Wednesday, August 20, 2025

 గెలవటం అనేది తల్లితండ్రులు గురువులు నేర్పిస్తారు, ఓడిపోతే దైర్యంగా ఎలా బతకాలి అనేది సమాజం నేర్పిస్తుంది.. ఫస్ట్ ర్యాంక్ ఎలా రావాలి డబ్బులు ఎలా సంపాదించాలి ఇది కాదు జీవితం, ఎదురు దెబ్బ తగిలితే దైర్యం గా ఎలా నిలబడాలి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు ఎలా నడవాలి ఇదే నేర్పాలి.. మనము కోరుకున్న ర్యాంక్ రావచ్చు రాకపోవచ్చు, ఉహించిన స్థాయికి ఎదగలేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరి జీవితం లో కష్టం అనేది ఉంటుంది బాధలు అవమానాలు నమ్మిన వారే మోసం చేయండి నీది అనుకున్నది చై జారిపోవడం ఇలా ఎన్నో ఒడిదుడుకులే జీవితం ఆ అటుపోట్లు తట్టుకుని ముందుకు వెళ్తేనే జీవితం.. బతికినంత కాలం బతకాల్సిందే జీవితం చాలా విలువైనది ఎప్పటికప్పుడు కొత్త పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది.. కష్టాన్ని కూడా ఇష్టం గా స్వీకరిస్తే ప్రతి రోజు జీవితం కొత్తగానే ఉంటుంది...
అన్ని సౌకర్యాలు తో గొప్పగా బతకడం ఏముంది, జీవితం ఒక పోరాటం గా సాగె వారే గొప్ప వాళ్ళు... ఎన్నో బాధలతో మెసేజ్ చేస్తుంటారు కానీ అన్ని బాధాల్లో కూడా దైర్యం గా బతుకుతున్నారు మీ గురించి మీరు ఆలోచిస్తే మీకన్నా గొప్ప వాళ్ళు ఎవరుంటారు మీ జీవితం మీకు గొప్ప దాన్ని మీకు నచ్చినట్టు బతకండి... ఇంకొకరు మెచ్చుకోవడానికి బతక్కండి... దేవుడు కూడా అందరిని మెప్పించలేక శిలైపోయాడు..

No comments:

Post a Comment