పళ్ళు కాపాడుకోండి – గుండెపోటు దూరం పెట్టుకోండి! | Save Your Teeth – Keep Heart Attacks Away!
అంతవరకు మనతో మాట్లాడిన వ్యక్తి ఉన్నట్టుండి అకారణంగా చనిపోతే అందరూ షాక్ అవుతాం నిక్షేపం లాంటి మనిషి బర్రుమని చీరి కూడా ఎరగడు ఒంటి చేతితో పనులన్నీ చక్కపెట్టేసేవాడు అలాంటి రాయి లాంటి మనిషి ఒక్కసారిగా ఉన్నట్టుండి పోయాడంటే ఏం చెప్పాలి అని కూడా వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. పైకి ఏ కారణం కనిపించకుండానే మృత్యువు ఓడిలోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. మనం గమనించని ఆ తీవ్రమైన కారణం మూలంగా ఇప్పుడు ఈ క్షణంలో కూడా వేల మంది ఇబ్బంది పడుతున్నారు. మీరు గాని గమనిస్తున్నట్లయితే కొంతకాలంగా యువత అకస్మాత్తుగా స్పృహకోలుపై పడిపోతున్నారు. ఉన్నట్టుండి గుండెపోటు రావడమే అందుకు కారణమని పరిశోధనల్లో వెల్లడైంది. భారతీయుల్లో గుండెపోటు మరణాలు సాధారణం అయిపోయాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి ముగ్గురిలో ఒకరు గుండె నొప్పితో మరణిస్తున్నారు. వాళ్ళు కూడా 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్నవాళ్లే. యువతలం ఈ విధంగా గుండెపోటుతో మరణిస్తుండడం విచారించాల్సిన అంశం మాత్రమే కాదు ఆందోళన కలిగించే విషయం కూడా. సర్వసాధారణంగా గుండెపోటుకు కారణం కొలెస్ట్రాల్ పరిమాణం ఎక్కువ అవ్వడమే అని డాక్టర్లతో సహా అందరూ చెప్తూ ఉంటారు. అందుకనే బాధితుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచేలా వైద్యం చేస్తున్నారు. ఫలితంగా గుండె కండరాలు మూసుకుపోకుండా హృదయ స్పందన తగు రీతిగా ఉండేలా జాగ్రత్త వహిస్తున్నారు. మరి ఇప్పుడు కనుక్కున్న రహస్యం ఏంటి? అది ఏ విధంగా గుండెపోటుకు కారణం అవుతుంది అన్నది తెలుసుకుందాం. ఇది అందరికీ తెలియాల్సిన విషయం కూడా సమయం మించిపోకుండా చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాపాయాన్ని తప్పించుకోవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. పరీక్షార్థం 101 మంది హృద్రోగుల మూసుకుపోయిన నరాల నుంచి కణజాల రక్త నమూనాలను సేకరించారు. ఆ 101 మందిలో దాదాపు 78% మంది వాళ్ళ రక్తంలో ఒక రకం బ్యాక్టీరియా కనిపించింది. అదే నరాలు మూసుకుపోయేలా చేస్తుందని తెలుసుకున్నారు. అదే బ్యాక్టీరియా ఆ రోగుల దంతాల్లో కూడా ఉందని అక్కడ కూడా ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని వచ్చిన పరీక్షల ఫలితాలు విస్మయానికి గురి చేశాయి. నోటిలోని క్రిములు మూసుకుపోయిన రక్తనాళాల వద్ద కనిపించడం చిత్రంగానే తోచింది. ఆ 78% మందిలోనూ ఇదే పరిస్థితి. అంటే వాళ్ళు నూనె ఆహారం ఎక్కువగా తీసుకున్నారనో కొవ్వు అధికంగా ఉందనో ఆహారాన్ని తీసుకున్నారనో గతి తప్పిన జీవనశైలిని కలిగి ఉన్నారనో ఒత్తిడి కారణంగా హై కొలెస్ట్రాల్ పెరిగినందువల్ల గుండెపోటుకు గురైనారనో కాకుండా నోటిలోని దంతాల్లో పెరిగిన బ్యాక్టీరియా మూలంగానే ముప్పుకు గురయ్యారని మాత్రం చెప్పొచ్చు అంటున్నారు డాక్టర్లు. నోటిలోని క్రిమి దోషం గుండెకు చేరుకొని గుండెపోటుకు కారణం అయిందా ఇది నిజమా ఊహాగణమా ఇది లోతుగా పరిశీలించడం జరిగింది. నోరు, దంతాలు, పళ్ళు, నాలుక ప్రతిరోజు శుభ్రంగా తోమి కడుక్కోవాలి. అలా కాకుండా దంతాల్లో క్రిములు పెరుగుతాయి. తినే ఆహారంతో అవి కడుపులోకి చేరుతాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే కడుపులో గాఢమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. అది దాదాపుగా అన్ని రకాల బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. ఏ అనారోగ్యం దరిచేరనేయకుండా శుభ్రంగా పళ్ళు తోముకోవాలి. ఇదంతా సరే నోట్లోని బ్యాక్టీరియా గుండెలకు ఎలా కారణమైందని కదా మనం తెలుసుకోవాలి. ఆ విషయం కూడా మాయో క్లినిక్ అనే బాగా పేరున్న హెల్త్ కేర్ కంపెనీ ద్వారా వెల్లడయింది. సదరు కంపెనీ గుండె శస్త్ర చికిత్సలకు అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తుంది. అలావారి పరిశీలనలో ప్రతి 10 మంది హృద్రగుల్లో ఒకరు శస్త్ర చికిత్స సమయంలో మరణించడమో అనేకనేక అవలక్షణాలకు గురవడమో జరిగి శస్త్ర చికిత్స సంక్లిష్టంగా మారడం గుర్తించారు. అటువంటి వాళ్ళంతా హార్ట్ ఆపరేషన్ కు సరిగ్గా కొద్ది రోజుల ముందు డెంటల్ సర్జరీ చేయించుకున్నారని గమనించారు. దాదాపు అందరూ దంతాలు పీకించుకున్నారని తెలిసింది. ఇన్ఫెక్షన్ సోకిన దంతాలను తీయించేసుకోవడం సర్వసాధారణం. అయితే ఇది గుండెపోటుకు కారణమై తద్వారా ప్రాణం కోల్పోవడానికి దారి తీయడం అన్నది యాదృచ్చికం కాదని వైద్యుల్లో సందేహం కలిగింది. డెంటల్ ట్రీట్మెంట్ తర్వాత హార్ట్ ట్రీట్మెంట్ చేయించుకోవడం ప్రాణాలకు పోవడం 78% రోగుల్లోనూ వారి నోట్లోని బ్యాక్టీరియానే వారి గుండెల్లో కనిపించడం. ఈ విషయమై దంత వైద్యులకు గుండె వైద్యులకు మధ్య ఎలాంటి సమాచార మార్పిడి లేకపోవడంతో ఇప్పుడు ఇది పెద్ద సమస్య కూర్చుంది. దేనికైనా కార్యకారణం లేకుండా పోదు. దంతాల ఆరోగ్యానికి హృదయ ఆరోగ్యానికి లంకె ఉందని అనుమానించాక అందులోని వైజ్ఞానిక కారకాల వెలికితీతకు ప్రయత్నాలు జరిగాయి. ప్రజారోగ్యమే పరమావధిగా సైన్స్ అందుకు సహకరించడమే కదా మనకు కావాల్సిందే. కాబట్టి ముందుగా గుండె ఆరోగ్యం గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం. గుండెకు సంబంధించిన ప్రతి ఇబ్బంది గుండెపోటు కాదు గుండెపోటు పలు రకాలు గుండె చుట్టూ ఉండే రక్తనాళాలను హృదయ దమనులు కరోనరీ ఆర్టిస్ అంటారు. వ్యక్తి అలవాట్లను బట్టి అనగా పొగ త్రాగడం, మధుమేహం