Wednesday, August 20, 2025

 [8/18, 23:42] +91 94918 93164: *అవతార్ మెహర్ బాబా - 54*
🪷

రచన: బి. రామకృష్ణయ్య


*మిర్టిల్ బీచ్ కేంద్రం - అమెరికా*

1941వ సంవత్సరంలోనే బాబా తన ప్రేమికులైన ఎలిజబెత్ పాటర్సన్, నొరీనా లకు అమెరికాలో తన పనికోసం కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాన్ని వెదకమని ఆదేశించారు. ప్రశాంతమైన సమతుల్యమైన వాతావరణం, ప్రకృతి రమణీయత, మంచినీటి సరస్సులు కలిగి సముద్రతీరాన ఉన్న ఎవ్వరూ వాడని 500 ఎకరాల భూమిని ఎంచుకోవాలని బాబా చెప్పారు. ఆ భూమిని తన పని కోసం హృదయపూర్వకంగా దాని యజమాని ఇవ్వాలని బాబా సూచించారు. ఆ స్థలంలో అవసరమైతే వ్యవసాయం చేసి అక్కడ ఉండేవారికి కావలసిన ఆహారం పండించు కునే సానుకూలత ఉండాలి. బాబా ఆదేశానుసారం అమెరికాలో 500 ఎకరాల స్థలంలో బాబా సెంటరును ఏర్పాటు చేయ డానికి ఎలిజబెత్ పాటర్సన్ నొరీనా, కిట్టి డేవి తదితరులు ఎంతో ప్రయత్నించారు. ఆ స్థలం ఎవ్వరూ వాడనిదై ఉండాలి. సముద్ర తీరాన ఉండాలి. ప్రకృతి దృశ్యాలు రమణీయంగా ఉండాలి. అలా అని షరతులకు సరిపడే అలాంటి స్థలం దొరకడం కష్టసాధ్యమైన పనే కదా! ఆఖరికి ఎలిజబెత్ కి తన తండ్రికి చెందిన స్థలం సౌత్ కారోలీనాలో మిర్టిల్ బీచ్ లో ఉన్నది  
కదా అనే విషయం స్ఫురణకు రావడంతో ఆ స్థలాన్ని బాబా కేంద్రం కొరకు ఇవ్వవల సిందిగా తన తండ్రిని అర్థించింది. బాబా
ఇచ్ఛ ఉంటే ఏ ఆటంకము లేకుండా అన్ని పనులు సానుకూలిస్తాయి గదా! ఎలిజబెత్ తండ్రి మిస్టర్ సిమియా చాపిన్ వెంటనే ఒప్పుకున్నాడు. ఆ స్థలాన్ని తన కూతురికి ఇచ్చాడు. ఆమె దానిని బాబా కేంద్రానికి ఇచ్చింది. వారిరువురూ హృదయపూర్వకం గా ఆ స్థలాన్ని బాబా కోసం ఇచ్చారు. సర్వజ్ఞుడైన బాబా ఆ స్థలంలో తన కేంద్రం రాబోతుందని తెలిసే దానికి సరిపోయే అన్ని షరతులు విధించారు కాబోలు. ఆ స్థలంలోనే నేడు మిర్టిల్ బీచ్ కేంద్రంగా పిలువబడుతున్న బాబా సెంటర్ అతి మనోహరంగా నిర్మించబడింది. దట్టమైన అడవులతో మంచినీటి సరస్సులతో సముద్రతీరాన వెలసిన మిర్టిల్ బీచ్ కేంద్ర స్థలం ప్రకృతి సౌందర్యానికి, ప్రశాంత వాతావరణానికి నిలయమై దర్శనార్థుల హృదయాలను దోచుకునే ఆహ్లాదకరమైన ప్రదేశంగా పేరు పొందింది. దానిలో బాబాకు ప్రత్యేకంగా ఒక ఇల్లు నిర్మించారు. దీనిని బాబా ఇల్లు అంటారు. ఆ కేంద్రంలో బస చేసే ప్రేమికుల నివాసానికి సమావేశాలకు కావలసిన ఇళ్ళు కూడా నిర్మించారు. ఈ కేంద్రం నిర్మించబడిన తర్వాత బాబా అమెరికాకు వెళ్ళలేదు. ఆయన రాక కోసం అమెరికా లోని బాబా ప్రేమికులు ఎన్నాళ్ళు గానో వేచి చూశారు. ఎట్టకేలకు తన నవజీవన కార్యక్రమం ముగియగానే 1952 వ సంవత్సరంలో అమెరికాకు రాగలనని అమెరికాలోని బాబా ప్రేమికులకి ఎలిజబెత్ మొదలగు వారికి బాబా తెలియజేశారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
18.04.1952 తేదీన బొంబాయిలో బయలుదేరి బాబా న్యూయార్క్ లో 20.04.1952 నాడు విమానం దిగి ఆ రాత్రే  సౌత్ కారోలీనాలోని ఫ్లారెన్స్ కి రైలులో వెళ్ళారు. అక్కడినుండి తిన్నగా మిర్టిల్ బీచ్ కి వెళ్ళారు. 21.04.1952 తేదీన 
మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాబా మిర్టిల్ బీచ్ కి చేరుకున్నారు. మిర్టిల్ బీచ్ లో ఇల్లును, ఇతర కట్టడాలను ప్రేమతో కట్టించి సుందరంగా తీర్చిదిద్దినందులకు బాబా చాలా సంతోషించారు. 'తన కోసం నిర్మించిన గృహాలన్నిటిలోకి, తాను సందర్శించిన వాటిలో దీనిని తాను అమితంగా ప్రేమిస్తున్నానని ఈ స్థలాన్ని విడిచి వెళ్ళనని బాబా చెప్పారు. యుగాలకు పూర్వం ఈ స్థాలంలో ఉండి సంచరించానని సముద్రం, సరస్సులు, వనాలు, నిండియున్న ఈ స్థలం విశిష్టమైన వాతావరణంతో కూడియున్నదని అన్నిటి కంటే మిన్నగా ఈ స్థలం ఇచ్చిన వారి హృదయ పూర్వకమైన ప్రేమకు సంతసించి ఈ కానుకను స్వీకరించానని బాబా చెప్పారు. మిర్టిల్ బీచ్ సెంటర్ ki విచ్చేసిన ప్రేమికులకు పాతవారికి, క్రొత్తవారికి బాబా వ్యక్తిగతంగాను, సామూహికంగాను దర్శన మిచ్చారు. 17.04.1952 తేదీన సార్వత్రిక దినంగా ఏర్పాటు చేసారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 1500 మంది వచ్చి బాబాను దర్శించుకున్నారు. దర్శనార్థు లంతా బాబాను చూచి ఆయన చేతిని స్పృశించి వెళ్ళిపోవాలి. బాబాకు కుడి వైపున కూర్చున్న ఎలిజబెత్ "ఇంత త్వరగా వెళ్ళేవారికి మీరెలా సహాయం చేస్తారు బాబా!" అని అడిగింది. 

