Friday, August 1, 2025

 *యజ్ఞవిద్య.....* 

* *వేదంలో వర్ణించిన కర్మకాండను యజ్ఞవిద్య అంటారు.* 
* *ఉపాసనా విధానాన్ని మహావిద్య అంటారు.* 
* *జ్ఞానకాండను గుహ్యవిద్య అంటారు.* 

* *ఇవి మూడూ క్రమగతిలో సాగించినప్పుడే ఆత్మవిద్య పట్టుబడుతుంది.*

* *ఆత్మవిద్యను సాధించనిదే జీవులకు విముక్తి లభించదు.*

* *అట్టి ఆత్మవిద్యను అనుగ్రహించేది లక్ష్మియే అని ఇంద్రకృత లక్ష్మీస్తోత్రం చెబుతోంది.*

* *లక్ష్మీదేవత తన చుట్టూ అనేక శక్తులతో ప్రకాశిస్తూ ఉంటుంది.* 

* *ఆ శక్తులకు కీర్తి, ఆశ, శ్రద్ధ, నీతి, ధర్మం, తేజస్సు, ఉత్సాహం... అనే పేర్లున్నాయి.* 

* *ఈ శక్తులన్నీ సూర్యుడిని కిరణాలు కొలిచినట్లు కొలుస్తాయి.* 

* *ఆవిడ వద్ద శంఖ పద్మాది నిధి దేవతలుంటారు. ఆ దేవతలు సంపదలు తరిగిపోకుండా ఇస్తారు.*

*త్వం సిద్ధిస్త్యం సుధా స్వాహా స్వధా త్వం లోకపావనీ*
*సంధ్యా రాత్రిః ప్రభ భూతిర్మేదా శ్రద్ధా సరస్వతీ*

*┈┉━❀꧁మాత్రేనమః꧂❀━┉┈*
          *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌺📿🌺 🙏🕉️🙏 🌺📿🌺

No comments:

Post a Comment