Thursday, January 23, 2025

 * రమణ హృదయం *

i. 'ఉన్నది' లేక ఉన్నట్టు తోచు జ్ఞానం శూన్యం. 
ఏ తలంపూ లేని సద్వస్తుస్థానం హృదయం.
హృదయమందు మనముండుటయే స్మరణం.

ii. మరణభయం తొలగడానికి ఏకైక ఉపాయం
జనన మరణములు లేని శివునికి శరణుపొందటం.

1. మనం చూచే లోకానికి మూలకారణం దైవం.
సినిమా-తెర-కాంతి-ప్రేక్షకులు ఆయనే సర్వం.

2. జగత్తు సత్యము కాదని పలికి ఏమి లాభం?
'నేను' లేని స్థితి సర్వసమ్మతం.

3. జీవ-జగత్-జగదీశ్వరులు ప్రతి మతానికి హృదయం. 
అహం చచ్చి తన స్థితిలో తానుండుట ఉత్తమం.

4. నాకు రూపముంటే  దైవానికి తప్పదు రూపం. 
నాకు రూపం లేదంటే దైవానికి లేదు రూపం. 
కన్ను లేక కనుట అసాధ్యం. 
తానే తుదిలేని నేత్రం.

5. దేహము పంచకోశాకారం. 
దేహము లేక లోకము శూన్యం.

6. లోకం పంచవిషయాత్మకం. 
మనసు లేక లోకము శూన్యం.

7. లోక-జ్ఞానములకు మూలం పరిపూర్ణం.
లోకమునకు జ్ఞానమే ప్రకాశం.

8. నామరూప సహిత ఆరాధనం,
నామరూప రహిత దైవానికది మార్గం.

9. ద్వంద్వ-త్రిపుటాదులకు ఆధారం ఏకాత్మస్వరూపం. 
అది యెదియని లోన వెదకగా కలత మాయం.

10. జ్ఞానం-అజ్ఞానం ఒకదానికొకటి ఆధారం. 
ఈ రెంటికి ఆధారం స్వరూప జ్ఞానం.

11. ఎఱిగెడు తనను ఎఱుగుట జ్ఞానం.
తన్నెఱిగినచో జ్ఞానాజ్ఞానములు మాయం.

12. తానెఱిగే జ్ఞానం అజ్ఞానం. 
జ్ఞానాజ్ఞానములు లేని తానే జ్ఞానం. 
శూన్యము కాదని భావం.

13. జ్ఞానమైన తానే సత్యం. 
పలుతెగల నగలకు ఆధారం బంగారం.
జ్ఞానాజ్ఞానములకు తానే ఆధారం.

14. 'నీవు-అతడు' రెంటికీ నేను ఆధారం. 
నేనును ఎఱిగితే నేను-నీవు-అతడు మూడూ మాయం. 
నేను లేకపోతే మిగిలే వెలుగే నా స్వభావం.

15. భూత-భవిష్యత్తులకు ఆధారం వర్తమానం. 
ఏ సమయానికాసమయం వర్తమానం.
అప్పుడు-ఎప్పుడో అనక 'ఇప్పుడు' తత్త్వ మెఱగడం అవసరం.ఆదిత్యయోగీ.
'ఒకటి' లేక ఎంచదలచడం అవివేకం.

16. 'నేను' లేక దేశకాలములు శూన్యం.
దేహాత్మభావం సర్వబంధములకు కారణం. 
నేను సదా సర్వదా ఏకం. 
దేశకాలములు లేని నేనే సత్యం.

17. అజ్ఞానికి, జ్ఞానికి దేహం సమం. 
అజ్ఞానికి 'నేను' దేహం వఱకే పరిమితం. 
జ్ఞానికి 'నేను' హద్దులేని స్వరూపం.

18. అజ్ఞానికి, జ్ఞానికి జగత్తు సత్యం. 
అజ్ఞానికి లోకం మాత్రమే సత్యం. 
జ్ఞానులకు సత్యము లోకమునకు ఆధారం.
ఇదియే ఇరువురికి గల వ్యత్యాసం.

19. మూలవివేకం లేనివారికే విధి-మతుల వివాదం. 
మూలమైన తనను ఎఱిగినచో వాదన మానడం ఖాయం.

20. చూచే తన్ను చూడక కనబడేది మానసిక దర్శనం. 
తనను తాను చూడడమే దైవదర్శనం. 
దైవము లేక తానుండుట అసంభవం.

21. తనను తాను చూడడమే దైవదర్శనం. 
తాను ఏకవస్తువు అనేది అందరికీ అనుభవసిద్ధం.
తనను తాను చూడడమెట్లా? అని సందేహం.
తాను ఆ దైవానికి ఆహారమగుటయే మార్గం.

22. బుద్ధికి దైవమిచ్చెను ప్రకాశం. 
బుద్ధికి లోపల వెలుగును దైవం. 
బుద్ధితో దైవాన్ని ఎఱగడం అసాధ్యం. 
బుద్ధిని లోన చేర్చి చూచుట దైవానుభవం.

