*తల్లి అనుగ్రహం.....*
*శ్వేతాంబరధరేదేవి నానాలంకార భూషితే*
*జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే*
*అంటూ శ్రావణ శుక్రవారాలు మహాలక్ష్మి దేవీ పూజను స్త్రీలందరూ ఆనందోత్సవాలతో జరుపుకొంటారు.*
*ఆ వైకుంఠవాసుని ఇల్లాలుగా, మహావిష్ణు వక్షస్థలస్థితగా, సర్వదేవతలచేత కొనియాడబడే మహాలక్ష్మిగా, సముద్రుని కుమార్తెగా, చంద్రుని సహోదరిగా ఉన్న లక్ష్మీదేవి శుక్రవారం పూజించాలని మహాదేవుడే పార్వతీదేవికి చెప్పినట్టు పురాణ కథనం. స్వయంగా లక్ష్మీ దేవినే చారుమతి అనే స్త్రీ ఇంటికి వచ్చి పౌర్ణమికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను కొలువు అని చెప్పిందట. ఆ తల్లి ఆజ్ఞమేరకే చారుమతి తన తోడి స్త్రీలందరినీ పిలిచి లక్ష్మీ దేవిని పూజించింది. ఆ తల్లి అనుగ్రహించి తనను పూజించిన అందరికీ అనేకాను వరాలనిచ్చింది. చారుమతి నాకే కాక స్త్రీలందరికీ కూడా మీ అనుగ్రహాన్ని పంచమని వేడుకుంది.*
*అందుకే నాటి నుంచి నేటివరకు స్త్రీలంతా వరలక్ష్మీ వ్రతం చేసుకొంటారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతుంటారు. ఈ లక్ష్మీ దేవినే వైకుంఠ వాసుని ఇల్లాలిగా ప్రసిద్ధి చెందింది. చంద్రుని సహోదరిగా వాసికెక్కింది. గజలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయ లక్ష్మి, గజలక్ష్మి, వీరలక్ష్ములుగా అనే కళలూ కూడా ఈ లక్ష్మీ దేవివే. ‘సరసిజ నిలయే సరోజహస్తే ధవళ తమాంశుక గంధ మాల్య శోభే, భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసేద మహ్యం” అంటూ ఆదిశం కరులు లక్ష్మీ దేవిని స్తుతించిన అమ్మవారు కూడా ఈ లక్ష్మీ దేవినే. తొమ్మిది తోరాలతో కూడిన తోరానికి గ్రంథిపూజ చేసి ఆతరువాత ఆ తోరాన్ని తన మణి కట్టున ధరించి, తనతో పూజ చేయడానికి వచ్చిన స్త్రీలందరికీ ఈ తోరాన్ని కట్టి దీక్ష వహించి కోరిన వరాలనిచ్చే తల్లిని వరలక్ష్మిగా భావించి అష్టోత్తర శతనామాలతో పూజించేతల్లి వరాలనిచ్చే వరలక్ష్మి దేవి అని మాఇంట పూజిస్తాము. మా ఇంటి దైవంగా మేము లక్ష్మీ దేవిని ఆరాధిస్తాం.*
*┈┉━❀꧁ మాత్రేనమః ꧂❀━┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌻📿🌻 🙏🕉️🙏 🌻📿🌻
No comments:
Post a Comment