"ఇంకా కొంచెంసేపు ఆగితే వారి మనస్సు పనిచేయడం ప్రారంభిస్తుంది. నేను వారి హృదయాలను స్పృశించాలని కోరుతున్నాను" అన్నారు బాబా. హృదయం కంటె వేగంగా పనిచేసే మనస్సును స్థంభింపజేసి హృదయాన్ని త్వరితంగా పని చేసేలా చేయడమే బాబా పని. ఆ రోజు జాన్ బాస్ అనునతడు కూడ కూర్చుని యున్నాడు. 'నా జీవితంలో ఇది గొప్ప అనుభవం. లైబ్రరీలోని పుస్తకాలన్నీ చదివితే వచ్చే జ్ఞానం కంటె బాబాను దర్శించేవారిని చూస్తూ బాబా సమక్షంలో కూర్చొనడం ద్వారా నేను ఎక్కువగా నేర్చుకున్నాను' అన్నాడు జాన్ బాస్. ఆ రోజు ప్రవాహంలా బాబా దర్శనానికై వచ్చిన స్త్రీలు, పురుషులు, పిల్లలు బాబా ముందు నుండి ఆయన దర్శనం చేసుకొని వెళ్ళారు. బాబా కన్నుల నుండి వెలువడే దయ, ప్రేమలతో చలించిన కొందరు  బాబా దర్శనార్థులు అశ్రుధారలతో నిండిన చెక్కిళ్ళతో విలపిస్తూ వెళ్ళిపోయారు.

