ఈ GST లో CGST, SGST అని రాష్ట్రాలకు కూడా వాటా ఉంది. కానీ దేశంలో చాలా రాష్ట్రాలు( ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు)ఆ GST ఆదాయాన్ని ఉద్యోగాల కల్పనకు,మౌలిక వసతుల కల్పన, పారిశ్రామికీకరణ, ఉపాధి అవకాశాల సృష్టికి, సంపద పెంచడానికి, ఉత్పాదకతను పెంచడానికి ,సాగు విస్తీర్ణం పెంచి తద్వారా అధిక ఆహారోత్పత్తి కి , కాకుండా ఉచిత సంక్షేమ పథకాల కు, అనుత్పాదక వ్యయానికి ఖర్చు పెడుతూ ఈ నిదులు కూడా చాలక మరలా WORLD BANK వంటి సంస్థల నుండి వేలకోట్ల అప్పులు తీసుకుంటూ వాటిని కూడా వృథా చేస్తున్నాయి. అందుకే RBI FRBM చట్టం పరిమితులు దాటిపోతున్నాయని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. ఆ దేశాలలో ఎక్కడా ఉచిత బస్సులు, ఉచిత కరెంట్, ఉచిత గ్యాస్ లు, ఉచిత యాత్ర లు, ఉచిత ఇళ్లు వంటి పథకాలు ఉన్నాయా?కానీ మన దేశంలో సగం రాష్ట్రాలలో ఇవే పథకాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఉచిత పథకాల కు ఆదాయం ఎక్కడ నుండి తెస్తారో చెప్పాలని మొట్టికాయ లేసినా పరిస్థితుల లో మార్పు లేదు. ఇవే పరిస్థితులు కొనసాగితే మన దేశంలో కూడా ఇథియోపియా, శ్రీలంక లాంటి దేశాలలో వచ్చినట్లు కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడం ఖాయం.
No comments:
Post a Comment