Sunday, August 17, 2025




 **  భవిష్యత్ చింతన  **

ఏమైనా జరగవచ్చు 
విధి విపరీతములో.. 
ఏదైనా చేయవచ్చు 
కాలము తన గమనంలో.. 

కనుకే రేపుకు రూపులేదు
బ్రతుకు నమ్మకము లేదు
రాత్రి గడిచిపోతుందన్న భరోసా లేదు 
వేకువ చూస్తామన్న విశ్వాసమూ లేదు 

మరెందుకు భవితపై 
మితిమీరి విచారము? 
రాబోవు రోజులకై 
మోతాదు మించి చింతన? 

చేదు గతాన్ని వదిలేద్దాం 
నడిచే కాలంలో నవ్వులు పూయిద్దాం 
దిగుళ్ళ భూతాన్ని తరిమేద్దాం 
వర్ధమానంలో ఆనందాన్ని ఆస్వాదిస్తాం.

No comments:

Post a Comment