౼౼౼౼౼◆ భగవద్గీత సూక్తులు ◆౼౼౼౼౼
1. మనము మన పనిని ఫలితము ఆశించకుండా నిర్వర్తించాలి అనేది గీత చెప్పే మొదటి పాఠము. ఫలితము ఆశించకుండా మనస్ఫూర్తిగా పనిని నిర్వర్తిస్తే ఫలితము దానంతట అదే సిద్ధిస్తుంది అని గీత భోధిస్తుంది.
2. శరీరము శాశ్వతము కాదు ఆత్మ మాత్రమే శాశ్వతము. మన శరీరము ఒక వస్త్రము వంటిది. వస్త్రము చినిగిపోయిన తరువాత కొత్త వస్త్రము ధరించినట్లు, ఆత్మ ఒక శరీరాన్ని వదలి కొత్త శరీరాన్ని ప్రవేశిస్తుందని కృష్ణ భగవానుడు చెపుతాడు.
3. ఈ ప్రపంచములోకి వచ్చినవారు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వీడి పోవలసినవారే. ఎవరు శాశ్వతము కాదు, కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజమైనది. సత్యమే నిజమైనది శాశ్వతమైనది.
4. కోపమే అన్ని అనర్ధాలకు మూలము. నరకానికి ఉండే ప్రధాన మూడు ద్వారాలలో కోపము ఒకటి. మిగిలిన రెండు మోహము, ఆశ. కోపము లో ఉన్న వ్యక్తి ఆలోచనారహితుడవుతాడు, అప్పుడు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి పశువులా ప్రవర్తిస్తాడు.
5. కర్మను అనుసరించేదే బుద్ధి. మనిషి తన జీవితకాలంలో కర్మలను అనుభవించాలి.
6. ఈ జగత్తులో మార్పు అనేది సహజము. కోటీశ్వరుడు యాచకుడిగాను, యాచకుడు కోటీశ్వరుడుగాను మారవచ్చు. ఏదీ శాశ్వతము కాదు.
7. ప్రతి మానవుడు ఖాళీ చేతులతో భూమిమీదకు వస్తాడు. ఖాళీ చేతులతోనే భూమిని వదలుతాడు.
8. నిత్య శంకితుడికి భూమి మీదగాని ఇక ఎక్కడైనా గాని సుఖ శాంతులు లభించవు. ముందు ఎవరైనా తన్ను తాను తెలుసుకొనే ప్రయత్నము చేయాలి. అప్పుడే సుఖ శాంతులకు దగ్గర అవుతాడు. సంతోషాన్ని పొందగలడు.
9. కోరికలను జయించాలి లేదా అదుపుచేసుకోవాలి అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యము అవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది.
10. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మే వారికీ ఎప్పుడు మంచే జరుగుతుంది. మనము నిమిత్త మాత్రులము అంతా భగవంతుని చేతుల్లో వున్నది. మనము మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వారికీ ఎప్పుడు మంచే జరుగుతుంది.
11. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది... కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు... సింహం నోరు తెరుచుకుని కుర్చున్నంత మాత్రాన వన్య మృగం దాని నోటి దగ్గరకి వస్తుందా...?
12. మనస్సును స్వాధీనపరచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది.
13. భగవద్గీత లో స్పష్టంగా వ్రాసి ఉంది!! దేనికి నిరాశ చెందక కృంగిపోవలసిన అవసరం లేదని!! బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే!!! నీవు కాదని!!!
14. దాచిపెట్టిన ధనం పరులపాలు
అందమైన దేహం అగ్నిపాలు
అస్థికలన్నీ గంగ పాలు
కొడుకు పెట్టిన తద్దినం కుడు కాకుల పాలు
నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరిపాలో?