*కారు ప్రమాదం*

మిర్టిల్ బీచ్ సెంటర్లో 20.05.1952వ తేదీ వరకు గడిపి 21.05.1952వ రోజున రెండు కార్లలో కాలిఫోర్నియాకు బయలు దేరారు. బాబా కారును ఎలిజబెత్  పాటర్సన్ నడిపింది. ముందు సీటులో ఎలిజబెత్ ప్రక్కన బాబా కూర్చున్నారు.  వెనుక సీటులో మెహెరా, మణి, మెహెరూ ముగ్గురు స్త్రీమండలి వారు కూర్చున్నారు. రెండవ కారు సరోష్ నడిపాడు. ఆ కారులో కిట్టీడేవి, రానో, డా. గోహెర్, డెలియా కూర్చున్నారు. బయలుదేరే ముందు బాబా ఎలిజబెత్ ని కారు ఇన్సూరెన్స్ పాలసీ తెచ్చి కారులో పెట్టుకొమ్మని చెప్పారు. ఆమె అలాగే చేసింది. కాని బాబా ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకడిగారో ఆమెకు అర్థం కాలేదు.

1932వ సంవత్సరంలో అమెరికాకు బాబా వచ్చినప్పుడు మే నెల 24వ తేదీన గులాబీ పువ్వునిచ్చి ఆ తేదీని గుర్తుపెట్టుకో వలసిందని ఎలిజబెత్ కి చెప్పారు. 20 సంవత్సరాల ముందే బాబా 24.05.1952 నాడు జరుగబోయే ప్రమాదాన్ని ఖచ్చితం గా సూచించారు. ఎలిజబెత్ తన బైబిల్లో ఆ పువ్వును భద్రపరిచి ఆ తేదీని రాసి పెట్టుకుంది. కాని కాలక్రమేణా మరచిపోయింది.

13.05.1952 రోజున మిర్టిల్ బీచ్ సెంటర్ లో బాబా చుట్టూ స్త్రీమండలి వారు, పాశ్చాత్య స్త్రీలు కూర్చుని ఉన్నారు. బాబా తన మనస్సులో 1 నుండి 22 వరకు గల అంకెలలో ఒక దానిని కోరుకున్నానని అది ఎవరైనా చెప్పండి చూద్దాం అని అడిగారు. అందరూ తలా ఒక అంకె చెప్పారు కానీ ఏదీ బాబా కోరుకున్న అంకె కాలేదు. ఆఖరున ఆడిల్ అనునామె ఆ సంఖ్య 11 అని చెప్పింది. ఔను అదే అంకె అని బాబా చెప్పారు. ఆ రోజు నుండి సరిగ్గా 11వ రోజునే ప్రమాదం సంభవించింది. ప్రయాణంలో బాబా అనుచరులందరికీ చూడవలసిన ప్రదేశాలన్నీ చూపిస్తూ వెళ్లారు. 

21.05.1952 రోజున నార్త్ కారోలీనాలోని కొలంబియాలోను, 22.05.1952 రోజున మర్చి అనే చోట, 23.05.1952 తేదీన రుబీ జలపాతం చూసి రాక్ సిటీలో బస చేసారు. 24.05.1952 తేదీన తిరిగి ప్రయాణం సాగించారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఆ రోజు బయలుదేరే ముందు బాబా అదోలా కనిపించారు. కొంచెంసేపు ముంగిట్లో నిశ్చలంగా నిలబడ్డారు. వెనకాలే రెండవ కారులో వచ్చే సరోష్ బృందానికి ఒక క్షణం కూడా తన కారు నుండి దూరంగా వెనకాలే ఉండిపోకూడదని హెచ్చరించారు. కారు బయలుదేరిన తర్వాత మార్గ మధ్యంలో రెండుసార్లు కారు ఆపి రోడ్డు ప్రక్కన పచార్లు చేసారు బాబా. కారు 64వ రహదారిలోవెళుతుంది. రాత్రి వర్షం కురిసిన కారణంగా రోడ్డు తడిసి ఉంది. కొండదారి. రోడ్డు విశాలంగా లేదు. ఎదురుగా ఒక కారు రాకూడని ప్రాంతంలో పక్కన వస్తుంటే ఎలిజబెత్ తన కారు వేగాన్ని తగ్గించింది. అయినా ఎదురుగా వచ్చే కారు వేగంగా వచ్చి బాబా కారును గుద్దుకుంది.