23. పలుకదు నేనని ఈ దేహం. 
నిద్రయందు నేను లేనని చెప్పం. 
'నేను' పుట్టాకే పుడుతుంది సకలం. 
'నేను' పుట్టుచోటును వెదకడం ఆత్మవిచారం.

24. 'నేను' అనదు ఈ జడశరీరం. 
పుట్టనే పుట్టదు సత్యస్వరూపజ్ఞానం. 
మధ్యన పుట్టును దేహపరిమాణంలో అహం.
అదియే బంధం, అహంకారం, సంసారం.

25. రూపం లేని ఆ అహంకార పిశాచం 
రూపాలతో పుట్టి ఆడును జీవన నాటకం.
నీవెవరివని అడిగిన చాలు తక్షణం మాయం.

26. సకలానికి ఆధారం అహం. 
అహం లేదనిన ఉండదు అఖిలం. 
కనుక అహమే అఖిలం. 
అహాన్ని వదలడమే సర్వపరిత్యాగం.

27. 'నేను' పుట్టక ముందున్న స్థితియే నా స్వరూపం. 
'నేను' పుట్టుచోటును వెదకితే అది లభ్యం.

28. నూతిలో బడిన వస్తువు గైగొనడానికి తప్పదు మునగడం. 
'నేను'ను తెలియడానికి తప్పదు వాక్ప్రాణ బంధనం.

29. నేనిది కాదు, నేనది అనుట సహాయం.
'నేను' ఎచట వెలుగునని వెదుకుటయే జ్ఞానవిచారం.

30. నేనెవ్వడను విచారణకు తలక్రిందలవును అహంకారరూపం. 
తోడనే నేను-నేను అనుచు తోచును అహంస్వరూపం.

31. జ్ఞాని అంటే తన్ను మ్రింగి యుప్పొంగిన ఆనంద స్వరూపం.ఆదిత్యయోగీ 
అన్యమెఱుగని అనంత స్వరూపం. 
వానికి లేదు ఇసుమంతైనా కర్తవ్యం. 
వాని స్థితి ఇది అని తలచడం అసాధ్యం.

32. అది నేను, ఇది కాదు అని తలంచడం మనో దౌర్బల్యం. 
తనను తానెఱిగి హృదయమందు నిలవడం పరమార్థం.

33. నన్ను నేనెఱుగను, నన్ను నేనెఱుగుదును అనుట హాస్యాస్పదం. 
తాను ఏకమగుట అందరికీ అనుభవసిద్ధం.

34. సదా అందరికీ స్వభావమై ఉంది ఆత్మస్వరూపం. 
హృదయమందది ఎఱిగి నిలుచుట మన కర్తవ్యం.
ఇది వదిలి ఇక ఏమి చేసినా అది మాయాదోషం.

35. సిద్ధులన్నీ స్వప్న సమానం. 
సిద్ధమై ఉన్న వస్తువును ఎఱగడమే మోక్షం.
సత్యవస్తునిష్ఠయే భ్రాంతి రహిత స్వరూపం.

36. నేనిది కాదు, నేనది అని తలంచుట అనవసరం. 
ఆ భావన కేవలం సహాయం. 
సదా మనం ఆత్మస్వరూపులం.

37. సాధనయందు ద్వైతం. 
సాధ్యమందే అద్వైతం. 
అనువారల వాదన అవాస్తవం. 
తాను సదా ఏకాత్మస్వరూపం.

38. మనము కర్మ కర్తలమనిన భోక్తలమూ కాగలం.
'కర్త' ఎవడో ఎఱిగినచో కర్మలు మూడూ మాయం.
ఇదియే నిత్య ముక్తిపదం.

39. 'బద్ధుడను నేను' అని ఉంటే బంధముక్తి చింత తథ్యం. 
బద్ధుడెవడని తన్ను తా చూడగా బంధముక్తి చింత మాయం.

40. ముక్తి మూడు విధముల సాధ్యం. రూపం-అరూపం-రూపారూపం. 
అని తలచే అహంకారరూపం నశించుటయే పరమపదం..*
.
 అప్రయత్న మార్గం
  
అనంతమైన జీవాన్ని మనం ఈ దేహం వఱకే పరిమితం చేశాం. 
ఇదే జీవసమాధి.

మనమందరం జీవాన్ని సమాధి చేసే ఉన్నాం.
మనమందరం జీవసమాధిలోనే ఉన్నాం.
మనమందరం "నడిచే సమాధులం".

దేహ పరిమితుల్ని దాటి జీవాన్ని దర్శించగలగాలి.
అప్పుడే తాను "నడిచే దేవుడు" అవుతాడు.

అనంతమైన జీవత్వమే దైవత్వం.
పరిమితమైన దైవత్వమే జీవత్వం. 

ఓ తల్లి తన అల్లరి పిల్లవాడి  వీపు మీద కొట్టిన దృశ్యాన్ని యూజీ చూసినప్పుడు తన వీపు మీద కూడా వాతలు పడ్డాయి...