కానీ నువ్వు చేసిన ధాన, ధర్మాల పుణ్యఫలం మాత్రమే నీ పాలు
ఇది తెలుసుకొని అందరూ బతికితే ప్రపంచమంతా శాంతి పాలు
15. మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈరోజుకి నాధనమెంత పెరిగింది అని. పైనుండి దేవుడు నవ్వుతూ మనిషి ఆయుష్షు లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈరోజుకి నీ ఆయుష్షు ఇంత తరిగింది అని.
16. భగవద్గీత కు మించిన స్నేహితుడు
కాలాన్ని మించిన గురువు...
ఎక్కడ దొరకడు.
17. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు,
ఓడినవాడు విచారంగా ఉంటాడు,
అవి రెండూ శాస్వితం కాదని తెలిసిన వాడు
నిరంతరం సుఖంగా, శాంతంగా, సంతృప్తిగా ఉంటాడు.
18. ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ ఒక్కటే, ఒకరిని ద్వేషిస్తున్నాం అంటే, తనని తాను ద్వేషించుకుంటున్నట్లే, కష్టపడినచో పని పూర్తి అవుతుంది కళలు కంటూ కూర్చుంటే జీవిత కలం వృధా అవుతుంది.
19. ఈ లోకం కటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు పది మంది గుండెలో నిలిచినా వారిని మాత్రమే చిరలాకలం గుర్తుపెట్టుకుంటారు.
నీదంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్నీ తీసుకెళ్లలేవు భౌతిక, అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాలి.
20. జననం మరణం సహజం
ఎవరు వీటి నుండి తప్పించుకోలేరు
వివేకం కలిగిన వారు వీటి గురించి ఆలోచించారు
జీవితం అనేది యుద్ధం లాంటిది పోరాడి గెలవాలి ప్రయత్నిస్తే గెలవలేనిది అంటూ ఏది లేదు.
21. అతిగా స్పందించడం..అది కోపం.. అతి ప్రేమ.. అతి లోభం ఇలా అతి మంచిది కాదు. ప్రతి విషయంలో స్థిరంగా ఉండు. స్థిత ప్రజ్ఞతతో జీవించు. అతిగా సంతోషపడటం.. అతిగా బాధ పడటం రెండూ మంచివి కావు.
22. నానావిధాలైన అనేక మాటలు వినడం వల్ల చలించిన నీ మనస్సు, నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆత్మజ్ఞానం పొందుతావు.
23. నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను..
ప్రాణుల సృష్టి, స్థితి, లయలు నేనే...
24. ఆత్మ చేధింపబడజాలదు..
దహింపబడజాలదు..
తడుపబడజాలదు..
25. మరణం అనివార్యం
పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు
ఎవరూ అమరులు కాదు.
26. అందరిలో ఉండే ఆత్మ ఒకటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది!!!
27.ఎవరైతే అనన్య భక్తితో నన్నే సేవిస్తుంటారో,నిరంతరం చింతన చేస్తూ ఉంటారో, అటువంటి వారి యోగ క్షేమాలను నేనే స్వయంగా చూసుకుంటాను...
28. ఓడిపోయావని భాదించకు
మరల ప్రయత్నించి చూడు
ఈసారి విజయం నీ తోడు వస్తుంది
29. కుండలు వేరైనా మట్టి ఒక్కటే
నగలు వేరైనా బంగారం ఒక్కటే
అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే
అన్ని తెలుసుకున్న వాడే జ్ఞానీ
30. గుర్తుంచుకో…ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని నమ్ము ఇప్పుడు ఎం జరుగుతోందో అదే మంచికే జరుగుతోంది
భవిష్యత్తులో జరగనున్నది కూడా మంచికే జరగనున్నది.
31. మానసిక శాంతి లేని జీవితం వృధా
కోపం బుద్దిని మందగిస్తుంది మరియు జీవితాన్ని నాశనం చేస్తుంది
32. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏదీ ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నదీ ఒక్కటే, ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే.!
33. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరూ బాధపెట్టిన నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకున్న కాలం తప్పక శిక్షిస్తుంది.