ఆ కారులో వచ్చే వ్యక్తి కొరియా యుద్ధంలో కాలు పోగొట్టుకున్న క్షతగాత్రుడు. ఆ కారు ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకొని ఆ రోజే మొదటిసారిగా నడుపుతున్నాడు. ఆయనతో ఇంకా ఇద్దరు కారులో ఉన్నారు. వారెవ్వరికీ గాయాలు తగలలేదు. బాబా క్రింద రోడ్డు పై పడిపోయారు. తలకు గాయమై రక్తం స్రవించసాగింది. బాబా ముంజేయి, కాలు ఎముకలు చిట్లిపోయాయి. మెహెరా మరియు మెహెరూ కూడా కారులో నుండి క్రిందపడ్డారు. వారికి కూడాగాయాలైనాయి. కారు నడుపుతున్న ఎలిజబెత్ చేతి ఎముకలు, ఛాతీలోని ఎముకలు చిట్లిపోయిన గాయాలతో స్టీరింగ్ పైననే పడిపోయింది. ఒక్క మణి (బాబా గారి చెల్లెలు) మాత్రం ఏ గాయాలు లేకుండా బయటపడింది. వెనకాల కారులో వస్తున్న సరోష్ బృందం వారు ప్రమాద సమయంలో తోడుగా లేకుండా వెనకనే ఉండిపోయారు. బాబా హెచ్చరిక చేసినా దారిలో 'కూల్ డ్రింక్స్' త్రాగడానికి ఆగిపోయారు. 

ఎదురుగా వచ్చిన ఒక కారు యజమాని 7 కి.మీ. దూరంలోగల ఓకహోమా లోని ప్రేగ్ ఆసుపత్రికి తన భార్యను ప్రసవానికి తీసుకొని వెళ్తున్నాడు. ఈ ప్రమాదాన్ని చూసి రెండు అంబులెన్ లను తెప్పించి గాయపడిన వారిని అంబులెన్స్ లలో ఎక్కించే సమయానికి సరోష్ బృందం వారు వచ్చే కారు ప్రమాద స్థలానికి చేరింది. ఆ దృశ్యాన్ని చూచి వారి పొరపాటుకు  కలిగిన ఆవేదన వర్ణించరానిది. బాబాకు, గాయపడిన వారికి ప్రేగ్ ఆసుపత్రిలో చికిత్స చేసారు. వారక్కడ 13 రోజులు ఉన్నారు. మెహెరాకు గాయాలు తగిలి నందుకు బాబా తన చింతను వ్యక్తం చేస్తూ దాని వల్ల తన బాధ తీవ్రమైందన్నారు. ఆసుపత్రి నుండి 1500 కి.మీ. దూరంలో గల మిర్టిల్ బీచ్ కి మళ్ళీ అంబులెన్స్ లో వెళ్ళారు. నెమ్మదిగా అందరూ కోలుకున్నారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
[8/19, 20:19] +91 94918 93164: *అవతార్ మెహర్ బాబా - 55*
🪷

రచన: బి. రామకృష్ణయ్య


*మిర్టిల్ బీచ్ కేంద్రం - అమెరికా*

“నేను ముందుగానే ఊహించి చెప్పిన ప్రమాదము నా భౌతికకాయాన్ని 
గాయపరచి అమెరికా నేలపైన రక్తం చిందేటట్టు చేసింది. నా తలకు, చేతికి, కాలుకు బాహ్యంగా తగిలిన గాయాలే గాక మానసిక బాధను కూడా కలుగజేసింది. దైవేచ్ఛ ప్రకారంగా అది అమెరికాలో జరుగవలసి ఉంది. నేను చెప్పినట్లుగానే జరిగింది".

