Sunday, August 17, 2025

 *_నేటి మాట_*

*ఈ కలియుగములో 3రకాల భక్తులు ఉన్నారు  - వారి గుణగణాలు ఏమిటి??*
_మొదటి రకం భక్తులు ..._

నీటిలో ఉండే రాయి లాంటి వారు ( నీటిలో ఎంతకాలము న్నా, బయటకు తీసి పగలకొడితే తడి ఉండదు...)
వీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని భజనలలో పాల్గొన్నా, వీరి గుండెల్లో భక్తి అనే ఆర్ద్రత ఉండదు... పైగా ఏమి కోరికలు తీరడం లేదు, అంతా వేస్ట్ అని వారి ఉద్దేశం ...

_రెండవ రకం భక్తులు ..._

వీరు వస్త్రము వంటి వారు.l, నీటిలో తడుపు తే పూర్తిగా తడుస్తుంది...
ఎండలో వేస్తే పూర్తిగా ఆరి పోతుంది ... ( సత్సంగాలు, కోవెలలో భక్తి గురించి మాట్లాడి, బయటకు రాగానే లౌకిక విషయాలలో మునిగి పోతారు... 
పూజలలో ఆధ్యాత్మికతలో వున్నప్పుడు, వీరు చాలా చెబుతారు, చాలా అర్తమయినట్లే వుంటారు, అక్కడినుండి దూరం వెళ్ళాక, ఆ అదేముంది, అంతా చెబుతారు, అదేమైనా జరుగుతుందా, చెప్పుకోవడం మట్టుకు మాత్రమే అని అనుకుంటారు...

_మూడవ రకం భక్తులు ..._

వీరు కలకండవంటివారు, ( sweet ) ఒకసారి నీటిలో వేస్తే తిరిగి కలకండ రూపం రాదు...
వీరే నిజమైన భక్తులు...

ఒకసారి భగవంతునికి భక్తులు గా రూపుదిద్దుకున్న తరువాత ఆపై జీవితంలో భగవంతుడు లేని విషయం అంటూ ఉండదు...
ఎల్లప్పుడు 'నా వాడు' స్వామే నని  మనస్సు గట్టిగా నమ్ముతారు...

జీవితంలో వచ్చే చిల్లర కష్టాలకు, చిన్న , చితకా, సమస్యలకు బెదిరి పోరు వారి విశ్వాసము చెదిరిపోదు, ఏది జరిగినా అంతా నా మంచికే అని భావిస్తారు...
లాభం వచ్చినా, నష్టమొచ్చినా, అంతా ఆయన ప్రసాదమే కదా అనే భావంతో వుంటారు... 

*ఇందులో మన భక్తి - ఏ రకానికి చెందినదో - మనమే అర్థం చేసుకోవచ్చు!!!*

              *_🌺శుభమస్తు🌺_*
 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

No comments:

Post a Comment