"గుఱ్ఱంశ్యామా"ను కొరడాతో కొట్టినప్పుడు బాబా వీపు మీద వాతలు పడ్డాయి... 

అదీ జీవవ్యాపకత్వమంటే...

ఈ సంకుచిత్వాన్ని వొదిలి...
ఈ శరీరాన్ని దాటి... 
తాను అనంతంగా వ్యాపించడమే ఆధ్యాత్మిక లక్ష్యం.

మనం ఈ శరీరంలో ఇరుక్కుని ఉండడమే కాక
మహనీయులు అని చెప్పబడేవారిని కూడా 
వారి శరీరం వఱకే పరిమితం చేసి మాట్లాడుతాం...

అంతటి మహనీయుడికి(రమణునికి) క్యాన్సర్ ఎందుకు వచ్చింది? అని ప్రశ్నిస్తాం.

నేను ఈ శరీరం కాదు మొర్రో....అని భగవాన్ మొత్తుకుంటుంటే, పట్టించుకున్నవారెవరు!

భగవాన్ అంటారు-
నాకొక శరీరం ఉందని...
దానికి రెండు చేతులున్నాయని...
అందులో ఓ చేయికి క్యాన్సర్ ఉందని... 
మీరు చెబుతుంటే...ఆ దృష్టితో చూస్తే...
తోస్తోందే తప్ప అసలు నాకేమీ తెలియడం లేదు...అని.

నేనూ దేహమనే అంటాను...కాని ఈ దేహం నాలోనిది...
అంటారు భగవాన్. 
అందుకే వారు మహాత్ములు.

దేహంలో మాత్రమే నేనున్నాను...అనేది మన అనుభవం కాబట్టి
మనం జీవాత్ములం.

రమణుడు దేహానికి పరిమితమై ఎప్పుడూ ఉండలేదు.
మనం రమణుణ్ణి దేహాన్ని మించి ఎప్పుడూ చూడలేదు.

జీవితమే లేనివాని గుఱించి జీవిత చరిత్రలు వ్రాసుకుంటూ, చదువుకుంటూ ఉంటాం.

కాలాతీతుణ్ణి కాలంలో ఇరికించి, వారికి జయంతి, వర్ధంతులు చేస్తుంటాం.

తనువుకు లోపల మాత్రమే కాకుండా...
తనువుకు వెలుపల కూడా నేనున్నాను...
అని భావించుకోమంటారు గురువుగారు.
ఇదే వ్యాపకత్వమంటే.

మనం ఇల్లు వదిలే బయటకు రాలేకున్నాం... 
దేహన్ని వదిలి బయటకు ఎప్పటికి రాగలం?

ఈ గురుసాంగత్యము, ఆధ్యాత్మికము...అనేవి కూడా 
మన నిత్యవ్యవహారాలతో పాటు అవీ ఓ భాగంగానే ఉంటున్నాయే తప్ప, మనం పైకి చూపించినంత seriousness ఏమీ ఉండదు మనలో.

ప్రసాదం వండి పెడతాం...
మన జీవితాన్నే ప్రసాదంగా పెట్టం...

100% జీవితాన్ని సాధనకు, దేవునకు వినియోగించినప్పుడు మాత్రమే మనలో అద్భుతాన్ని చూడగలం...

భగవాన్-
ముందు దేహాత్మభావాన్ని విడిచి, 
తరువాత గృహాన్ని విడిచాడు.

బుద్ధుడు-
ముందు గృహాన్ని విడిచి,
తరువాత దేహాత్మభావాన్ని విడిచాడు.

బుద్ధుడిలా చాలామంది ఇంట్లో నుంచి బయటకు వచ్చారేగానీ
తన నుంచి బయటకు రాలేకపోయారు... 

ముందు తన నుంచి తాను బయట పడాలి...
ఇదే సారవంతమైన బోధ.

ఇంటి నుంటి బయట పడడం - సన్న్యాసం.
తన నుంచి తాను బయట పడడం - మోక్షసన్న్యాసం.ఆదిత్యయోగీ.

పచ్చి వేఱుచెనక్కాయను కదిపి చూస్తే ఏ శబ్ధమూ రాదు.
అదే ఎండిన తరువాత కదిపి చూస్తే గలగలమని శబ్ధం వస్తుంది.

అలా తనలోనే తాను విడిపడినట్లు 
తనకు అనుభవంలోకి రావడమే ఆత్మానుభవము. 

మొత్తం వ్యాసం యొక్క సారాంశాన్ని రెండు ముక్కల్లో చెప్పుకుందాం...

1. సర్వమూ వ్యాపించు.
లేదా
2. నీ నుంచి నీవు విడిపడు.

1. "సర్వమూ నేనే" అని భావిస్తూ ఉండు.
లేదా
2. "నేతి-నేతి" అని భావిస్తూ ఉండు.

ఇవి ప్రయత్నమార్గాలు.

కోడిపెట్ట స్పర్శ వలన గ్రుడ్డు పొదగబడి, పిగిలి పిల్ల బయటపడినట్లు....*

No comments:

Post a Comment