34. దేనికి భయపడవద్దు. మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకున్నది. భగవంతుని నామాన్ని జపిస్తూ ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరించాలి. సాక్షాత్తూ భగవంతుడే మానవునిగా పుట్టినా కూడా ఈ బాధలనుండి తప్పించుకోలేదు.
ఇహ మానవమాత్రులం మనమెంత.!
35. నిగ్రహం లేనివాడికి వివేకం ఉండదు.
యుక్తుడు కానీ వానికి ధ్యానం కూడా కుదరదు.
ధ్యానం లేనివాడికి శాంతి లేదు.
శాంతి లేనివాడికి సుఖమెక్కడ ?
36. గురువులు ఎందరో
సద్గురువులు ఎందరో
మార్గాలు ఎన్నో
బోధలు ఎన్నో
శోధనలు ఎన్నో
కానీ
గురువులకు గురువు అయిన జగత్గురువు ఒక్కరే
గీత తెలుపని
మార్గాలు లేవు
బోధలు లేవు
సాధన లేదు.
37. అభ్యాసం కంటే జ్ఞానం
అంతకంటే ధ్యానం
దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టమైనవి.
త్యాగం వలనే శాంతి కలుగుతుంది.
38. ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్కపు
పట్టుగలది. దీనిని నిగ్రహించటం వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా
అనిపిస్తుంది, ఓ కృష్ణా.
39. దుఃఖం పిరికివాని లక్షణం మనిషిలోని శక్తి సామర్ధ్యాలను నశింపచేస్తుంది. ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని నశింప చేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు...!!
40. అగ్నిని పొగ ఆవరించినట్లు,
అద్దాన్ని దుమ్ము కప్పినట్లు,
గర్భస్త శిశువుని మావి కప్పినట్లు,
జ్ఞానాన్ని కామం కప్పి వేస్తుంది.
41. నీ మనస్సు యొక్క శక్తి చే నిన్ను నీవు
ఉద్ధరించుకొనుము, అంతేకానీ పతనమైపోవద్దు.
ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు.
42. జ్ఞానము, విశ్వాసము రెండూ లేని వారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు
పతనమైపోతారు. విశ్వాసము లేక, సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పర లోకంలో కూడా సుఖం ఉండదు.
43. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి
భగవద్గీతను మించిన ఆయుధం లేదు.
44. తెలివి, జ్ఞానం, మోహరాహిత్యం, ఓర్పు, సత్యము, మనో నిగ్రహము, సుఖ దుఃఖాలు, ఉండడము, లేకపోవడం, భయభయాలు అన్ని నావలననే కలుగుతాయి.
45. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి.. వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది. కానీ..
ఏ ఒక్కరికి తమలో ఉండే "గర్వం" తెలుసుకునే తెలివి ఉండదు.
46. జీవితంలో వయసు ఉన్నపుడే భగవద్గీతను చదవండి! ఎందుకంటే జీవితం చివరి దశలో చదివి తెలుసుకున్నా.. ఆచరించేందుకు జీవితం ఉండదు కాబట్టి!
47. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహలేనివాడును, రాగము, భయము, క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును.
48. నువ్వు కోరితే కోరినదే ఇస్తాను,
కోరకపోతే నీకు అవసరమైనది ఇస్తాను.
49. నీ పని నీవు చక్కగా చేసుకుంటూ పో...
ఫలితాన్ని మాత్రం నాకు వదిలి పెట్టు!!
50.
నా దేశం భగవద్గీత
నా దేశం అగ్నిపుణిత సీత
నా దేశం కరుణాతరంగా
నా దేశం సంస్కార గంగ
భగవద్గీత ఆచరిద్దాము. ఆరాదిద్దాం.
సర్వం శ్రీకృష్ణార్పణం...🙏🏻🙏🏻🙏🏻
_*Namasthe*_🙏🏻🎊🙏🏻
"Knowing is not enough; we must apply. Willing is not enough; we must do"
-BG-
p t seshacharyulu xlic ananthapuramu
No comments:
Post a Comment