Sunday, August 17, 2025

ధర్మం చింతన

 *ధర్మం చింతన*

 రాజు విశ్వాసపాత్రుడైన ఒక గూఢచారిని పిలిచి,  *'ఈ బ్రాహ్మణుడు మహా త్యాగి, సదాచారి, స్వాభిమాని అయిన విద్వాంసుడు. నీవు అతని వెనుకనే వెళ్లి అతడు ఇంటిలో ఎలా వ్యవహరిస్తాడో, ఎలా మాట్లాడుతాడో తెలుసుకొని నాకు వెంటనే చెప్పు'* అని పంపించాడు. రాజాజ్ఞ పొందిన ఆగూఢచారి ఆతన్ని వెంబడించి వెళ్ళి ఆతని ప్రవర్తన, మాట్లాడే విధానాన్ని గమనిస్తూనే వున్నాడు.

🌺 ఇంటికి తిరిగివచ్చిన పండితుడు భార్య అడుగగానే రాజసభలో జరిగిన విషయం ఆద్యంతమూ వినిపించాడు. వినమ్రురాలైన భార్య, ప్రేమగా 'స్వామీ! రాజుగారన్న మాటలు ఉచితంగానే తోస్తున్నాయి. మీరు కోపగించుకోకుండా వుండాల్సింది' అంది. పండితుడు - (క్రోధావేశాన్ని అణుచుకుంటూ) ఓహో! నీవూ రాజుగార్నే సమర్థిస్తున్నావా?

 *భార్య* - నాథా! న్యాయసమ్మతమైన దాన్ని సమర్థించాలని మీరే అంటుంటారు కదా!

 *పండితుడు* - (ఇంకా ఉత్తేజితుడై తమాయించు కుంటూ) కానీ నాకు దాని రహస్యమే తెలియలేదట రాజుగారన్న ఈ మాటలు న్యాయమైనవేనా?

 *భార్య* - క్షమించండి. రాజుగారి మాటలు సమంజసమైనవే! ఏశ్లోకాన్నైనా వ్యాఖ్యానించటం సహజమైనదే! కానీ దాని యదార్థ గూఢార్థాన్ని (రహస్యాన్ని) తెలుసుకోవటం చాలా కష్టమైన పనేమరి!

 *పండితుడు* - ఎలా?

 *భార్య* - గ్రామఫోను మీద పెట్టిన రికార్డు దానిలో వున్న పాటనే పాడుతుంది కానీ, దాని భావమూ గూఢార్థమూ తెలిసికోగలుగుతుందా? ఇదీ అంతే?

 *పండితుడు* - అంటే నేను గ్రామఫోన్ లాంటి వాడిననా నీ వుద్దేశ్యం?

 *భార్య* - ఇతరులకు అందమైన ఉపదేశాలూ, ఆదేశాలు ఇచ్చే వారిలో ఆ గుణాలు కొరవడితే వాళ్ళకూ... గ్రామఫోను రికార్డుకూ భేదమేముంటుంది? రాజుగారు కోరిన మీదట మీరా శ్లోకాన్ని వ్యాఖ్యానించారు. కానీ ఆ శ్లోకంలో వున్న గుణాలన్నీ మీలో మూర్తీభవించి వున్నాయా?

 *పండితుడు* -ఎందుకు లేవు? అందులో ఏ గుణం నాలో లేదో చెప్పు?

 *భార్య* - మీరు శాంతంగా నా మాటలు ఆలకించండి. దయచేసి ఆ శ్లోకంలోని ప్రతిపదానికి మీరు చెప్పిన అర్థం మళ్ళీ ఒకసారి నాకు వినిపించండి. 

*'అనపేక్ష!'* అనగా భావం ఏమిటి?

 *పండితుడు* - ఎవనికి ఏ విధమైన కోరిక, స్పృహ, కామన వుండదో ఎవడు ఆప్తకాముడో, ఎవనికి ఏ విషయంలోనూ లెక్క వుండదో అట్టి వానిని 'అనపేక్షుడు' అంటారు.

 *భార్య* - మరి మీరు అలాంటి వారేనా?

