారు ఫోను చేస్తు.   చంద్రం సహనాన్ని కోల్పోయాడు.   వాదనలు high voltage కి చేరుకున్నాయి. చివరికి విద్యుత్ ఘాతం.

                                ***
ఉదయమైంది.    గత రాత్రంతా ఇద్దరూ గుడ్లుగూబల్లా మేలుకునే ఉన్నారు.  చంద్రం దగ్గర కొస్తున్నందుకు మల్లికి, రేపు లీవ్ పెట్డైనా మల్లి దగ్గరకి వెళ్లాలని చంద్రంకి.. ఇద్దరికీ ఒకటే.. కలుసుకోవాలి..తనివి తీరా మాట్లాడుకోవాలి.. 

'నీవేనా నను తలచినది'.. తన నుంచి ఫోను వచ్చిందేమోనని ఆశగా చూసాడు చంద్రం.  ఉహు కాదు.. బాస్ నుంచి phone..Congratulations చంద్రం.  నీకు promotion వచ్చింది.  ..Boss అంటున్నాడు.. నీ temperament, business నడిపిస్తున్న తీరు clientకి బాగా నచ్చిందని..contract ఇంకో రెండు సంవత్సరాలు పెంచారని. Boss చాలా పొగిడాడు చంద్రాన్ని.. మునగ చెట్టెక్కించాడు.
చంద్రం అస్సలు ఊహించలేదు...Boss కి కృతజ్ణతలు చెప్పాడు.. Leave కోసం అనుమతి తీసుకున్నాడు.

Call అలా cut చేసి వెంటనే మల్లికి వీడియో call చేసాడు.. 
Call connect అవడం లేదు.. అసహనంగా ఉంది..
Calling bell మోగింది.. తలుపు తీసాడు.. call చేస్తూనే...
వీడియో కాల్ చేస్తే.. తనే ఎంత స్పష్టంగా కనిపిస్తోంది..కాకపోతె మామగారితో.. ( కలయో నిజమో వైష్ణవ మాయో...Virtual reality😂😂) 

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ...   
ఇద్దరి కళ్లలో బాధ, ఆనందంతో కలిసిన కన్నీళ్లు.

వీళ్ల అనురాగానికి మామగారికి కూడా ఆనందభాష్పాలు రాలాయి.   

లీవ్ ఉందిగా.    ముగ్గరూ చాలా సంతోషంగా గడిపారు.

                              **   **   **

మన వాళ్లు..మన అనే భావన మనలో అంతర్లీనంగా ఉన్నప్పుడు ఏ తప్పులూ చూడము. ఏ తప్పులూ కనబడవు.
అనుబంధాల ముందు తర్కం పనిచేయదు, నిలవదు.

---------------------------------------------------------------------



Jagan Konduri Tirumala

No comments:

Post a Comment