Sunday, August 17, 2025

 కాల చక్రభ్రమణంలో, జీవితమనే పుస్తకంలోని కొన్ని పేజీలు మూసుకుపోతాయి.

మనసులో ఎంత మమకారం ఉన్నా, ఆ పుటలను తిరిగి తెరవడం సాధ్యం కాదు..

గతాన్ని వెంబడించడం అనేది కాల చక్రాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నమే.

పోయినది అంటే అది నిలవనిది..కాలం మన ముందుకు నడిపిస్తూనే ఉంటుంది, వెనక్కి మళ్లీ తీసుకురాదు..

మన నుండి దూరమైనది — అది మనిషైనా కావచ్చు, బంధమైనా కావచ్చు, వస్తువైనా కావచ్చు — ఉండాల్సినదైతే తప్పకుండా ఉండేది.. 

లేకపోవడం వెనుక కాలం మర్మం దాగి ఉంటుంది..

అందుకే… పోయిన దాని కోసం మునిగిపోవడం కన్నా, మనతో మిగిలినదాన్ని కాపాడుకోవడం గొప్ప జీవన జ్ఞానం..

జీవితం అంటే కాల చక్రభ్రమణంలో ముందున్న పుటలను ప్రేమించడం, కొత్త అధ్యాయాలను స్వాగతించడం..

🌹🙏

No comments:

Post a Comment