దయచేసి ఈ మెసేజ్ ఓపికగా చదవండి...
మీరు వెచ్చించిన సమయం వృథా కాదు...
నాది హామీ...
------------🙏🙏🙏🙏------------
చలం గారు చెప్పినట్లు ""కామాన్ని టన్నుల కొద్ది వెదచల్లిన దేవుడు...
అమృతం కన్నా విలువైన ""ప్రేమ"" ను మాత్రం చాలా పొదుపుగా చెంచాలతో మాత్రమే అక్కడక్కడా కొద్ది మందికి మాత్రమే ఇచ్చాడు""
అటువంటి అదృష్టవంతులను మాత్రమే వరించే ఆ ప్రేమ ఒక స్త్రీ పట్ల కావచ్చు...
ప్రకృతి పట్ల కావచ్చు...
ఆ సర్వేశ్వరుని పట్ల కావచ్చు...
లేదా ఈ సరాసర యావత్తు సృష్టి పట్ల కావచ్చు...
ప్రేమ అనేది వేటి పట్ల ఉన్ననూ ఆ మనిషి...
ఆ హృదయం...
ఎంతటి అదృష్టవంతులో కదా...
అదే విషయాన్ని బాపు గారు చాలా సింపుల్ గా
""కూసింత ప్రేమఉన్న (కళా) హృదయం లేకపోతే మడిసికి గొడ్డుకీ తేడా లేదు..."" అన్నారు...
గుల్జార్ వ్రాసిన ఈ పాట...
""పవిత్ర సూక్తై తానెదురొస్తే.. తాయెత్తులా కట్టేసుకుంటా""
గుల్జార్
కలంతో కట్టిపడేసే పాట
“Chaiyya Chaiyya”–
నా కాలేజ్ రోజుల్లో దేశాన్నే ఊపేసిన పాట ఇది...
మెలోడీలంటే ప్రాణం పెట్టే నాకు Dilse అనగానే “Aye ajnabi” పాటే మనసులో మెదిలేది...
ఈ “ఛయ్యా ఛయ్యా” పాట అంతగా నచ్చేది కాదు...
ముందు నాకీ పాట షారుఖ్ ఖాన్, మలైకా అరోరా ఐటమ్ సాంగ్ గా పరిచయమైంది...
కొన్నాళ్ళ తర్వాత మణిరత్నం కదిలే ట్రెయిన్ మీద దీన్ని ఎంత బాగా పిక్చరైజ్ చేశాడో కదా అనిపించింది...
మరికొన్నాళ్ళకు రెహమాన్ బాగానే కంపోజ్ చేశాడు అనిపించింది...
పోను పోను సుఖ్విందర్, సప్నా అవస్థి హై పిచ్ గొంతుకలు నచ్చాయి...
కానీ ఈ పాట అంటే ప్రేమ మొదలైంది మాత్రం లిరిక్స్ అర్థం చేసుకోవడం మొదలుపెట్టాకే!!!
అన్నట్టూ ఈ పాట లిరిక్స్ రాసింది ఎవరో తెలుసు కదా?
గుల్జార్!!!
ఆగస్ట్ 18, గుల్జార్ పుట్టినరోజు!
చిన్నప్పటి నుంచి పాటల లిరిక్స్ డీకోడ్ చేయడమంటే మహా సరదా నాకు..
గుల్జార్ పాటైతే ఇక ఆ థ్రిల్లే వేరు...
అలా ఈ పాటలో ప్రతి పదానికి అర్థం తెలుసుకోవడం మొదలుపెట్టాను...
అలా తెలుసుకుంటూ ఎప్పుడీ పాటతో ప్రేమలో పడ్డానో తెలియలేదు...
అది గుల్జార్ వల్లే అని వేరే చెప్పాలా?
ఒకసారి ఈ పాటను గుల్జార్ ఎంత అందంగా...
ఉదాత్తంగా రాశారో చూడండి...
Jinke sar ho ishq ki chaaon Paaon ke neeche jannat hogi
ప్రేమ నీడన సాగిపోయేవాడికి స్వర్గమే పాదాక్రాంత మవుతుంది...
Chal chaiyya chaiyya chaiyya chaiyya
Sar ishq ki chaaon chal chaiyya chaiyya
Paaon jannat chale chal chaiyya chaiyya
Chal chaiyya chaiyya chaiyya chaiyya
ఆ ప్రేమ నీడలోకే నడిచిపోదాం...
ప్రేమ గొడుగు పడుతోంది – ఆ నీడలోకే నడుద్దాం...
పాదాలను స్వర్గం వైపు మళ్ళిద్దాం...
