ఓ నీతి కథ..
*ఒకబ్బాయికి ఉరిశిక్ష అమలు చేస్తారు. .*
*'ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు'*
*నాకంటే ముందు నా తల్లిదండ్రులను ఉరితీయాలి' 'అదేం పిచ్చి కోరిక. జన్మనిచ్చిన తల్లిదండ్రులనే ఉరితీయమం టావా?. అందులో ఏమైనా అర్థం ఉందా?'*
*'అవును అర్థం ఉంది.. నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న చెత్త పనులు చేస్తుంటే నన్ను చూసి మురిసిపోయారు. నేను అల్లరి చేస్తుంటే గద్దించలేదు. వయసొచ్చాక తప్పుడు పనులు చేస్తుంటే నన్ను మందలించలేదు. ఆ తర్వాత నేను వ్యసనాలకు బానిసనయ్యాను. తప్పుడు మార్గంలో పయనించాను. ఎన్నో ఘోరమైన పనులు చేశాను. నేను ఒక్కడ్నే కొడుకునని.. నన్ను ఆనాడే గారాబం చేయకుండా.. దండించి ఉంటే.. నేను ఈ రోజు.. ఈ పరిస్థితుల్లో ఉండేవాడిని కాదు. నేనే మారతానని అనుకున్నారే కానీ.. నేను ఎలా మారాలో చెప్పలేదు. నేను చేసే పనులకు తల్లిదండ్రులే అడ్డుచెప్పకపోవడంతో.. నేను చేసే పనులన్నీ కరెక్టే అనుకున్నా. ఇప్పుడు అలాంటి పనులకు సమాజం అడ్డు చెబుతుంటే తెలిసొచ్చింది.. నేను నడిచింది తప్పుడు మార్గమని. నాడు వాళ్లు నన్ను అలా వదిలేశారు కాబట్టే.. నేనిలా ఉరికంభంపై ఉన్నా. అందుకే నా కంటే ముందు నా తల్లిదండ్రులనే ముందు ఉరి తీయాలి.' అన్నాడు. అందుకే పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి.*
No comments:
Post a Comment