కొందరు అమెరికావాసులు బాబా అవతారుడైతే ఆయన ఇలా అసహాయుడై ప్రమాదంలో ఎలా చిక్కుకున్నాడనే సందేహాన్ని వెలిబుచ్చారు. జీసస్ క్రీస్త్ కావాలని తానే శిలువ వేయించుకో లేదా! మానవాళి కోసం తన రక్తాన్ని చిందించడం దైవీ మానవుడైన అవతారునికి మామూలే కదా! ఆయన అనుసరించే విధానం మామూలు మానవుల మనస్సున కర్థం అవుతుందా?

బాబా అమెరికా నేలపై తన రక్తాన్ని చిందించడంలో ప్రాముఖ్యత కలదు. భారతదేశం తర్వాత బాబా ననుసరించే వారిలో ఎక్కువమంది అమెరికాలో ఎక్కువ ఉన్నారు. అమెరికాలో కేంద్రీకృత మైన శక్తినుపయోగించి నవమానవాళి ఆవిర్భవించడానికి బాబా చేసే పనిని తీసుకునివచ్చే మార్పుకు అమెరికా ఖండాన్ని ఎంచుకున్నారు. ఆ సందర్భంగా బాబా ఈ సందేశమిచ్చారు.

బాబా మిర్టిల్ బీచ్ నుండి 14.07.52న బయలుదేరి న్యూయార్క్ వెళ్ళి అక్కడ రెండు వారాలున్నారు. న్యూయార్క్ 18.07.52 నుండి 20.07.52 వరకు 3 రోజులు ఐ.వి.డ్యూస్ అపార్ట్మెంట్ లో బాబా దర్శన కార్యక్రమాలు జరిగాయి. ఎందరో బాబా దర్శనం చేసుకున్నారు. బాబా దర్శనం చేసుకొని ఆ గది నుండి బయటకు వచ్చే దర్శనార్థులలో అధిక సంఖ్యాకులు బాబా మృదు మధురమైన ప్రేమ స్పర్శతో కలిగిన ఆనందాతిశయంతో చెమ్మగిల్లిన అశ్రుపూరిత నయనాలతో కనిపించారు.

కారు ప్రమాదంలో కలిగిన గాయాల నొప్పులన్నీ మటుమాయమైనట్లుగా సూచిస్తున్నట్లు బాబా ముఖంలో వెల్లి విరిసిన ఆనందం, ప్రకాశం గోచరించాయి. డాన్ స్టీవెన్స్ ఈ సందర్భంగానే బాబాను మొదటిసారిగా దర్శనం చేసుకున్నాడు. బాబా సంజ్ఞలతో ముగ్ధుడై అంతరంగంలో బాబా దివ్యత్వం గురించిన గుర్తింపు కలిగి బాబా వద్దకు ఆకర్షింపబడ్డాడు. 20.07.52 నాడు జరిగిన సమావేశంలో ఐ.వీ. డ్యూస్ మరియు డాన్ స్టీవెన్లకు సూఫీయిజమ్ పునర్వ్యవస్థీకరణ గురించి సూచనలిచ్చి 'భగవద్వచనము' (గాడ్ స్పీక్స్) ఆంగ్లంలో ముద్రించే పనిని వారికప్పగించారు. 

25.07.52 రోజున గాబ్రియల్ పాస్కల్ అనే హాలీవుడ్ సినిమా ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా సాహచర్యంలో కలిగిన అనుభూతి వల్ల బాబా ఏది ఆజ్ఞాపిస్తే అది చేయుటకు తాను సిద్ధంగా ఉన్నానని అతడు చెప్పాడు.

బాబా న్యూయార్క్ నుండి లండన్ కి వెళ్ళారు. అక్కడ ఆరు రోజులున్నారు.
అక్కడి నుండి స్విట్జర్లాండ్, జెనీవాలకు వెళ్ళి దర్శనానికై తపించే ఆయా దేశాల  బాబా ప్రేమికులకు దర్శన భాగ్యం కలుగ జేసి ఆగష్టు 23వ తేదీన బొంబాయి చేరుకొని తక్షణమే మెహెరాబాదుకు తిరిగి వచ్చారు.
📖