 *పండితుడు* - ఏం? ఎందుకు కాదు? నాకే విధమైన కోరిక, స్పృహ, కామనలు లేవు. నీవు పోరితేనే నేను రాజు దగ్గరకు వెళ్ళింది. ఆయనెంత  అనునయవినయాలతో ప్రార్థించినా నేనేమీ స్వీకరించనే లేదు! 

 *భార్య* - ఔను. నిజమే! నేను కోరితేనే కదా నా మీద దయతో మరిక్కడికి వెళ్ళింది? సరే! 

 *'శుచి'* అంటే మీ అభిప్రాయం?

 *పండితుడు* - ఎవని అంతఃకరణం అత్యంత పవిత్రమో, ఎవని బాహ్యవ్యవహారము కూడా ఉద్వేగరహితమూ, పవిత్రమూ, న్యాయ యుక్తమూ అయివుంటుందో, ఎవని దర్శన, భాషణ, స్పర్శ, వార్తాలాపముల వలన జనులు పవిత్రులౌతారో... అతడే 'శుచి'యైనవాడు.

 *భార్య* - బాహ్యాభ్యంతరాలలో మీరింత శుచిగా (పవిత్రంగా) వున్నారా? మీ దర్శన, భాషణ, స్పర్శ, వార్తాలాపాలవలన మానవులు పవిత్రులైపోతారా? మీ అంతఃకరణంలో ఎలాంటి వికారమూ కలుగదా? మీ బాహ్య ప్రవర్తన ఉద్వేగరహితమూ, న్యాయయుక్తమూ, పవిత్రమూ అయినదేనా? ఒకవేళ అదే నిజమైతే మీ మనసులో ఈ క్రోధమూ, ఉద్వేగమూ ఎందుకు కలిగాయి? మరి రాజుగారితో అహంకారపూరితమైన వాక్యాలెందుకు పలికారు?

 *పండితుడు* - (కొంచెం ఇబ్బందిగా) ఔను మరి! ఈ గుణమే నాలో కొరవడింది.

 *భార్య* - ఔనూ..... 'దక్ష' శబ్దానికి ఏమని భావం చెప్పారు?

 *పండితుడు* - ఏ మహాకార్యనిమిత్తం ఈ మనుష్యశరీరం లభించిందో దానిని పొందటం ... అనగా భగవంతుని పొందటంలోనే మనుష్యుని యథార్థమైన దక్షత వున్నది. అట్టి తనకార్యాన్ని ఎవడు సఫలీకృతం చేసుకుంటాడో అతడే 'దక్షుడు' అనబడతాడు.

 *భార్య* - అయితే మీరు ఏ మహాకార్యనిమిత్తమై ఈ లోకంలోకి వచ్చారో దాన్ని పూర్తిచేశారా? మీరు పరమపదాన్ని పొందగలిగారా? లేకుంటే రాజుగారు అన్న మాటలు ఉచితమైనవే మరి!

 *పండితుడు* - నీ కథనం సత్యమే! నాలో ఈ గుణం కూడా లేదు! 

 *భార్య* - 'ఉదాసీన' పదానికి మీ అభిప్రాయం ఏమిటి?

 *పండితుడు* - ఎవడు సాక్ష్యాలిచ్చే సమయంలోను, న్యాయము లేక పంచాయితీలు తీర్చే సమయంలోనూ, కుటుంబము, మిత్రులు, బంధువులు అనే దృష్టితోగాని, రాగద్వేషలో భభయాదులకు వశపడి పక్షపాతియైగాని వ్యవహరించక సదా సర్వథా పక్షపాత రహితునిగా ఉంటాడో అట్టి వానినే 'ఉదాసీనుడు' అంటారు.

 *భార్య* - మరి మీరు పక్షపాతరహితులా? రాజుగారి సమక్షంలో మిమ్మల్ని మీరు సమర్థించుకోలేదా? రాజుగారు మీకు శ్లోకంలోని గూఢార్థం తెలియలేదు అన్నపుడు ఆ మాటని లెక్క పెట్టారా? లేకుంటే రాజుగారి కథనం ఉచితమైనదే కదా? చెప్పండి?