అధికంగా కొవ్వు పేరుకుపోవడం, అధిక ఒత్తిడికి గురుకావడం ఇలాంటి వాటి మూలంగా ఆ దమనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. కుదుము గట్టిన ఆ ప్రాంతం నుంచి రక్త ప్రసరణ జరక్క గుండెకు చాలినంత రక్తం చేరుకోదు. ఈ స్థితిని వైద్య పరిభాషలో ఎథరోస్క్లరోసిస్ అంటారు. గుండె కండరాలకు రక్తాన్ని ప్రాణవాయువును చేరవేసే దమనుల్లో అంటే కరోనరీ ఆర్టరీస్ లో ఎథోస్పోరోసిస్ ఏర్పడితే సదురు కండరాలు బలహీన పడతాయి. క్రమంగా వాటిలోని కణాలు చనిపోతాయి. గుండెలోని కణాలు చనిపోగానే సదురు రోగి గుండెలోని మరీ ముఖ్యమైన గుండె ఎడమగది లెఫ్ట్ వెంట్రికల్ గుండెపోటు వస్తుంది. వైద్య పరిభాషలో దీన్ని మయో కార్డియల్ ఇన్ఫెక్షన్ అంటారు. సమయానికి వైద్యం అందించి ఆ కదుము కట్టిన ప్రాంతాన్ని సరిచేస్తే అంటే బ్లాకేజ్ ను తొలగిస్తే రోగి ప్రాణాలు కాపాడొచ్చు. సమయానికి వైద్య సేవలు అందక ఎక్కువ మొత్తంలో గుండె కణాలు మరణిస్తే గనుక దాన్ని తిరిగి కొట్టుకునేలా చేయడం కుదరకపోవచ్చు. అనగా రక్తాన్ని పంపించే పనితనం బలహీనపడి గుండె శాశ్వతంగా ఆగిపోతుంది. దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇంత జరిగిన తర్వాత శరీరంలోని మిగతా అవయవాలకు రక్తం ఆక్సిజన్ అందవు. ఫలితంగా అక్కడ కణాలు కూడా వేగంగా నశిస్తూ ఉంటాయి. ఆ అవయవాలు పెద్ద చరుపు తిన్న అనుభూతికి అనగా స్ట్రోక్ కు లోనవుతాయి. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వంటివి కలగొచ్చు. కాబట్టి మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ను హార్ట్ ఎటాక్ అని అంటారు. ఇంతవరకు అర్థమైంది. గుండె పనితీరులోని ఇబ్బందులు తెలుస్తున్నాయి. మరి దంతాల్లోని క్రిములు చేసిన నష్టం ఏంటనేది తెలియాలంటే మరికొన్ని వివరాల్లోకి వెళ్ళాలి. మునుపు మనం 78% రోగులు గుండె కండరాల వద్ద వారి నోట్లోని బ్యాక్టీరియా కనిపించిందని చెప్పుకున్నాం. నోట్లో ఉండే బ్యాక్టీరియాలు మంచివి హానికరమైనవి ఉంటాయి. నోట్లోని లాలాజలం వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ దంతాలు పాడవ్వకుండా శరీరంలోకి చొరబడకుండా అడ్డుకుంటుంది. ఆరోగ్యవంతుడైన వ్యక్తి నోటిలో మంచి బ్యాక్టీరియా ఎక్కువ మోతాదులో ఉంటుంది. హానికారక బ్యాక్టీరియా తక్కువ మోతాదులో ఉంటుంది. కడుపులో ఉండే హైడ్రోక్లోరిక్ యసిడ్ లోపలికి చొరబడిన చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఫలితంగా ఆ బ్యాక్టీరియా మనిషి శరీరంలోని ప్రధాన అవయవాలైన కాలయం, గుండె, మెదడు, ఊపిరితిత్తులు, ఉదరం మూత్రపిండాలు, మూత్రాశయం, ప్రేగులు, క్లోమకం అంటే పాంక్రియాసిస్ లను ఏం చేయకుండా నశిస్తుంది. మరి నష్టం ఎలా జరుగుతుందా అంటే నోటి శుభ్రతను నిర్లక్ష్యం చేయడం ద్వారా అని చెప్తున్నారు. సరిగా దంత ధావనం చేయకపోవడం, తిన్నాక పళ్ళు శుభ్రం చేసుకోకపోవడం, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం మూలంగా మంచి చెడు బ్యాక్టీరియాల నిష్పత్తులు మారిపోతాయి. అప్పుడు దంతాలు క్రిములు జాస్తిగా చేరుతాయి. పిప్పి పళ్ళు తయారవుతాయి చిగుళ్ల సమస్యలు ఏర్పడతాయి. కనీసం వీటిని గమనించిన వెంటనే సరైన చర్యలు తీసుకోవాలి. అలా చేయకపోవడం మూలంగా బ్యాక్టీరియా ఇబ్బడి మొబ్బడిగా పెరిగి నోటి ఇన్ఫెక్షన్ చేస్తుంది. దంతాన్ని ఛేదించుకుని దంతాల చిగుర్ల గుండా నోటి రక్తనాళాల్లోకి చొరబడి లోపలికి వ్యాపిస్తుంది. అప్పుడు బాధితుడు దంత వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు పాడైన దంతాన్ని తొలగించడం జరుగుతుంది. అంటే అక్కడ ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీ ద్వారా సదరు బ్యాక్టీరియా నేరుగా రక్తనాళాల్లోకి చేరుకోగలుగుతుంది. అలా అది శరీర ప్రధాన అవయవాల జోలికి వెళ్ళగలుగుతుంది. మీకు ఈ పాటికి బాగా అర్థమయింది కదా మీరు మీ పళ్ళను గమనించండి. దంతాల మీద తెల్లని రక్షక పొర ఉంటుంది. దాన్ని ఎనామిల్ అంటారు. దాని క్రింది భాగాన్ని డెంటిన్ అంటారు. ఎనామిల్ పొర కాల్షియం ఫాస్ఫరస్ క్రిస్టల్ తో తయారవుతుంది. డెంటిల్ లో కొలేజోన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇక మనం తినే ఆహారంలో తీపి ఆహార పదార్థాలు మొదలైన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వాటిని మనం నోటిలోని బ్యాక్టీరియా గ్లైకోలైటిక్ పదార్థంతో పచనం చేసి లాక్టిక్ యాసిడ్ ని విడుదల చేస్తుంది. ఇదిగో ఈ లాక్టిక్ యాసిడ్ పరిమాణం మన నోటిలోని దంతాల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యం పదిలంగా ఉంచడాన్ని నిర్ణయిస్తుంది. అంటే నోట్లో బ్యాక్టీరియా గుండెను చేరుతున్న దారి ఇదన్నమాట. మన దంతాల్లోని హైడ్రాక్సీ అపెటైట్ కొలాజెల్లు నోటిలో తయారవుతున్న ఆమ్లాల వల్ల త్వరితంగా కరిగిపోతాయి. మన నోటిలో తీయని కార్బోహైడ్రేట్ల జోరు ఎక్కువై పళ్ళు పులిసే కొద్ది ఈ నష్టం అర్థంవుతుంది. అంటే తీయని శీతల పానీయాలు చాక్లెట్లు కేక్లు వంటి ఆహార పదార్థాలు స్వీకరించాక నోటి శుభ్రత పాటించకుండా ఉన్నామ అనుకోండి ఆ తీపిదనం నోట్లో బాగా పులిసి లాక్టిక్ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని మోతాదు పెరిగి పెరిగి నోట్లోని మంచి బ్యాక్టీరియా నశించి హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెంది నోటి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దంతాలు పుచ్చిపోతాయి క్యావిటీ అంటే పళ్ళల్లో రంద్రాలు ఏర్పడతాయి. పళ్ళ చిగుళ్లు దెబ్బ తింటాయి. అవి అలా పళ్ళ రక్తనాళాలనే నేరుగా ధ్వంసం చేస్తాయి. అంటే ఆ రక్తనాళాల ద్వారా బ్యాక్టీరియా గుండెను నిరాటంకంగా చేరుకుంటుంది. అందుకే హార్ట్ ఎటాక్ పేషెంట్స్ కి సర్జరీ చేస్తున్నప్పుడు డాక్టర్లు ఆ రోగికి డెంటల్ ఇన్ఫెక్షన్ కలిగించడానికి కారణమైన అతని నోటిలోని బ్యాక్టీరియా గుండె వద్ద కనిపిస్తుంది. కనిపించింది కనుక ఇక్కడ చేరిందని తెలుసుకున్నారు. కానీ అది ఎప్పటి నుంచో అక్కడికి చేరుతూ హానికారక రసాయనాలను విడుదల చేస్తుంది. ఫలితంగా సదరు బాధితుని రోగ నిరోధక శక్తి బలహీనమై గంధరగోళానికి గురై అతని కణజాలాన్ని నాశనం చేస్తుంది. ఫలితంగా వ్యక్తి శరీర రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి రక్త ప్రసరణ ఆక్సిజన్ సల్ఫరా నిలిచిపోతుంటాయి. నోటిలోని బాక్టీరియా రక్తనాళాలను చేరుకున్నప్పుడు శరీరంలోని నిరోధక శక్తి మేల్కొని దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది. అయితే టానెరలా ఫాస్టియా, పోర్పైరోమనస్, జింజువాలిస్ వంటి నోటి బ్యాక్టీరియాలు రక్త ప్రవాహంలో చేరినప్పుడు హీట్ షాక్ ప్రోటీన్హెచ్ఎస్పి 60 ని విడుదల చేస్తాయి. క్యూమన్ హీట్ షాక్ ప్రోటీన్ను దాదాపుగా పోలి ఉండే ఇది దాంతో కలిసిపోవడం మూలంగానే శరీరంలోని తెల్ల రక్త కణాలు అంటే యాంటీబాడీస్ మనిషికి మేలు చేసే బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి. మనిషి శరీరానికి అంతర్గతంగా బాహ్యంగా ఒత్తిడి కలిగినప్పుడు శరీరానికి కలిగే నష్టాన్ని తగ్గించేందుకు విడుదలయ్యే హీట్ షాక్ ప్రోటీన్ మనిషికి మేలే చేస్తుంది. అయితేహెచ్ఎస్పి60 మానవ నిరోధక శక్తిని ఏమార్చి అతని మీదనే దాడి చేసేలా యాంటీబాడీస్ ను భ్రాంతికి గురి చేస్తుంది. గుండె రక్తనాళాలకు సంబంధించిన కార్డియోవాస్కులర్ ప్రాంతంలో మరీ ముఖ్యంగా రోగి శరీరంలో సదరు హ్యూమ హీట్, షాక్ ప్రోటీన్ బాగు చేసే పనిలో ఉన్నప్పుడు ఆ మంచి కణాలన్నీ అతని శరీరంలోని యాంటీబాడీస్ మూలంగానే మరణిస్తాయి. ఆరోగ్య కణజాలం సైతం నాశనం కావడమే ఇందులోని బాధాకర అంశం. అంటే అవి హృదయ నాళాల్లోకి చేరి అక్కడ చెడు చేస్తాయి. కాబట్టి ఇప్పుడు విషయం బహిర్గతం అయింది కనుక గుండె సంబంధ రోగాల విషయంలో వారి దంతాలని పరిశీలించడం మాత్రమే కాకుండా వారి శరీర అవయవాల అన్నిటిని క్షుణణంగా పరిశీలించాలి. దంతాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సదరు వ్యక్తులకు తెలియజేయాలి. రూట్ కెనాల్ దంతాల తొలగింపు వంటి చికిత్సల మూలంగా బాధితుల హృదయాల ఆరోగ్యం దెబ్బ తినకుండా జాగ్రత్త తీసుకోవాలి. చివరి వరకు లాకొచ్చక మేల్కోవడం కాకుండా గుండె సంబంధ ఇబ్బందుల్ని ప్రాథమిక దశలో కనిపెట్టినప్పుడే దంత ఆరోగ్యం విషయం కూడా పరీక్షించాలి. డాక్టర్లు సరే సలహా ఇస్తారు. పాటించాల్సింది మనమే కదా అది మన ఆరోగ్య సమస్య కాదా జాగ్రత్తలు తెలియక అలసత్వంగా ఉన్నాం సరే డాక్టర్లు జాగ్రత్తలు చెప్పిన తర్వాత అయినా చైతన్యం తెచ్చుకొని బుద్ధిగా మసులుకోవాలి కదా అందుకే పదే పదే చెప్పినట్టు అనిపించిన ప్రజారోగ్యం దేశానికి కీలకమైన అంశం అని గుర్తించాలి. అవును ఆరోగ్యకరమైన సమాజం ఉన్నప్పుడే దేశాభివృద్ధి కూడా ముందుకు వెళ్తుంది. అంతేగాన ఈసురోమని మనుషులు ఉంటే దేశమేగతి బాగుండునో అన్నారు మహాకవి గురజాడ వాళ్లే దేశంఅంటే మట్టి కాదోయ్ దేశంఅంటే మనుషులో అన్నారు. మరి మన మనుషులం ఆరోగ్యంతో ఉంటేనే కదా దేశం ఆరోగ్య భారతం అని పిలవబడుతుంది. అవునా కనుక విజ్ఞానాన్ని త్రోసి పుచ్చకుండా సైన్స్ ఈస్ ఏ వే ఆఫ్ లైఫ్ అని భావిస్తూ అది తెలియజేసే విషయాల్ని చేసే హెచ్చరికల్ని అర్థం చేసుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం నినాదాలు చేయడంతో సరిపుచ్చుకోకుండా ఆచరించి ఆరోగ్యాలను కాపాడుకోండి. నిజానికి మనలో చాలా మంది నోటి శుభ్రతను పెద్దగా పట్టించుకోవడం లేదు. చాలా కొద్దిమంది మాత్రమే తమ పిల్లలకు సరిగ్గా బ్రష్ చేయడం నేర్పిస్తున్నారు. ఏం తిన్నా ఏం తాగినా నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవాలని మనకు తెలిసినా మనం పట్టించుకోం. మనమే శ్రద్ధ పెట్టకపోతే పిల్లలకు ఏం చెప్తాం వేరే చెప్పనక్కర్లేదు కదా జంక్ ఫుడ్ జోలికి పోవద్దని చెప్పాలి అనారోగ్యకరమైన పరిస్థితుల్లో వండిన ఆహార పదార్థాలను తినొద్దని చెప్పాలి. అలాగే వేళకాని వేళ తినడాన్ని కూడా నిషేధించాలి. తినే ఆహారం సంపూర్ణంగా నమిలి తినాలి. నోరు వాసన వేస్తున్నప్పుడు గోరువేచ్చన్న నీటితో ఉప్పు కలిపి పుక్కిలించి ఉయ్యాలి. వీలైనప్పుడు వేపపుల్లతో దంతాలను శుద్ధి చేసుకోవాలి. ఇలా సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే చాలు కదా సూపర్ మ్యాన్ అయిపోవడానికి దంతాలపై మచ్చలు ఎగుడు దిగుళ్లు కనిపిస్తే బ్యాక్టీరియా దాడికి గురయ్యామనే విషయాన్ని గ్రహించాలి. స్ట్రైపోకోకస్ మ్యూటన్స్ అనే సదరు బ్యాక్టీరియా ఆమ్లజలాన్ని అంటే యసిడ్ ని కూడా తట్టుకొని హాయిగా జీవిస్తుంది. దంతాలపై పాచిలాగా పేర్కొనే గ్లూకోస్ పాలిమర్ మ్యూటన్స్ ని తయారు చేస్తుంది. చిరకాలం దంతాల్లో జీవిస్తుంది. మనం అది గ్రహించి తీపి తినడం ఆపేసిన కూడా అది మ్యూటన్స్ ని ఆహారంగా తీసుకుంటూ బ్రతికేస్తుంది. మెల్లగా తన సంతానాన్ని వృద్ధి చేసుకొని దంతాల్లో స్వరంగాన్ని తవ్వుకొని రక్తనాళాలను చేరుకుంటుంది. ఆ దారిలో వేరే తరహ హానికర బ్యాక్టీరియాలను సృష్టించి మనపై దాడి చేస్తుంది. సాఫ్ట్ డ్రింక్స్ పేరుతో అమ్మే పానీయాల్లో కార్బన్ డైాక్సైడ్, షుగర్ టేస్టీ కెమికల్స్ తప్ప ఇసుమంతా శక్తి వనరు కూడా ఉండదని గ్రహించలేరా అవి బ్యాక్టీరియాని మరింతగా పెంచి పోషిస్తాయి. పుల్లని పదార్థాలు తీయని పదార్థాలు పిండి పదార్థాలు