*పశ్చాత్తాప ప్రార్థన*

మెహెరాబాద్ లో 07.11.52 నుండి 09.11.52 వరకు 3 రోజులు సహవాసం  ఏర్పాటు చేసారు. దాదాపు 300 మంది బాబా ప్రేమికులు ఈ సహవాసంలో పాల్గొన్నారు. ఈ సహవాసంలో అనగా 08.11.52వ తేదీన బాబా పశ్చాత్తాప ప్రార్థన ఆంగ్లంలో చెప్పారు. ఆ పశ్చాత్తాప ప్రార్ధన చదివే సమయంలో బాబా తాను స్వయంగా నిలబడి ఆ పశ్చాత్తాప ప్రార్థన లో పాల్గొన్నారు. అందరూ బాబాతోబాటు పశ్చాత్తాప ప్రార్థనలో పాల్గొన్నారు. తనకు సంబంధించిన వారందరి కోసం బాబా స్వయంగా పశ్చాత్తాప ప్రార్థనచేసారు. ఉర్దూ, మరాఠీ భాషలలోకనువదింపబడిన పశ్చాత్తాప ప్రార్థన సమాధులలోను, దర్గాల లోను చదివించబడింది. తరువాత ఈ పశ్చాత్తాప ప్రార్థన ప్రపంచంలోని పలుభాష లలోకి అనువదింపబడింది.

ఈ పశ్చాత్తాప ప్రార్థన యొక్క తెలుగు అనువాదం ఈ పుస్తకంలోని అనుబంధం లో ప్రచురింపబడింది. అనుదినం బాబా ప్రేమికులందరూ ఉదయం, సాయంత్రం 7 గంటలకు పర్వర్డిగార్ ప్రార్ధనతోబాటు ఈ పశ్చాత్తాప ప్రార్థన చేస్తారు.

నవజీవనం ప్రారంభించిన తర్వాత 1949వ సంవత్సరం నుండి అవకాశం లభించక బాబా దర్శనం కోసం తపించి పోయేవారికి అవకాశం కల్పిస్తూ బాబా 1952వ సంవత్సరం డిసెంబర్ మాసం నుండి 1953 జనవరి మాసం వరకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్, అమరావతి నాగపూర్, సావెనీర్ మొదలగు పట్టణాల లో గ్రామాల్లో పర్యటించి దర్శనాలిచ్చారు. బాబా వెళ్ళిన అన్నిచోట్లలో ప్రజా దర్శనాల కనుమతించారు. ప్రేమికులు, భక్తులు కాలి నడకన, ఎద్దుల బళ్ళలో, ఇతర వాహనాల లో ప్రయాణం చేసి బాబా వెళ్ళిన చోటల్లా తండోపతండాలుగా చేరి ఆయన దర్శనం చేసుకున్నారు. బాబా చాలా చోట్లకు వెళ్ళి దర్శనం ఇచ్చారు. అలాగే మస్తుల సాంగత్యం కూడా కొనసాగించారు. 

అమరావతిలో బాబా గౌరవార్థం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయగా బాబా ఇలా అన్నారు 'నేను భాగ్యవంతులలో కెల్లా భాగ్యవంతుడను. ఏకకాలంలో పేద వారిలో కెల్లా పేదవాడిని. నాకు బీదలతో, మస్తులతో, ప్రజలతో సాంగత్యం చేయడమంటే ఇష్టం'.

అమరావతిలో బాబా ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీలో రమణ మహర్షి పేరుతో నిర్మించిన ఒక హాలుకు ప్రారంభం చేసి ఆ హాలులో రమణ మహర్షి చిత్రపటాన్ని ఆవిష్కరించారు.
📖

బాబా 1952 డిసెంబర్ మరియు 1953 జనవరి మాసాల్లో చేసిన పర్యటనలలో
భాగంగా 1953లో ఆంధ్రదేశానికి వచ్చారు. నాగపూర్ వద్ద సావినీర్ లో బాబాను
మొదటిసారిగా కలుసుకున్న వారిలో వీర్ సింగ్ కల్చూరి ఒకరు. భావు కల్చూరిగా
పిలువబడే అతడే బాబా మండలిలో నొకడై నేడు అవతార్ మెహెర్ బాబా ట్రస్ట్
యొక్క ఛైర్మన్ గా ఉన్నారు. సమగ్రమైన బాబా చరిత్ర 'లార్డ్ మెహెర్' పేరుతో వెలువడే సంపుటాల రచయిత ఇతడే.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment