#సెక్యులరిజం మోజులో పడి
ఈ సంస్కృతి లో దొరికే విలువైన వజ్రాల వంటి ఈ నైతిక కథలను విద్యార్థులకు ఇవ్వడం మానేసి మసి బొగ్గులు వంటి విదేశీ విలువలు అందిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దేందుకు విపరీతమైన కృషి చేస్తున్నాం.
P Sateesh ఉత్తమ posts లో ఒకటి.
" పింగళ " కధ
(Human weaknesses, psychology మీద ఆనాడే వ్రాయబడిన ఆణిముత్యం లాంటి కథ )
మధ్యప్రదేశ్ లో ఉజ్జయిని ఒక నగరం. మొదట్లో అదొక రాజ్యం. దానికి రాజు భర్త్పృహరి (Bhartrhari ). ఆయనకు మూడవ భార్య పింగళ. ఆమె అంటే రాజుకు చాలా ఇష్టం. ఇష్టం మాత్రమే కాదు ప్రాణం అని చెప్పాలి. ఆమె ఆరోజుల్లోనే విశ్వసుందరి. అంటే ఈరోజుల్లో Miss Universe.
సుఖభోగాలు అనుభవిస్తున్నా రాజు మనసులో ఎప్పటి జన్మల కర్మ ఫలమో తెలియదు కానీ ఆధ్యాత్మికత మొదలయ్యింది.(1) అయినా ఇప్పటికీ పింగళ మోజులోనే వున్నాడు.(2)
ఒక రోజు రాజు ఆస్థానానికి గోరక్ నాథ్ అనే మహా తపస్వి వచ్చాడు. ఆయన రాజుకు ఒక అరుదైన పండు ఇచ్చి " రాజా, ఇది తిన్న వ్యక్తి ఎప్పటికీ యవ్వనం లోనే వుండిపోతాడు. ఆయుష్షు వందల ఏళ్ళు పెరుగుతుంది " అని చెప్పి వెళ్ళిపోయాడు.
పింగళ అంటే తనకున్న ఇష్టం వల్ల ఆమె ఎప్పుడూ నిత్యయవ్వనం తో, చాలా కాలం జీవించాలి అని అనుకొని రాజు ఆ పండును ఆమెకు ఇస్తాడు.(2) తానంటే ఆమెకు ఇపుడు మరింత ప్రేమ పెరుగుతుంది అనుకొన్నాడు రాజు. (2)
కానీ ఆయనకు ఒక భయంకరమైన నిజం తెలియదు.
పింగళ రహస్యంగా రాజ్యం లో మహా వీరుడైన ఒక సైనికుడు, గుర్రపు స్వారి అద్భుతంగా చేసే మహిపాల్ అనే అతన్ని ప్రేమిస్తూవుంటుంది. (2)వారిద్దరి రహస్య సంబంధం పాపం రాజుకు తెలియదు. (2)
పింగళ ఆ పండును తీసుకెళ్లి మహిపాల్ కు ఇస్తుంది, అతను నిత్య యవ్వనుడుగా వుంటే తానూ సుఖభోగాలు అనుభవించవచ్చని ఆమె ఆలోచన. (2) కానీ పింగళ కు ఒక భయంకరమైన నిజం తెలియదు. తాను ఎవరిని ప్రాణప్రదంగా ప్రేమిస్తోందో ఆ మహిపాల్ నిజానికి ఆరాజ్యంలోనే వున్న లఖ అనే మరో స్త్రీ ని ప్రేమిస్తుంటాడు. (2) ఆమె ఉజ్జయిని నగరంలో వేశ్య. మహా అందగత్తె.
మహిపాల్ ఆ పండును లఖ కు ఇస్తాడు. ఆమె నిత్య యవ్వనంలో వుంటే తాను సుఖభోగాలు అనుభవించవచ్చని అతని ఆలోచన. (2)
కానీ పండు అందుకొన్న లఖ మరో విధంగా ఆలోచించింది. " నేను వేశ్య గా చేస్తున్నదే పాపపు పని. దానిని కొనసాగించాలి అనుకోవడం ధర్మమా? నా లాంటి నీచులు కాదు, ప్రజలను రక్షిస్తున్న రాజు చాలా కాలం జీవించాలి '' అని అనుకొని (1) ఆ పండును తీసుకెళ్లి రాజు భర్త్పృహరికి ఇస్తుంది.
ఆశ్చర్య పోయిన రాజు తనకు తన గురువు గోరక్ నాథుడు ఇచ్చిన పండు ఈ వేశ్యకు ఎలా చేరింది అని ఆరా తీస్తే అసలు రహస్యం బయట పడింది. తన ప్రాణం అనుకున్న పింగళ తనకు చేసిన నమ్మకద్రోహానికి రాజు మనసు శాశ్వతంగా విరిగి పోయింది. తన తమ్ముడైన విక్రమాదిత్యుడిని ఉజ్జయిని రాజ్యానికి రాజుగా ప్రకటించి, ఆధ్యాత్మిక జీవితమే (spiritual life ) నిజమైన జీవితం అని తెలుసుకొని (1), దైవం వైపు ఆకర్షితుడై ఏకాంతం లోకెళ్ళి తపస్సు చేసి మహా ఋషి అయ్యాడు. (1) భర్త్పృహరి సుభాషితాలు( చెప్పిన /వ్రాసిన మంచి నీతి వాక్యాలు ) సుప్రసిద్ధం అయ్యాయి.
పై వ్యాసం లో నేను (1) అని (2) అని కొన్ని చోట్ల వ్రాసాను. (2) అనేది మనిషి లోని బలహీనతను (human weakness ), (1) అనేది మనిషిలోని మంచితనాన్ని (human goodness ) చూపిస్తాయి.(గమనిస్తే (2) లే ఎక్కువగా వున్నాయి )
చాడ శాస్త్రి....
No comments:
Post a Comment