*✍🏼 నేటి కథ ✍🏼*
*బంగారు పూలు - మట్టి పూలు*
తాండమాను చక్రవర్తి తిరుమలలో వేంకటేశ్వర స్వామికి గుడి కట్టించి బంగారు పూలతో రోజు పూజ చేయు చుండెను. ఒకసారి రాజు గుడికి పూజ చేయుటకు వెళ్ళగా అక్కడ బంగారు పూల బదులు మట్టి పూలు వుండెను. బంగారు పూలు ఎవరో దొంగలించినారని గూఢచారులను, కాపలదారులను నియమించెను. అయినా బంగారు పూలు మాయమై మట్టి పూలు కనిపించుచుండెను. రాజు చాలా దిగులుతో స్వామిని వేడుకొనెను. స్వామి, తాండమాను చక్రవర్తికి కలలో కనిపించి భీముడు అనే కుమ్మరి చాలా భక్తితో పూజ చేయగా ఆ పూలు ఇక్కడ నీకు కనిపించు చున్నవని చెప్పెను. రాజు సైనికులను పంపి వెతికించి భీముని జాడ తెలుసుకొని అతని దగ్గరకు వెళ్ళెను. భీముడు మట్టిని త్రాకుతూ స్వామిని వేడుకొనుచు తన చేతికి వున్న మట్టితో పూలను చేసి దగ్గరలో స్వామి ఫొటోను వుంచుకొని దానిమీదకు విసరు చుండెను. అది చూచిన రాజు పూజ ఈ విధముగానా చేయడం అని అడుగగా, కుమ్మరి భయంతో రాజుకు నమస్కరించి రాజా స్వామి అంటే నాకు చాలా ఇష్టము, కూర్చుని పూజ చేయడానికి నాకు సమయము లేదు, పూజా విధానము తెలియదు చేయకుండా వుండలేను. అందుకే నాకు తోచిన విధముగా పూజ చేయుచున్నాను అని చెప్పెను. రాజు అతని భక్తికి మెచ్చి ధన సహాయము చేసి వెళ్ళెను. పూజకు మనస్సు ముఖ్యము. శ్రద్ధ భక్తి వుండాలి
*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
No comments:
Post a Comment