 *పండితుడు* - (సరళమూ అతి పవిత్రమూ అయిన హృదయంతో తనలోపాలను వినమ్రభావంతో స్వీకరిస్తూ) నీవు చెప్పింది అక్షరాలా సత్యమే! ఈ రోజు నీవు నాకళ్లు తెరిపించావు, పక్షపాతరహితుడవటం అనే గుణం నాలో లోపించింది.

ఎప్పుడైనా వాగ్వివాదసమయంలో నా పక్షం దుర్బలమైనదని ఎరిగి కూడా దురాగ్రహంతో నా పక్షాన్నెప్పుడూ వదలేవాణ్ణి కాదు! నన్నే సమర్థించుకునే నైజం నాది.

 *భార్య* - మంచిది. 'గతవ్యథ'కు మీరు చెప్పే ఆర్థమేమిటి?

 *పండితుడు* - ఎట్టి మహాదు:ఖమూ, దుఃఖహేతువూ ప్రాప్తించినప్పటికీ ఎవడు దుఃఖితుడు కాడో - అనగా ఎవని అంత:కరణములో ఎప్పుడూ : ఏరకమైన విషాదమూ, దు:ఖమూ, శోకమూ ఉండవో - అట్టివాడే 'గతవ్యథుడు' ఔతాడు. 

 *భార్య* - మీ చిత్తంలో ఎప్పుడూ వ్యథ అనేదే కలుగదా? ఒకవేళ కలుగకుంటే ... రాజుగారన్న మాటలకు, నేను సమర్థించిన దానికి మీలో ఇంత ఉద్వేగమూ, వ్యథ ఎందుకు కలగాలి?

 *పండితుడు* - నీవు చెప్పేది అక్షర సత్యమే! ఈ భావన నాలో అసలు లేనే లేదు.! నా మనసుకు వ్యతిరేకంగా ఏదైనా జరిగినపుడు ప్రతి మాటకు కేవలం వ్యథయేకాదు, భయమూ, ఉద్వేగమూ, ఈర్ష్య, శోకమూ మొదలైన వికారాలు నాలో కలగటం గమనించాను.

 *భార్య* - సరే! *'సర్వారంభపరిత్యాగి'* అంటే మీరేమి అర్థం చేసుకున్నారు?

 *పండితుడు* - ఎవడు సమస్త బాహ్యాభ్యంతర కర్మలను విడిచి కేవలం ప్రారబ్దం పైనే ఆధారపడి ఉంటాడో, ఎవడు తన స్వార్థసిద్ధికోసం ఏ కొద్ది కర్మను కూడా చేయకుండా వుంటాడో, ఎవడు తనంత తాను లభించిన దానితోనే సంతుష్టుడై వుంటాడో, ప్రారబ్దవశాన జరిగే క్రియలలో ఎవనికి కర్బత్వాభిమానం ఉండదో, అట్టి బాహ్యాభ్యంతర త్యాగినే 'సర్వారంభపరిత్యాగి' అంటారు.

 *భార్య* - ఇది బహు సుందరమైన వ్యాఖ్యానం! కానీ మీరొక్క విషయం సెలవీయండి. మీరు బాహ్యాభ్యంతరకర్మలను త్యాగం చేశారా? ఎప్పుడైనా ? మీ అంత:కరణంలో సాంసారిక పరమైన సంకల్పం కలుగనే కలుగదా? ఒకవేళ అలా లేకుంటే మరి మీకింత అహంకారం ఎందుకు కలగాలి? బాహ్య కర్మలన్నీ మీరు చేస్తూనే ఉన్నారు కదా? సెలవీయండి స్వామీ!

 *పండితుడు* - సత్యమే! ఇది నాలో లేని విషయమే! ఇప్పుడు నాలోని దోషాలన్నింటినీ తెలుసుకున్నాను. ఇప్పటివరకు కేవలం అర్థమే చెబుతూవచ్చాను. గూఢార్థం అసలు తెలుసుకోనేలేదు. నేను సంపూర్ణంగా అనభిజ్ఞుణ్ణి! కొద్దిగా ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది! ఇప్పుడు నీవు ఆనుమతిస్తే బాహ్యాభ్యంతరాలకర్మలనన్నిటినీ వదలి నిజమైన సన్యాసిని అవుదామనుకుంటున్నాను' అని పలికి పండితుడు అన్నింటినీ త్యాగం చేసి ఇంటినుండి బయలుదేరాడు.

 *భార్య* - 'స్వామీ! నేనూ మీతో వుంటూ మీ మార్గాన్నే నడుస్తాను' అని భార్య ప్రాధేయపడింది.

 *పండితుడు* - నేనిక ఏ జంజాటాన్నీ వుంచుకోదలచలేదు. మరి స్త్రీనెలా దగ్గరుంచుకుంటాను?

 *భార్య* - నన్ను జంజాటమనుకోకండి స్వామీ! మీ సాధనలో నేనేమీ మీ కడ్డుపడను. ఈ రోజు మిమ్ములను రాజుగారి దగ్గరకు పంపింది ధనం కోసం అనుకుంటున్నారా? ఎన్నటికీ కాదు! మీరు మీ జీవిత లక్ష్యాన్ని పొందటానికై ధనాన్ని ఒక నిమిత్తమాత్రంగా వాడుకున్నాను. రాజు తత్త్వజ్ఞుడు, జీవన్ముక్తుడైన మహాపురుషుడు. మీరు ధర్మజ్ఞులు, సదాచార సంపన్నులు, త్యాగి, సంతృప్తులు మరియు విద్వాంసులూను. 

🌺 తత్త్వజ్ఞుడైన రాజు యొక్క సాంగత్య ప్రభావంవలన మీకు పరమాత్మ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ ఉద్దేశ్యంతోనే మిమ్మల్ని అక్కడకు పంపాను. నా కోరిక తీరింది. ఇప్పుడు మీరు అనుజ్ఞ ఇస్తే మీతో నేనూ వద్దామని కోరిక.

 *పండితుడు* - (కృతజ్ఞతాపూర్వకంగా) ఇప్పుడీ విషయం అర్థమైంది నాకు. నిజంగా నీనుండి నాకెట్టి హానీ కలుగదు. నిజంగా నీవే నాకు అసలైన మహోపకారం చేసిన మంచి మనసున్న దానివి. తమ ప్రియమైన వారికి భగవత్ప్రాప్తిని కలిగించటంలో దోహదపడే వారే నిజమైన మంచి మనసుకలవారు (సహృదయులు). పద! అక్కడ కూడా నీవు నాకు పరమాత్మ ప్రాప్తి కలగడంలో సాయపడుదువు గాని!' అన్నాడు.

🌺 అటు తరువాత వారిద్దరూ సర్వమూ త్యాగం చేసి ఇంటినుండి వెళ్ళిపోయారు. ఇక్కడ, గూఢచారి రాజుగారి దగ్గరకు వెళ్లి పండితుని ఇంట జరిగినదంతా పూసగుచ్చినట్లు తెలిపాడు. రాజు తన రాజ్యాన్ని, ధనాగారాన్ని, తనపుత్రునికి ముందే అప్పచెప్పాడు. గూఢాచారి మాటలను విని తానుకూడా రాజ్యాన్ని విడిచి వెళ్లిపోయాడు. మార్గమధ్యంలో రాజుగారికి బ్రాహ్మణ దంపతులెదురయ్యారు. రాజు ఉల్లాసంగా 'బ్రాహ్మణోత్తమా! మీరు ఇప్పుడా గీతాశ్లోకానికున్న గూఢార్థాన్ని తెలుసుకున్నారు!' అన్నాడు.

🌺 'ఇంకా తెలుసుకోలేదు మహారాజా! తెలుసుకోవటానికే బయలుదేరాను' అన్నాడు పండితుడు.

🌺 రాజు కూడా ఆయన వెంట నడిచాడు. ఆముగ్గురూ ఏకాంతంగా వున్న పవిత్రమైన ప్రదేశంలో నివసించసాగారు. రాజు, బ్రాహ్మణునిభార్య వీరిద్దరూ తత్త్వజ్ఞానులూ, జీవన్ముక్తులూ ఐనవారే! వీరి సాంగత్యంలో పండితుడు కూడా పరమాత్మ ప్రాప్తిని పొందగలిగాడు.

No comments:

Post a Comment