ప్రేమ నీడలోకే నడిచిపోదాం...
Woh yaar hai joh khushboo ki tarah
Jiski zubaan urdu ki tarah
Meri shaam raat, meri kainaat
Woh yaar mera sainya sainya
పూల పరిమళం లాంటిది నా ప్రేయసి...
ఉర్దూ భాష లాంటి కమ్మటి పలుకు తనది...
తనే నా మలి పొద్దు... రాతిరి...
తనే నా ప్రపంచం...
Gulposh kabhi itraaye kahin
Mehke toh nazar aa jaaye kahin
పూల మాటున హొయలొలికిస్తుంది...
పరిమళించినప్పుడు మాత్రం కంటబడుతుంది...
Taveez banake pehan oose
Aayat ki tarah mil jaaye kahin
పవిత్ర సూక్తిలాగా తను ఎదురొస్తే…
తాయెత్తులాగా కట్టేసుకుంటా...
Woh yaar hai jo imaan ki tarah
Mera nagma wohi mera kalma wohi
Mera nagma nagma mera kalma kalma
నా ప్రేయసే నా విశ్వాసం...
తనే నా గానం...
నా మంత్రం...
Yaar misaal-e-os chale
Paaon ke tale firdaus chale
Kabhi daal daal, kabhi paat paat
Main hawa pe dhoondhon uske nishaan
నా ప్రేయసి మంచు బిందువులా... తళుక్కుమంటుంది...
తన పాదాల కింద స్వర్గం కదలాడుతుంది...
కొమ్మ కొమ్మలో...
ఆకు ఆకులో...
గాలి తెరల్లో...
తన ఆనవాలు నే వెతుకుతూ ఉంటా...
Main uske roop ka shehdai
Woh dhoop chhanv sa harjai
Woh shokh hai rang badalta hai
Main rang roop ka saudai
తన రూపంటే పడి చస్తాను...
ఎండానీడల్లా కనుగప్పి తను పారిపోతుంది...
తనది రంగులు మార్చేసే చాంచల్యం...
నాకా రంగు...
రూపంటే వ్యామోహం...
జాగ్రత్తగా గమనిస్తే ఈ పాటలో లోతైన మర్మం దాగుంది...
చూడ్డానికి ప్రణయ గీతంలా అనిపించినా ఇది సూఫీ గీతం కూడా...
17వ శతాబ్దానికి చెందిన బాబా బుల్లే షా అనే పంజాబీ సూఫీ తత్వవేత్త రాసిన ‘థయ్య థయ్య’ పాట ఆధారంగా రహమాన్ చేసిన కంపోజిషన్ కి గుల్జార్ లిరిక్స్ రాశారు... ఇందులోని వేదన ప్రియురాలి కోసమే అన్నట్లు కనిపించినా... అంతర్యామికి... నిరంతర సత్యానికి... కూడా ఆ తపన... అన్వేషణ వర్తిస్తాయి...
సినిమా మొదలైన పది నిముషాల్లోపే ఈ పాట వస్తుంది...
మనీషా కొయిరాలా మెరుపులా మెరిసి మాయమైపోయిన తర్వాత షారుఖ్ ఖాన్ పాడుకునే పాట ఇది... ఆ అమ్మాయంటే అతనికి కలిగిన ఆత్మికమైన అనుభూతికి అద్దం పడుతుందీ పాట...
హిందూస్తానీలో రాసే గుల్జార్ ఈ పాటను స్వచ్ఛమైన ఉర్దూలో రాశారు...
ఇది సూఫీ ఆధారిత గీతం కావడం ఒక కారణమైతే సినిమా నేపథ్యం మరో కారణం కావచ్చు...
ఇలా సూఫీ తత్వాన్ని ఆత్మగా చేసుకున్న ఈ సూఫియానా గీతం అప్పట్లోననూ ఆ తర్వాతా మార్మోగుతూనే ఉంది...
అలా మార్మోగుతూనే ఉంది...
ఈ పాటను వినగలగడం ఒక సాధారణమైన అదృష్టం అయితే...
ఆ పాటలోని లోతైన భావనను అర్థం చేసుకోగలగడం...
మనస్సు నిండా నింపుకో గలగడం...
పూర్వ జన్మ సుకృతం...
అంతటి ప్రేమను కలిగిన హృదయం ఉండడం వేయి జన్మల పుణ్యఫలం...
Shanti Ishan...
www bhatakani.in
పూర్తిగా చదివిన మీకందరకూ మరొక్క సారి నా హృదయ పూర్వక నమస్కారములు....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sekarana
No comments:
Post a Comment