🙏 *రమణోదయం* 🙏
*జాగ్రత్, స్వప్నాల రెండిటిలోనూ ఒకే రకమైన దోషం ఉన్నదని జ్ఞానులంటారు. స్వప్నలోకం లాగా దేహాభిమానంతో కూడిన జాగ్రత్ లోకం కూడా మాయమైపోయేదే కదా!*
ఆత్మన్వేషణం ఒక దూరప్రయాణం వంటిది కాదు..
ఆత్మకు నీవెంత దూరంలో ఉన్నావని??
ఆత్మను నీవెన్నడూ విడచి లేవు...
విడిచి ఉండడం అసాధ్యం..
ఆత్మకంటే సన్నిహితమైన వస్తువు లేదు..
ఆత్మను పొందడానికి నీవు ఎక్కడికీ పోనక్కర లేదు..
అది నీకు అవ్యవహితంగా ఉన్నదే!🙏
🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.553)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
No comments:
Post a Comment