అరుదుగా తిన్నా కూడా నోటి శుభ్రత పాటించి తీరాలి. అసలు వేళ కాని వేళలో తినడమే తప్పు. మామూలుగా కూడా వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి మార్కెట్ లో ఉన్న రకరకాల సాచురేటెడ్ మోనో ఆన్సాచురేటెడ్ పాలియాన్ సాచురేటెడ్ వంట నూనెలు అన్ని వట్టి వ్యాపార జిమ్మికులు తప్ప భారతీయుల ఆరోగ్యానికి మేలు కానే కాదు. మనిషి నోటి లాలాజలంలో పిహెచ్ విలువ 6.7 7 నుంచి 7 మధ్య ఉంటుంది. పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ తినే ఆహారంలో ఉండే యసిడ్ వాల్యూని అది తెలియజేస్తుంది. పిహెచ్ విలువ ఎంత తక్కువ ఉంటే అందులో అంత ఎక్కువ యసిడ్ ఉంటుంది. ఎంత తిన్నా ఏం తిన్నా కూడా మన నోటి పిహెచ్ విలువ 6.3 కంటే తగ్గకూడదనేది వైద్యుల సలహ. అలాగే తేలిగ్గా అయిపోతుందని జంక్ ఫుడ్ చక్కెరలు అధికంగా ఉండే శీతల పానీయాలు తీసుకుంటే ఇలాంటి అలవాట్లు ఉంటే మాత్రం నోటిలో బ్యాక్టీరియా పెరగడానికి అన్ని రకాల వసతులు మీరే కల్పించినట్టు డబ్బులుఇచ్చి మరి ఏం తినాలి ఏం తినాలంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండే ఓట్స్, బ్రోకలీ, జొన్నలు, రాగులు, గోధుమలు వంటి రకరకాల పప్పు దినుసులు, ధాన్యాలు తినాలి. గట్టి ఆహారం తీసుకోవడం మూలంగా నమిలే సమయం పెరుగుతుంది. ఫలితంగా నోట్లో ఎక్కువ లాలాజలం ఉత్పత్తయి ఆమ్లత్వాన్ని తటస్థం చేస్తుంది. బాగా నమిలి తినడం మూలంగా బ్యాక్టీరియా 80% నశించి స్ట్రెప్టోకోకస్ మ్యూటస్ బ్యాక్టీరియా కనిష్ట స్థాయికి పడిపోతుంది. మంచి రకం చూయింగంను నమలడం ద్వారా దంత పుష్టికి లాలాజనం పెరగడానికి తీపి తిన్న అనుభూతిని సంతృప్తి పరచడానికి తద్వారా బ్యాక్టీరియా వృద్ధిని నిలువరించడానికి దోహదం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇక టూత్ పేస్ట్ లో 5 శాతం ఫ్లోరైడ్ ఉండేలా చూసుకొని ఎయించుకోవాలి. ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ బ్యాక్టీరియా వృద్ధిని గణనీయంగా తగ్గిస్తుంది. ఖనిజాల స్థాయిని పెంపుచేస్తుంది కనుక దంతాల్లో రంద్రాలు ఏర్పడిన దంతాలపై ఎనామిల్లు పోయినా వాటిని తిరిగి తీసుకొస్తుంది. ఇవన్నీ మాత్రమే కాక మన పెద్దలు పాటించిన దంత ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అనుసరించడానికి ఏమాత్రం వెనకాడనక్కర్లేదు. అవేంటో ఇక్కడ మనం మిత్రులతో పంచుకోండి. అంటే మీ తాత ముత్తాతలు దేనితో పళ్ళు తోమేవారో కామెంట్ చేయండి. దంతాల ఆరోగ్యం గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుందని తెలిసింది కనుకనే ఇంత విస్తృతంగా మీకు నోటి శుభ్రత గురించి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు హాయిగా ఉంటేనే మాకు ఆనందంగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment