🔔 *ధ్యాన యోగం* 🔔
ధ్యానం లో మనం ఏమి సాధిస్తాము...!!
*యథా దీపో నివాతస్థో*
*నేంగతే సోపమా స్మృతా|యోగినో యతచిత్తస్య*
*యుంజతో యోగమాత్మనః||*
🌿వాయు ప్రసారము లేని చోట, నిశ్చలము గా నుండు దీపము వలె, యోగి కి వశమై యున్న చిత్తము, పరమాత్మ ధ్యానము న, నిర్వికారము గా, నిశ్చలము గా నుండును.
ధ్యాన నిమగ్నుడైన వారి కి, నిశ్చల మనసు మరియు శాంతి చేరువ అవుతాయి.
మనసు నిశ్చలం పొందితే, ఇక కావాల్సింది ఏమి ఉంటుంది.
దేనికి చింత ఉండదు.
అది కావాలి,
ఇది కావాలి అన్న ధ్యాస,
ఏదో సాధించ లేదనే అసంతృప్తి ఉండవు
దేని గురించో
తెలియని పరుగు,
ఏదో కావాలి అన్న వెంపర్లాట,
ఇవన్నీ లేని స్థితి పొందుతాము.
అది సాధించిన నాడు,లోకం లో ఇక ఏది ముందుకు వచ్చిన, వద్దు అనిపిస్తుంది.
అదీ కాక, ఆ చిత్తం లో ఆ యోగి సాధించినది, పరమాత్మ ధ్యానాన్ని.
ఇక వేరే అశాశ్వత వస్తు ప్రాప్తి అవసరమే లేదు.
అలా సాధించ బడ్డ అనుభూతి నిశ్చలం గా, నిర్వికారం గా ఉంటుంది.
మన సాధన ని, మరో ఉన్నత శిఖరాలకి తీసుకుని వెళ్తాయి ఈ సాధనలు...
అలాగే ఇటువంటి నిర్వికల్ప స్థితిలో ..
సంపూర్ణ భగవద్ దయ వలన ... మనం సాధించలేనిది ఏది ఉండదు ...
🙏సర్వే జనా సుఖినోభవంతు🙏
https://youtu.be/F-9RgBbCjgw
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment